Monday, May 6, 2024

నారా లోకేష్ ను కలిసిన మంగళగిరి ముస్లింలు..

తప్పక చదవండి

అమరావతి : మంగళగిరి పాతబస్టాండు వద్ద ముస్లిం మైనారిటీలు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. రంజాన్, బక్రీద్ పండుగల రోజున ప్రార్థనలు చేసుకోవడానికి స్థలాలు సరిపోవడం లేదని వెల్లడి.. స్మశాన వాటికకు కూడా స్థలం సరిపోక ఇబ్బందులు పడుతున్నాం. ప్రార్థన స్థలాలు, స్మశానం, కమ్యూనిటీ హాలు, షాదీఖానాల కోసం 5 ఎకరాల స్థలం కేటాయించాలి. ముస్లింలు ఆర్థికంగా ఇబ్బందిపడుతున్నారు.. చేతివృత్తులు, ఇతర వ్యాపారాలు చేసుకోవడానికి ఆర్థిక సాయం అందించాలి. ముస్లింలు వ్యాపారాలు చేసుకోవడానికి షాపింగ్ కాంప్లెక్స్ లు నిర్మించాలని కోరారు..

ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ… జగన్మోహన్ రెడ్డికి ముస్లిం మైనారిటీల ఆస్తులపై ఉన్న శ్రద్ధ… వారి సంక్షేమంపై లేదు. వైసిపి అధికారంలోకి వచ్చాక వేలకోట్ల రూపాయల వక్ఫ్ బోర్డు ఆస్తులు అన్యాక్రాంతమయ్యాయి. మసీదు ఆస్తుల పరిరక్షణ కోసం ప్రయత్నించిన ఇబ్రహీంను నర్సరావుపేటలో దారుణంగా నరికిచంపారు. టిడిపి అధికారంలోకి రాగానే మంగళగిరిలో ముస్లింలు కోరిన విధంగా 5ఎకరాల స్థలం కేటాయిస్తాం. ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటుద్వారా ముస్లింలకు సబ్సిడీ రుణాలు అందజేసి ఆర్థిక చేయూతనిస్తాం. మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ లలో ముస్లింలకు షాపులకు కేటాయిస్తాం అని హామీ ఇచ్చారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు