Monday, September 9, 2024
spot_img

రేవంత్ రెడ్డి అహంకార వ్యాఖ్యలను ఖండిస్తున్నాను..

తప్పక చదవండి
  • వెల్లడించిన కూరెళ్ళ వేములయ్య గౌడ్..

హైదరాబాద్ : బహుజన కులానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై అహంకారంతో, అధికార దాహంతో ఒళ్ళు కొవ్వెక్కి నోటికి వచ్చిన విధంగా మాట్లాడుతున్న టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఖబర్దార్…! అని హెచ్చరించారు కూరెళ్ల వేములయ్య గౌడ్.. గతంలో కూడా ఇలాగే ప్రవర్తించావు. బడుగు, బలహీన వర్గాలంటే నీకు చీమలతో సమానంగా బలుపెక్కి మాట్లాడుతున్నావ్..బడుగు, బలహీనవర్గాల కులాలకు చెందిన నాయకులైన, ప్రజలైన నీకు ఒక చిన్న చూపుగా మాట్లాడడం అలవాటుగా మారింది. బడుగు బలహీన వర్గాల ఓట్లతో గద్దనెక్కే నీలాంటి మృగాలకు అతి తొందరలో బడుగు, బలహీన వర్గాలు చెంప చెల్లుమనే విధంగా బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి బిడ్డ రేవంత్ తస్మాత్ జాగ్రత్త…! అధికారమంటే మా సొంతం అనే బలుపుతో గతంలో బహుజన కులాలను కించపరుస్తూ రాజ్యాధికారంలో మేమే ఉండాలే అనే అహంకారంతో బడుగు, బలహీనవర్గాలని అణచివేసే దురాహంకారానికి పాల్పడుతున్నావు. నీలాగా ఓటుకు నోటు కేసులో జైల్ లో చిప్పకూడు తిని, ఢిల్లీ నాయకుల చెప్పులు నాకే నాలుగు రకాల నాయకుల మోచేతి నీళ్లు తాగే నీ బ్రతుకు ఎక్కడ..? తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగాలను వదిలేసి ప్రాణాలు సైతం లెక్కచేయకుండా తెలంగాణ ఉద్యమంలో పోరాడిన బహుజన నాయకుడు శ్రీనివాస్ గౌడ్ త్యాగం ఎక్కడ..!

అహంకారంతో చరిత్రను మరిచావేమో..! నీలాగా బలుపెక్కిన మహా సర్పాన్ని కూడా చలి చీమలు సైతం మట్టి కరిపించిన చరిత్రను గుర్తుచేసుకో బిడ్డా బుడ్డర్ఖాన్..! వెంటనే బేషరతుగా శ్రీనివాస్ గౌడ్ కి క్షమాపణ చెప్పకపోతే నీ ఇల్లు ముట్టడించి, నిన్ను తెలంగాణ నుంచి తరిమికొట్టే వరకు ఊరుకోదు ఈ బహుజన సమాజం అని హెచ్చరిస్తున్నాం.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు