- ఆడ్వాన్స్ డ్ వెపన్స్ అండ్ ఎక్విప్మెంట్ ఇండియా లిమిటెడ్ వారి తయారీ..
- ఆగస్టు 18 న విడుదల కానున్న ప్రభల్..
- 50 మీటర్ల రేంజ్ ఈ రివాల్వర్ స్పెషాలిటీ..
కాన్పూర్ : ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లోని ప్రభుత్వ యాజమాన్య సంస్థ అడ్వాన్స్‌డ్ వెపన్స్ అండ్ ఎక్విప్మెంట్ ఇండియా లిమిటెడ్ తయారు చేసిన భారతదేశపు మొట్టమొదటి లాంగ్ రేంజ్ రివాల్వర్ ‘ప్రబల్’ ఆగస్టు 18న విడుదల కానుంది. కాగా గతంలో తయారుచేసిన రివాల్వర్ రేంజ్ కేవలం 20 మీటర్లు కాగా ఈ కొత్త వర్షన్ దాదాపు 50 మీటర్ల వరకు రేంజ్ కలిగి ఉంది. ముఖ్యంగా మహిళల భద్రతలో సైతం ఈ రివాల్వర్ కీలక పాత్ర పోషించనుంది. అత్యంత తక్కువ బరువుతో దాదాపు డబల్ రేంజ్ తో వచ్చిన ఈ రివాల్వర్ పట్ల మహిళలు సైతం ఆసక్తి చూపే అవకాశం ఉంది.