Wednesday, May 15, 2024

ప్రజలను ఆకట్టుకుంటున్న మధు మ్యానిఫెస్టో

తప్పక చదవండి
  • పటాన్‌ చెర్‌ పబ్లిక్‌ కోసం ప్రత్యేక మ్యానిఫెస్టో
  • నీలం మధు అన్న భరోసా పేరుతో విడుదల
  • వ్యవసాయ, ఆరోగ్యం, ఆడపడుచులు,విద్యార్థులు..
  • యువత, నిరుద్యోగులు, మౌళిక సదుపాయాలు..
  • వృద్దులు, వికలాంగులు, కార్మికులు, నిరుపేదలకు పెద్దపీట

హైదరాబాద్‌ : సాధారణంగా రాజకీయ పార్టీలు ఎన్నికల నేపథ్యాన్ని పురస్కరించుకొని ఆయా పార్టీలకు సంబంధిం చిన ఎలక్షన్‌ మ్యానిఫెస్టోను ప్రకటించడం ఆనవాయితీ. ఆ మ్యానిఫెస్టోనే ఒక విధంగా ఆపార్టీ తరపు అభ్యర్థులకు ప్రచారంలో ఆక్సిజన్‌ లాంటిది. కానీ,ఇప్పుడు ఈ ట్రెండ్‌ మార్చేశారు బీఎస్పీ పటాన్‌ చెర్‌ ఎమ్మెల్యే క్యాండిడేట్‌ నీలం మధు. బీఎస్పీ తరపున బరిలో నిలిచిన మధు ఈమధ్య ప్రకటించిన తన ఎన్నికల మ్యానిఫెస్టో పటాన్‌ చెర్‌ సెగ్మెంట్‌ లో సంచలనంగా మారింది. ఈసారి పటాన్‌ చెర్‌ ప్రజలు తనను గెలిపిస్తే ఏం చేస్తానో వివరిస్తూ..నీలం మధు అన్న భరోసా పేరుతో పటాన్‌ చెర్‌ అభివృద్ధి కోసం నీలం మధు అన్న 10 భరోసాలు అంటూ మ్యానిఫెస్టోను విడుదల చేశ్షారు. ఈ మ్యానిఫెస్టోలో అన్ని వర్గాలకు సముచిత ప్రయార్టీ దక్కేలా జాగ్రత్తలు తీసుకున్నారు.

వ్యవసాయం, ఆరోగ్యం, ఆడపడుచులు, విద్యార్థులు, యువత, నిరుద్యోగులు, మౌళిక సదుపాయాలు, వృద్దులు, వికలాంగులు, కార్మికులు, నిరుపేదలకు తన ఎన్నికల మ్యానిఫెస్టోలో పెద్దపీట వేశారు. సుపరిపాలనకు మ్యానిఫెస్టోలో ప్రయార్టీ కల్పించారు. సెగ్మెంట్‌ లోని ప్రతీ మండల కేంద్రానికి ఒక యూనిట్‌ చొప్పున ట్రాక్టర్‌ అందజేత, కోల్డ్‌ స్టోరేజీల నిర్మాణం,భూసారా పరీక్షా కేంద్రాల ఏర్పాటు, పండ్లు-కూరగాయాలకు హోల్‌ సేల్‌ మార్కెట్ల ఏర్పాటు,డైరీ ప్లాంట్ల నిర్మాణం,అధునాతన సౌకర్యాలతో నాన్‌ వేజ్‌ మార్కెట్ల ఏర్పాటు వంటి హామీలను మ్యానిఫెస్టోలో పొందుపర్చారు. అయితే రైతుల కోసం మధు ఇచ్చిన ఈ హామీలు ఇప్పుడు అన్నదాతల్లో ఆయనకు సానుకూల అంశాలుగా మారాయి. మరోవైపు తన మ్యానిఫెస్టోలో మధు ఆరోగ్యానికి కూడా పెద్దపీట వేయడం సెగ్మెంట్‌ ప్రజలను బాగా ఆకర్షిస్తోంది. తాను ఎమ్మెల్యేగా గెలవగానే నియోజకవర్గ స్థాయిలో ఓ మల్టీ స్పెషాలీటి ఆసుపత్రి నిర్మాణం,గ్రామీణ ప్రాంత ప్రజల అవసరాల కొరకు ఉచిత అంబులెన్స్‌ ఏర్పాటు,6 నెలలకొకసారి హెల్త్‌ క్యాంప్‌ ల నిర్వాహన వంటి అంశాలు ఆయనకు సానుకూల అంశాలుగా మారాయి.

- Advertisement -

వీటితో పాటు మహిళా సంఘాల కోసం ఎమ్మెల్యే నిధులు కేటాయిస్తానని ప్రకటించడం మధుకు మంచి మైలేజ్‌ తెచ్చిపెట్టే అంశంగా మారింది. పేదింటి బిడ్డలకు పుస్తె,మట్టెల అందజేత వంటి ప్రకటనలు కూడా ఆయనకు ఈసారి కలిసోచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మ్యానిఫెస్టో విద్యార్థులకు ప్రయార్టీ కల్పించడం వల్ల వారి ఓట్ల మార్జిన్‌ ను కూడా నీలం పెంచుకోగల్గారనే చర్చ నియోజకవర్గంలో కొనసాగుతోంది. విద్యలో రాణించిన పేద విద్యార్థులకు ఆర్థిక సాయం,నైపుణ్య శిక్షణా కేంద్రాల ఏర్పాటు, స్టడీ హాల్స్‌ ఏర్పాటు,స్పోర్ట్స్‌ అకాడమీ,ఇండోర్‌,ఔట్‌ డోర్‌ స్టేడియాల నిర్మాణం,క్రిడా పోటీల నిర్వాహన వంటి హామీలు స్టూడెంట్స్‌,యువతను ఆకర్షిస్తున్నాయి. అందువల్ల ఆయా వర్గాల ఓట్లు కూడా నీలం మధుకు ఈసారి అధిక సంఖ్యలో పడే అవకాశాలు మెండుగా ఉందనే డిస్కషన్‌ నడుస్తోంది. వీటితో పాటు నిరుద్యోగ యువత కోసం 10 శాతం ఎమ్మెల్యే నిధుల కేటాయింపు,పరిశ్రమల్లో స్థానిక యువతకు 50 శాతం ఉద్యోగాల కేటాయింపు,జాబ్‌ మేళల నిర్వహణ వంటి హామీలు కూడా ఆయనకు ఈసారి ఎన్నికల్లో లాభించే ఛాన్సెస్‌ కనిపిస్తున్నాయి.

అంతేకాక పటాన్‌ చెరు నియోజకవర్గానికి సంబంధించిన మౌళిక సదుపాయాల కల్పనపై ఆయన చేసిన ప్రామిసెస్‌ కూడా ఈసారి ఎన్నికల్లో మధుకు ప్లస్‌ గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. వృద్ధులు,వికలాంగులకు మధు వరాలు ప్రకటించడం ఆయా వర్గాల్లో నీలంకు మంచి పేరును తెచ్చి పెట్టాయనే చెప్పాలి. అర్హులైన వారికి ఫించన్లు ఇప్పించడం,ఆనాధాశ్రయం ఏర్పాటు,100 శాతం రేషన్‌ కార్డుల మంజూరు,వికలాంగుల స్వయం ఉపాధి కొరకు ఆర్థిక సాయం వంటివి సానుకూల అంశాలు మారాయి. వీటితో పాటు కార్మికులు,నిరుపేదల కొరకు 100 గజాల ఇళ్ల స్థలాల కేటాయింపు,సీఎస్‌ఆర్‌ నిధులతో అర్హులైన వారికి ప్రతి ఒక్కరికి ఇంటి నిర్మాణం,ప్రతీ మండల కేంద్రంలో రూ.5కే భోజన వసతి సదుపాయం,కార్మికులకు హెల్త్‌ ఇన్సూరెన్స్‌ వంటి హామీలు కూడా ప్రచారంలో మధుకు కలిసోస్తు న్నాయి. దీంతో పాటు నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధి కోసం మధు మ్యానిఫెస్టోలో పొందుపర్చిన హామీలు పబ్లిక్‌ లో నీలంకు మంచి మైల్ఱేజ్‌ ను తెచ్చిపెడుతున్నాయి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు