Monday, April 29, 2024

పేదల బాధలు తిర్చేది కాంగ్రెస్‌ పార్టీ

తప్పక చదవండి
  • మర్రి గోరంత చేసి కొండంత ప్రచారం
  • గ్రామాలు ఏలాంటి అభివృధికి నోచుకోలేదు
  • పేదల ఇండ్ల నిర్మాణాలపై చిత్తశుద్ధి లేదు
  • బీఆర్‌ఎస్‌ అక్రమాలే హస్తం విజయ సోపానాలు
  • కందనూలులో కాంగ్రెస్‌ గెలుపు ఖాయం
  • కాంగ్రెస్‌ అభ్యర్థి డాక్టర్‌ కూచకుళ్ల రాజేష్‌ రెడ్డి

రాష్ట్రంలో, నాగర్‌కర్నూల్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ గెలుపు ఖాయమైందని, బీఆర్‌ఎస్‌ అవినీతి, అక్రమాలే విజయ సోపానాలని కాంగ్రెస్‌ అభ్యర్థి, డాక్టర్‌ కూచకుళ్ల రాజేష్‌ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం బిజినేపల్లి, కాలనీలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమం పేరుతో దోపిడీ జరిగింది అన్నారు. గ్రామాల్లో జరిగిన అభివృద్ధి శూన్యం అన్నారు. ఎమ్మెల్యే మర్రి జనార్థన్‌ రెడ్డి గోరంత చేసి కొండంత ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. పాలమూరు ప్రాజక్డు పేరుతో వట్టెం గుట్ట, చెరువుల్లో నల్లమట్టి కొల్లగొట్టి జేబులు నింపుకున్నారని ఆరోపించారు. పరిహారం రాక కుమ్మెరలో రైతు అల్లాజి ఆత్మహత్య చేసుకున్నారన్నారు. నియోజకవర్గం డబుల్‌ బెడ్రూం ఇండ్లు కట్టించలేదని, వట్టెంలో ఓ కుటుంబం బాత్రూంలో నివసిస్తుంటే ఎమ్మెల్యే పట్టించుకోలేదన్నారు. కానీ గృహలక్ష్మి ఇండ్లు ఇస్తానని, తమ సొంత ఆస్తి రాసి ఇస్తామంటూ ఇప్పుడు నాటకాలకు తెరతీశారని ఆరోపించారు. గ్రామాలలో ఏలాంటి అభివృధి జరగలేదని కాంగ్రెస్‌ పార్టీ రాజశేఖర్‌ రెడ్డి హయాంలో జరిగిన అభవృద్ధి అని, ప్రతి గ్రమంలో కాంగ్రెస్‌ పార్టీ ఇందిరమ్మ ఇండ్లు ప్రతి నిరుపేద కుటుంబానికి ఇచ్చిన ఘనత సోనియా గాంధీదే అని అన్నారు. ఎమ్మెల్యేకు పేదల ఇండ్ల నిర్మాణాలపై చిత్తశుద్ధి లేదని పార్టీ ఆఫీసు కట్టారని, సొంతూళ్లో డబుల్‌ అంతస్తుల ఇండ్ల నిర్మాణాలు జరిగాయన్నారు. ప్రజలు ఎమ్మెల్యే తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, ఎమ్మెల్యే బెదిరింపులు, అక్రమ కేసుల భయంతో దినదినగండంగా బ్రతుకుతున్నారని అన్నారు. ఇకపై మర్రి నియంతృత్వం, అక్రమ కేసులకు కాలం చెల్లిందన్నారు. కాంగ్రెస్‌ గెలుపు ఖాయమైందని, నాగర్‌కర్నూల్‌ లోనూ కాంగ్రెస్‌ పార్టీ అధికారం లోకి రావాలంటే ప్రతి ఒక్కరు హస్తం గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీ తో గెలిపించలని పిలుపునిచ్చారు.

కాంగ్రెస్‌ లో భారీగా చేరికలు
ఎమ్మెల్యే నియంతృత్వ విధానాలు నచ్చక వెల్గొండలో మర్రి దళిత దండు ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌ నాయకులు పెద్ద ఎత్తున రాజేష్‌ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ లో చేరారు. అలాగే లట్టుపల్లి తండాలోని దాదాపు 300 మంది గిరిజనులు హైదరాబాదులో ఎంఎల్సీ దామోదర్‌ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ లో చేరారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీని, నిజాయితీ పరుడైన రాజేష్‌ రెడ్డిని భారీ మెజారిటీతో గెలవడం ఖాయమన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు