Sunday, May 5, 2024

ట్రాక్‌ తప్పిన గంటా..!

తప్పక చదవండి

తెలంగాణ స్టేట్‌ రిమోట్‌ సెన్సింగ్‌ అప్లికేషన్‌ సెంటర్‌ లో అవినీతి తిమింగలం

  • విచ్చలవిడి అవినీతికి పాల్పడ్డ ఏడీజీ గంటా శ్రీనివాస్‌ రెడ్డి..!
  • ఏళ్లుగా ఒకే పోస్టులో పాతుకుపోయిన వైనం
  • రిటైర్డ్‌ అయినా ఉత్తర్వులు లేకుండా అదే పోస్టులో కొనసాగింపు
  • గత బీఆర్‌ఎస్‌ సర్కార్‌ హయాంలో ఇష్టారాజ్యం
  • ఏడీజీగా ఒక్క ప్రాజెక్టునూ ట్రాక్‌ ను తేలేని పరిస్థితి
  • కానీ, పాత ప్రాజెక్టుల పైసలు మాత్రం దిగమింగిన దొంగ..!
  • గవర్నింగ్‌ బాడీ అనుమతి లేకుండానే కీలక నిర్ణయాలు
  • గంటా అవినీతి బట్టబయలు చేసిన అకౌంటెట్‌ జనరల్‌ నివేదిక
  • ప్రభుత్వం నజర్‌ పెడితే గుట్టురట్టు కానున్న గంటా అవినీతి లీలలు

హైదరాబాద్ : తెలంగాణ స్టేట్‌ రిమోట్‌ సెన్సింగ్‌ అప్లికేషన్‌ సెంటర్‌ (ట్ష్రాక్‌)లో కంచె చేను మేసినట్లుంది పరిస్థితి. సంస్థ బాగోగుల కోసం తన సహాయ, సహకారాలను అందించాల్సింది పోయి.. సంస్థనే నిండా ముంచేశారు ట్రాక్‌ బాస్‌. నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు.. కాసుల కోసం ఏ పని చేస్తే ఏంటనే ధోరణితో వ్యవహరించాడు ఈ అవినీతి అనకొండ. అయితే దీన్ని పట్టించుకోవాల్సిన అప్పటి ప్రభుత్వ పెద్దలు ఇతగాడి వ్యవహారాలను చూసిచూడనట్లు వదిలేయడం గమనార్హం. అంతేకాక గంటా కూడా తాను చేసిన దోపిడిలో ఎంతో కొంత ప్రభుత్వంలోని పెద్దలకు పంచ్ఱేయడం కొసమెరుపు. దీంతో ఇంకేముంది అర్హత లేకున్నా.. పదవీ విరమణ పొందినా.. అదే పోస్టులో ఎలాంటి ఉత్తర్వులు లేకుండా ఇప్పటికీ కొనసాగుతూ.. అడ్డగోలు సంపాదనకు ఏగబడ్డారు ట్రాక్‌ లోని ఏడీజీ శ్రీనివాస్‌ రెడ్డి.

- Advertisement -

తెలంగాణ స్టేట్‌ రిమోట్‌ సెన్సింగ్‌ అప్లికేషన్‌ సెంటర్‌(ట్ష్రాక్‌) రాష్ట్ర ప్రభుత్వంలోని పలు కీలక శాఖలకు గుండెకాయలాంటింది. పీఆర్‌, ఇరిగేషన్‌, సీసీఎల్‌ఏ, రోడ్లు-భవనాలు, వ్యవసాయం వంటి సుమారు 16 శాఖలకు కావాల్సిన శాటిలైట్‌ సమాచారాన్ని సేకరించి పెడుతుంది. ఆయా శాఖలు ఇచ్చే ప్రాజెక్టులను సైతం పూర్తి చేసి ఆ డిపార్ట్‌ మెంట్లు ఇచ్చే ప్రాజెక్టు డబ్బులు, ప్రభుత్వ నుంచి వచ్చే గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ ల నిధుల ద్వారా ట్రాక్‌ ను రన్‌ చేయాల్సి ఉంటుంది. అయిత్ఱే రాష్ట్ర స్థాయిలో ఇంతటి కీలకమైన ట్రాక్‌ లోకి బీఆర్‌ఎస్‌ తొలి ప్రభుత్వంలోనే ఓ అవినీతి తిమింగలం ఏంట్రీ ఇచ్చి తెలంగాణ స్టేట్‌ రిమోట్‌ సెన్సింగ్‌ అప్లికేషన్‌ సెంటర్‌ (ట్రాక్‌)ను భ్రష్టుపట్టించడం గమనార్హం.

డిప్యూటేషన్‌ పై వచ్చి మర్రిచెట్టులా పాతుకుపోయిన ఏడీజీ డాక్టర్‌ గంటా
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఇస్రోలో పనిచేస్తున్న డాక్టర్‌ గంటా శ్రీనివాస్‌ రెడ్డి డిప్యూటేషన్‌ పై తెలంగాణ స్టేట్‌ రిమోట్‌ సెన్సింగ్‌ అప్లికేషన్‌ సెంటర్‌ (ట్రాక్‌)లోకి అడుగు పెట్టారు. వాస్తవానికి ట్రాక్‌ లో ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోవాలన్న ముందస్తుగా గవర్నింగ్‌ బాడీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ, ఇస్రో నుంచి వచ్చిన ఏడీజీ డాక్టర్‌ గంటా శ్రీనివాస్‌ రెడ్డి సంస్థలో ఏడీజీ పోస్టు లేకున్నా.. ఆ పదవిని క్రియేట్‌ చేసుకొని ట్రాక్‌ లోకి డిప్యూటేషన్‌ పై అడుగుపెట్టడడం గమనార్హం. ఇక ఇతను ట్రాక్‌ లోకి అడుగుపెట్టిన వెంటనే తమ మార్క్‌ రాజకీయాన్ని మొదలెట్టారు. తన పదవీ కాలంలో ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టు కూడా ఇతర ప్రభుత్వ శాఖ నుంచి ట్రాక్‌ కు సరిగ్గా తేలేకపోయారు. 2016 నుంచి ఈయన పనిచేసిన 8 సంవత్సరాల కాలంలో ఒక్క ప్రాజెక్టును కూడా తీసుకురాలేదు. కానీ, గతంలో మృత్యుంజయ రెడ్డి ట్రాక్‌ కు డీజీగా ఉన్నప్పుడు సుమారు రూ.50 కోట్ల వరకూ వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన పనులు చేయడం జరిగింది. అయితే ఈమొత్తాన్ని గంటా ఏడీజీగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఏదో రకమైన ఖర్చుల పేరు చెప్పి పోతం పెట్టేయడం గమనార్హం.

మరోవైపు ఏడీజీ శ్రీనివాస్‌ రెడ్డి హయాంలోనే గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి ఒక పైలట్‌ ప్రాజెక్ట్‌ వచ్చింది. అప్పట్లో గ్రామాల్లోని ఆబాదీ పరిధిలను గుర్తించాలని గ్రామీణాభివ్రుద్ధి శాఖ నిర్ణయించింది. అందులో భాగంగానే ఈ బాధ్యతలను పీఆర్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌ మెంట్‌ డిపార్ట్‌ మెంట్‌ ట్రాక్‌ కు అప్పగించింది. అయితే అప్పటికే పెద్దగా ప్రాజెక్టులు లేక తెలంగాణ స్టేట్‌ రిమోట్‌ సెన్సింగ్‌ అప్లికేషన్‌ సెంటర్‌ ఇబ్బందిపడుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ ప్రాజెక్టుకు ట్రాక్‌ ఏడీజీగా ఉన్న శ్రీనివాస్‌ రెడ్డి ఒక్ఱే చెబితే పని అయిపోయేది. ట్రాక్‌ కు కూడా ఆర్థికంగా తోడ్పాటు దొరికేది. కానీ, గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి వచ్చిన ఆబాదీ ప్రాజెక్ట్‌ పై గంటా అయిష్టతను ప్రదర్శించడంతో.. ట్ష్రాక్‌ కు రావాల్సిన సోమ్ము కాస్తా ఇతర మార్గాల వైపు మళ్లింది.

డిప్యుటేషన్‌ పూర్తైన ఎక్స్‌ టెన్షన్‌.. పదవీ విరమణ పొందినా.. ట్రాక్‌ లోనే తిష్ట..!!

వాస్తవానికి ఇస్రో నుంచి ట్రాక్‌ కు గంటా శ్రీనివాస్‌ రెడ్డి 2016లో డిప్యుటేషన్‌ పై వచ్చారు. అప్పట్లో ఈయన డిప్యుటేషన్‌ ను కేవలం మూడు ఏళ్ల వరకే ఇస్రో అనుమతించింది. ఈనేపథ్యంలోనే గంటా పదవీ కాలం డిసెంబర్‌, 2020తో పూర్తైపోయింది. అయితే ట్రాక్‌ లో వచ్చిన అక్రమ ఆదాయానికి రుచి మరిగిన శ్రీనివాస్‌ రెడ్డి తనను ట్రాక్‌ లోనే కొనసాగించేందుకు అనుమతినివ్వాలని తన మాతృ సంస్థకు మరో 3 సంవత్సరాల పదవీ కాలం కోసం రిక్వెస్ట్‌ పెట్టుకున్నారు. అయితే శ్రీనివాస్‌ రెడ్డి పెట్టుకున్న అభ్యర్థనను ఇస్రో ఛైర్మెన్‌ తిరస్కరించడం విశేషం. అంతేకాక ప్లానింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌ డిపార్ట్‌ మెంట్‌ సెక్రటరీ రామకృష్ణ రావుకు ఇస్రో ఒక లేఖను పంపింది. శ్రీనివాస్‌ రెడ్డి డిప్యుటేషన్‌ గడువును పొడగించలేమని.. ఆయన స్థానంలో వేరే వారిని నియమించుకోవాలని సూచించింది. అయినప్పటికీ ఆయన రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దలను మ్యానేజ్‌ చేసుకొని ట్రాక్‌ ఏడీజీగా కొనసాగడం గమనార్హం. అంతేకాక పదవీ విరమణ పొందిన తర్వాత కూడా ప్రస్తుతం తెలంగాణ స్టేట్‌ రిమోట్‌ సెన్సింగ్‌ అప్లికేషన్‌ సెంటర్‌ లోనే కొనసాగుతుండడం విస్మయం కల్గిస్తోంది.

ప్రాజెక్టుల ద్వారా ట్రాక్‌ కు వచ్చిన ఆదాయ ఖర్చుల్లో భారీ గోల్‌ మాల్‌..!
మరోవైపు ట్రాక్‌ ఏడీజీగా గంటా ఉన్నప్పుడు పెద్దగా ఆదాయం రానప్పటికీ.. గత డీజీల హయాంలో ప్రాజెక్టుల ద్వారా వచ్చిన ఇన్‌ కమ్‌ ను పెద్ద ఎత్తున శ్రీనివాస్‌ రెడ్డి దుర్వినియోగం చేసినట్లు అర్థమవుతోంది. అందుకు 2017-18 నుంచి 2021-22లకు సంబంధించిన ట్రాక్‌ అకౌంటెట్‌ జనరల్‌ (ఆడిట్‌) లెక్కలను పరిశీలిస్తే గంటా అవినీతి లీలలు ఇట్టే అవగతమవుతాయి. ట్రాక్‌ కు 2017-18లో రూ.1,90,600 రెవెన్యూ ఆదాయం రాగా.. ఖర్చు మాత్రం రూ.4,02,35,915 పెట్టారు. అలాగే 2018-19లో రూ.1,66,79,546 ఆదాయ రాగా రూ.4,08,11,305 ఖర్చు పెట్టారు. 2019-20లో రూ.1,62,76,392 మొత్తం ఆదాయం రాగా..రూ.4,50,65,349 ఇన్‌ కమ్‌ ఖర్చు పెట్టడడం జరిగింది. 2020-21లో రూ.72,95,694 ఆదాయం రాగా.. రూ.4,48,07,433 ఖర్చు చేశారు. 2021-22 వార్షిక ఏడాదిలో రూ. 22,29,888 ఆదాయం రాగా రూ.3,69,23,626 ఖర్చు పెట్టడడం విశేషం. మొత్తంగా పై ఆదాయ.. ఖర్చుల వ్యత్యాసంతో పాటు సుమారు రూ.8 కోట్ల వరకూ కార్యాలయ రిన్నోవేషన్‌ పేరుతో ఏడీజీ గంట శ్రీనివాస్‌ రెడ్డి నొక్కేయడం విస్మయం కల్గిస్తోంది.

ఇక ఇదిలా ఉంటే ట్రాక్‌ లో ఏ నిర్ణయం తీసుకోవాలన్న దాని బైలా ప్రకారం ముందస్తుగా గవర్నింగ్‌ బాడీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. గవర్నింగ్‌ బాడీలో పీఆర్‌, ఇరిగేషన్‌, గ్రౌండ్‌ వాటర్‌, ఇతరత్రా శాఖల నుంచి సభ్యులు డైరెక్టర్లుగా ఉంటారు. కానీ, ప్రస్తుత ట్రాక్‌ ఏడీజీగా అనధికారంగా విధులు వెలగబెడుతున్న డాక్టర్‌ గంటా శ్రీనివాస్‌ రెడ్డి మాత్రం అసలు గవర్నింగ్‌ బాడీనే లెక్క చేయకపోవడం గమ్మత్తుగా ఉంది. గవర్నింగ్‌ బాడీతోని సంబంధం లేకుండానే మోనార్క్‌ మాదిరి నిర్ణయాలు తీసుకుంటుండడం గమనార్హం. ఫలితంగా గంటా ట్ష్రాక్‌ లో చేస్తున్న విచ్చలవిడి అవినీతితో ఆ సంస్థ భ్రష్టుపట్టేలా తయారైందనే చెప్పాలి. అందువల్ల కొత్త ప్రభుత్వం కనుక శ్రీనివాస్‌ రెడ్డి వ్యవహారంపై నజర్‌ పెట్టి.. ఆయనను ట్రాక్‌ ఏడీజీ బాధ్యతల నుంచి తప్పించి.. విచారణకు ఆదేశిస్తే మళ్లీ తెలంగాణ స్టేట్‌ రిమోట్‌ సెన్సింగ్‌ అప్లికేషన్‌ సెంటర్‌ దారికొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

గంట శ్రీనివాస్‌ రెడ్డికి గత ప్రభుత్వంలోని బడా నాయకుల అండతో.. వారు కలిసి చేసిన అవినీతి అక్రమాల భాగోతాలను మరో కథనం ద్వారా పూర్తి ఆధారాలతో మీ ముందుకు ఆదాబ్‌ హైదరాబాద్‌.. మా అక్షరం అవినీతిపై అస్రం…

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు