Tuesday, May 14, 2024

లోక్‌సభ భద్రతా వైఫల్యం

తప్పక చదవండి
  • కీలక నిందితుడు లలిత్‌ ఝూ లొంగుబాటు

న్యూఢిల్లీ : లోక్‌సభలో భద్రతా వైఫల్య ఘటనలో ఆరో వ్యక్తి, కీలక నిందితుడు అయిన లలిత్‌ ఝూ లొంగిపోయినట్లు ఢిల్లీ పోలీసులు శుక్రవారం తెలిపారు. అతనికి కోర్టు ఏడు రోజుల పోలీస్‌ కస్టడీ విధించినట్లు ప్రకటించారు. గురువారం రాత్రి లలిత్‌ లంగిపోయాడని, అతనిని 15 రోజుల పాటు కస్టడీకి అప్పగించాల్సిందిగా కోరినట్లు తెలిపారు. బీహార్‌కి చెందిన లలిత్‌ రaా కోల్‌కతాలో టీచర్‌గా పనిచేస్తున్నారని అన్నారు. సహోద్యోగులు, పొరుగువారు అతను శాంతంగా ఉండే వ్యక్తిగా పేర్కొన్నారని అన్నారు. రెండేళ్ల క్రితం కోల్‌కతా నుండి వెళ్లిపోయినట్లు తెలిపారు. ప్రముఖ స్వాతంత్య పోరాట యోధుడు భగత్‌ సింగ్‌ను చూసి లలిత్‌ ప్రేరణ పొందాడని అన్నారు. పార్లమెంట్‌ వెలుపల పొగను వదులుతున్న దృశ్యాలను వీడియో తీశారని, వాటిని అతని సన్నిహితుడు, ఎన్‌జిఓ వ్యవస్థాపకుడు నీలాకాష్‌ ఎయిచ్‌కు పంపారని తెలిపారు. ఈ వీడియోలు మీడియాలో వచ్చేవిధంగా చూడాలని లలిత్‌ కోరినట్లు వెల్లడిరచారు. బుధవారం నాటి ఘటనకు సంబంధించి అరెస్టు చేసిన ఐదుగురు నిందితులపై పోలీసులు చట్టవ్యతిరేక కార్యకలాపాల (నిరోధక) చట్టం (ఉపా) కింద కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. నిందితులు డి.మనోరంజన్‌, సాగర్‌, అమోల్‌ షిండే, నీలందేవిలను బుధవారం అదుపులోకి తీసుకోగా, మరో నిందితుడు విశాల్‌ను గురుగ్రామ్‌లో అరెస్ట్‌ చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు