Tuesday, May 21, 2024

కేసీఆర్‌ కనిపిస్తలేడు..!

తప్పక చదవండి

ట్విట్టర్‌ టిల్లుపై అనుమానమొస్తోందికరీంనగర్‌లో మసీదుకు 8 ఎకరాలు..
మందిరానికి 5 ఎకరాలు మాత్రమే కేటాయిస్తారా?

  • బీఆర్‌ఎస్‌ పార్టీ ఏ క్షణమైనా చీలే ప్రమాదముంది
  • వెంటనే కేసీఆర్‌ను ప్రజల ముందు ప్రవేశపెట్టాలి
  • మోడీ చెప్పింది తప్పని నిరూపించే దమ్ముందా?
  • భాగ్యలక్ష్మీ ఎదుట కేసీఆర్‌తో ప్రమాణం చేయిస్తారా?
  • ఆస్తులపై బహిరంగ ప్రకటన చేసే దమ్ముందా?
  • హిందువులంటే బీఆర్‌ఎస్‌కు అంత చులకనెందుకు?
  • కేసీఆర్‌ కుటుంబంపై నిప్పులు చెరిగిన ఎంపీ బండి

హైదరాబాద్‌ : పదిహేను రోజులయింది కేసీఆర్‌ కనిపిస్తాలేడు.. కేటీఆర్‌ పై అనుమానం ఉందని, బీఆర్‌ఎస్‌ పార్టీ ఏ క్షణమైనా నిట్టనిలువునా చీలే ప్రమాదముందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ తన కొడుకును సీఎంగా చేయాలనే విషయాన్ని ప్రధాని మోడీ బయటపెట్టడంతో ఆ కుటుంబంలో చిచ్చు రగిలిందని చెప్పారు. తన సడ్డకుడి కొడుకును కేసీఆర్‌ తన ఇంటికి క్షూడా రానీయడం లేదన్నారు. బీఆర్‌ఎస్‌ లో జరుగుతున్న పరిణామాలపై ఆ పార్టీ ఎమ్మెల్యేల్లో చర్చ జరుగుతోందని, ట్విట్టర్‌ టిల్లు నాయకత్వంలో ఎన్నికల్లోకి వెళితే.. డిపాజిట్లు కూడా రావనే భయం పట్టుకుందన్నారు. బుధవారం కరీంనగర్‌ లో బండి సంజయ్‌ మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్‌ కుటుంబంపై నిప్పులు చెరిగారు.
ప్రధానమంత్రి రెండ్రోజుల పర్యటనలో భాగంగా తెలంగాణ అభివృద్ధి కోసం రూ.20 వేల కోట్లకుపైగా కేటాయించినందుకు ధన్యవాదాలు తెలిపారు. దీంతోపాటు 9 ఏళ్లలో తెలంగాణ కోసం రూ.9 లక్షల కోట్లకుపైగా నిధులు ఖర్చు చేస్తూ అనేక అభివ్రుద్ది, సంక్షేమ ఫథకాలను అమలు చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. .యావత్‌ ప్రపంచం మోడీపట్ల సానుకూలతతో ఉంది. ప్రపంచంలో ఎక్కడికి పోయినా భారతీయులు తలెత్తుకునే పరిస్థితి వచ్చింది. ప్రజల్లో మోడీకి పెద్ద ఎత్తున వస్తున్న ఆదరణను చూసి బీఆర్‌ఎస్‌ నేతలు ఓర్వలేక పోతున్నారు. ప్రధాని గౌరవాన్ని తగ్గించేలా చిల్లరగా మాట్లాడుతున్నారు. అసభ్యంగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణపట్ల మోడీ విషయం చిమ్ముతున్నారని బీఆర్‌ఎస్‌ నేతలు చెప్పడం సిగ్గు చేటు. ముఖ్యంగా ట్విట్టర్‌ టిల్లు నిలువెల్లా విషం నింపుకున్నడు. మోడీపై విషం చిమ్ముతున్నడు. తెలంగాణలో అభివృద్ది పనులకు నిధులు కేటాయిస్తే కూడా విషం చిమ్మడం అవుతుందా?
ట్విట్టర్‌ టిల్లును సీఎం చేయాలనే విషయం బయట పడటంతో బీఆర్‌ఎస్‌ నేతలు భరించలేరు. ఎందుకంటే ట్విట్టర్‌ టిల్లు భాషను చూసి తెలంగాణ ప్రజలు అసహ్యించుకుంటున్నారనే విషయం అర్ధమైంది. ట్విట్టర్‌ టిల్లు నాయకత్వంలో ఎన్నికల్లోకి వెళితే ప్రజలు ఓడిస్తారనే భయం బీఆర్‌ఎస్‌ నేతలకు పట్టుకుంది. రాజకీయ భవిష్యత్‌ గురించి చర్చించుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ పార్టీ ఎప్పుడైనా నిట్టనిలువునా చీలే ప్రమాదం ఉంది. బీఆర్‌ఎస్‌ నేతలు చాలా మంది బీజేపీవైపు చూస్తున్నారు.మోడీని తిట్టాలని మంత్రులకు, ఎమ్మెల్యేలకు ట్విట్టర్‌ టిల్లు చెబుతున్నడట.. బిడ్డా.. మేం తిట్టడం మొదలు పెడితే బయటకు కూడా రాలేరు.నేనడుగుతున్నా.. కర్నాటక ఎన్నికల్లో వందల కోట్లు పంచింది నిజం కాదా? ఇతర రాష్ట్రాల నుండి వచ్చే నాయకులను స్పెషల్‌ ఫ్లైట్‌ లో తీసుకొచ్చి డబ్బు సంచులు ఇచ్చింది నిజం కాదా? ఇంత డబ్బు మీకు ఎక్కడి నుండి వచ్చింది. నేనడుగుతున్నా.. కేసీఆర్‌ సీఎం కాకముందు ఆ కుటుంబం ఆస్తి ఎంత? సీఎం అయ్యాక ఎన్ని రెట్లు పెరిగాయో బహిరంగంగా వెల్లడిరచే దమ్ముందా? బీజేపీని దెబ్బతీయడానికి ఇతర రాష్ట్రాల్లో వేల కోట్లు పెట్టబడులు పెట్టే స్థాయికి కేసీఆర్‌ వచ్చిండు. జాతీయ స్థాయి సీనియర్‌ పాత్రికేయుడు కూడా ఈ విషయాన్ని వెల్లడిరచిన మాట వాస్తవం కాదా? దీనిపై చర్చించే దమ్ముందా?.. బీసీ పీఎం అయితే బీఆర్‌ఎస్‌ నేతలు ఓర్వలేకపోతున్నారు. కేసీఆర్‌ కుటుంబం కంటే చీటర్‌ కుటంబం ప్రపంచంలోనే లేదు. మీ వ్యవహారశైలిని చూసి జనంతోపాటు మీ సొంత పార్టీ నేతలే అసహ్యించుకుంటున్నారు. బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు ఆలోచించాలి. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌ కొడుకు స్థాయి ఏమిటి? ముడుతల చొక్కా, అరిగిపోయిన రబ్బర్‌ చెప్పులేసుకుని తిరిగిన చరిత్ర నీది.. తెలంగాణ వచ్చేదా.. సచ్చేదా?… ఆ రొంపిలోకి కేసీఆర్‌ ను ఎందుకు దించుతున్నారు? చంపుతారా? ఏంటని ట్విట్టర్‌ టిల్లు అన్న మాట నిజమా కాదా? ఇప్పుడు నువ్వు చేస్తుందేమిటి? పదవులను అనుభవించుకుంటూ 4 కోట్ల తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నది నిజం కాదా? వాస్తవాలు మాట్లాడితే చేతగాని ఎంఐఎం, బీఆర్‌ఎస్‌ నేతలు.. మా ఇంటిపైకి, ఆఫీస్‌ పైకి దాడి చేయించడానికి వస్తున్నారు. మేం భయపడేటోళ్లం కాదు.. బీఆర్‌ఎస్‌ ఒంటరిగా పోటీ చేసి గెలవలేక ఎంఐఎంకు డబ్బులిచ్చి వాళ్లతో కలిసి కుట్రలు చేస్తున్నరు. మీరు రెచ్చిపోతే ఊరుకునే పార్టీ బీజేపీ కాదు.. కరీంనగర్‌ లో బీజేపీ లేకపోతే.. బీఆర్‌ఎస్‌ సపోర్ట్‌ తో ఎంఐఎం కరీంనగర్‌ మొత్తాన్ని కబ్జా చేసి అరాచకాలకు పాల్పడే ప్రమాదముంది. ప్రజలంతా ఆలోచించాలన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు