Friday, May 3, 2024

రైల్వే బోర్డు తొలి మహిళా సీఈవోగా జయావర్మ

తప్పక చదవండి
  • తొలిసారిగా మహిళకు ఛాన్స

న్యూఢిల్లీ : 105 ఏళ్ల రైల్వే మంత్రిత్వ శాఖ చరిత్రలో మొట్టమొదటిసారిగా రైల్వే బోర్డు ఒక మహిళలను సీఈవో మరియు చైర్‌పర్సన్‌గా జయ వర్మ సిన్హాను కేంద్రం ఈరోజు నియమించింది. ప్రపంచంలోనే సుదీర్ఘ చరిత్ర కలిగిన భారత రైల్వే బోర్డుకు నాయకత్వం వహించే అవకాశం తొలిసారిగా జయ వర్మకు దక్కింది.. ఇప్పటి వరకు అనిల్ కుమార్ లహోటీ రైల్వే బోర్డు ఛైర్మన్‌గా వ్యవహరించారు. జయా వర్మ ప్రస్తుతం ట్రాఫిక్ విభాగంలో అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నారు. అలాగే రైల్వే బోర్డులో కార్యకలాపాలు, బిజినెస్ డెవలప్‌మెంట్ విభాగం మెంబర్‌గా వున్నారు. ఈ క్రమంలో జయా వర్మను రైల్వే బోర్డు కొత్త చీఫ్‌గా నియమిస్తున్నట్లుగా రైల్వే శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు కేబినెట్ అపాయింట్‌మెంట్స్ కమిటీ ఆమోదం తెలిపింది. జయా వర్మ ఈ పదవిలో వచ్చే ఏడాది ఆగస్ట్ 31 వరకు ఈ పదవిలో కొనసాగనుంది. అలహాబాద్ యూనివర్సిటీలో చదువుకున జయా వర్మ.. 1988లో ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్‌లో చేరారు. ఉత్తర, ఆగ్నేయ, తూర్పు రైల్వే జోన్‌లలో ఆయా హోదాల్లో జయా వర్మ విధులు నిర్వర్తించారు. బంగ్లాదేశ్‌లోని భారత హైకమీషన్‌లో రైల్వే సలహాదారుగా నాలుగేళ్ల పాటు పనిచేశారు. నిజానికి ఈ ఏడాది అక్టోబర్ 1న ఆమె పదవి విరమణ చేయనున్నారు. ఇలాంటి దశలో జయావర్మకు రైల్వే బోర్డ్ ఛైర్మన్ పదవి దక్కడం విశేషం.

ఏడాది పదవీకాలం..

- Advertisement -

శ్రీమతి సిన్హా, అలహాబాద్ విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థి, 1988లో ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ లో చేరారు. ఉత్తర రైల్వే, సౌత్ ఈస్టర్న్ రైల్వే మరియు తూర్పు రైల్వే అనే మూడు రైల్వే జోన్‌లలో పనిచేశారు.సిన్హా అనిల్ కుమార్ లాహోటి తర్వాత సెప్టెంబర్ 1న బాధ్యతలు స్వీకరిస్తారు. ఆమె పదవీకాలం ఆగస్టు 31, 2024తో ముగుస్తుంది. సిన్హా అక్టోబర్ 1న పదవీ విరమణ చేయవలసి ఉంది. అయితే ఆమె మిగిలిన పదవీకాలానికి అదే రోజున తిరిగి ఉద్యోగంలో చేరతారు. ఒడిశాలో దాదాపు 300 మంది మృతి చెందిన బాలాసోర్ దుర్ఘటన నేపథ్యంలో, సంక్లిష్టమైన సిగ్నలింగ్ వ్యవస్థను మీడియాకు ఆమె వివరించారు. బంగ్లాదేశ్‌లోని ఢాకాలోని భారత హైకమిషన్‌లో రైల్వే సలహాదారుగా నాలుగు సంవత్సరాల పదవీకాలంలో, కోల్‌కతా మరియు ఢాకాలను కలిపే రైలు సర్వీస్ మైత్రీ ఎక్స్‌ప్రెస్ ప్రారంభోత్సవంలో ఆమె కీలక పాత్ర పోషించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు