- నిమ్స్‌లో వెల్‌నెస్ సెంటర్ ప్రారంభించిన మంత్రి
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక సీట్లతో హ్యాట్రిక్ కొడుతారని మంత్రి హరీశ్‌రావు అన్నారు. నిమ్స్ ఆస్పత్రిలో ఇంటిగ్రేటెడ్ వెల్‌నెస్ సెంటర్‌ను మంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో సీఎస్ శాంతికుమారి, ఆరోగ్య శాఖకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇంటిగ్రేటెడ్ వెల్‌నెస్ సెంటర్‌తో నిమ్స్‌లో ఒకేచోట ఆయుర్వేద, యోగా, నేచురోపతి, యునాని, హోమియోపతి సేవలు అందుబాటులోకి రానున్నాయన్నారు. ధాన్యం ఉత్పత్తిలో, డాక్టర్ల తయారీలో నంబర్ వన్‌గా తెలంగాణ రాష్ట్రం ఉందన్నారు. ప్రత్యామ్నాయ వైద్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. మరో రెండు వారాల్లో కొత్తగా 9 మెడికల్ కాలేజీలు ప్రారంభిస్తామని తెలిపారు. భూపాలపల్లి, సిద్దిపేటలో 50 పడకల ఆయుష్ ఆస్పత్రులు ఏర్పాటు చేస్తామని, ఈ ఏడాది 26 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వస్తాయని మంత్రి వెల్లడిరచారు. వైద్య ఆరోగ్య రంగాన్ని సీఎం కేసీఆర్ బలోపేతం చేస్తున్నారని, పల్లె పట్టణ ప్రగతిలో అన్ని జాతీయ అవార్డులు తెలంగాణకే వస్తున్నాయని మంత్రి చెప్పారు. ఎంబీబీఎస్ సీట్లలో దేశంలో తెలంగాణ నంబర్ వన్‌గా ఉందన్నారు. పది రాష్టాల్రకు అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగిందని, అన్ని రంగాల్లో తెలంగాణ అగ్రగామిగా ఉందని, కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్టాల్రు ఏ విషయంలో తెలంగాణతో పోటీయో చెప్పాలని మంత్రి హరీశ్ అన్నారు.