Monday, May 6, 2024

వచ్చే నెలలో 5 రోజుల పాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు

తప్పక చదవండి
  • సెప్టెంబరు 18 నుంచి 22 వరకు ఈ సమావేశాలు : కేంద్రం కీలక ప్రకటన
    న్యూఢిల్లీ : వచ్చే నెలలో ఐదు రోజుల పాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. సెప్టెంబరు 18 నుంచి 22 వరకు ఈ పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. అమృత కాల ఘడియల నేపథ్యంలో ఈ సమావేశాలు ఏర్పాటు చేసినట్టు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. ఉన్నట్టుండి ఈ ప్రకటన చేయడం వెనక కారణమేంటన్న చర్చ మొదలైంది. విశ్వసనీయ వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం…ఈ ప్రత్యేక సమావేశాల్లో దాదాపు 10 కీలక బిల్స్‌ని ప్రవేశపెట్టాలని భావిస్తోంది మోదీ సర్కార్. వీటిని కచ్చితంగా పాస్ చేసి ఆమోదం పొందేలా చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని, అందుకే ఈ బిల్స్‌ కోసమే ఈ స్పెషల్ సెషన్ పెడుతోందని సమాచారం. జులై 20 నుంచి ఆగస్టు 11వ తేదీ వరకూ వర్షాకాల సమావేశాలు జరిగాయి. మణిపూర్‌ అంశంపై రెండు సభలు దద్దరిల్లాయి. విపక్షాలు మోదీ సర్కార్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. దాదాపు రెండు వారాల పాటు ఈ తీర్మానంపై పార్లమెంట్‌లో వాగ్వాదం జరిగింది. ప్రధాని మోదీ మణిపూర్ అంశంపై చర్చించాల్సిందేనని విపక్షాలు పట్టుపట్టాయి. ఆ మేరకు ప్రధాని మోదీ సభకు హాజరయ్యారు. అవిశ్వాస తీర్మానంపై ప్రసంగించారు. విపక్షాలపై సెటైర్లు వేశారు. మణిపూర్‌పైనా ప్రకటన చేశారు. మొత్తానికి ఆ అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. మోదీ సర్కార్ నెగ్గింది. లోక్‌సభ ఎన్నికలకు ముందు జరిగిన సమావేశాలు కావడం వల్ల ఇంకాస్త వాడివేడి చర్చలు జరిగాయి. కానీ…ఇప్పుడు ఉన్నట్టుండి ప్రత్యేక సమావేశాలకు పిలుపునివ్వడంపై ఆసక్తి పెరుగుతోంది.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు