Monday, May 6, 2024

రంగులు వేయడానికి 3000 కోట్లు దుబారా చేసిన జగన్ రెడ్డి..

తప్పక చదవండి
  • రూ. 370 కోట్ల అవినీతి కనిపించిందంటే ఎవ్వరు నమ్ముతారు
  • జగన్ అవినీతి ముద్రను బాబుకు అంట గట్టాలని చూస్తున్నారు
  • కడిగిన ముత్యంలా చంద్రబాబు బయటకు రావడం ఖాయం
  • టీటీడీపీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం ఇంచార్జ్ వంచ శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్ :- తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడి అక్రమ అరెస్టును తెలుగుదేశం పార్టీ కరీంనగర్ పార్లమెంట్ ఇంచార్జ్ వంచ శ్రీనివాస్ రెడ్డి ఖండించారు. చంద్రబాబు చేసిన నేరమెంటో కోర్టులు కూడా తేల్చుకోలేకపోతున్నాయని అన్నారు. సిఐడి అధికారులు చంద్రబాబు ను అరెస్టు చేసి ఆధారాల కోసం వెతకడం చూస్తుంటే ఇది ఖచ్చితంగా అక్రమ కేసు అని నిర్ధారణ అవుతుందని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడం కోసం స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టును తెచ్చి 2.15 లక్షల మందికి శిక్షణ ఇచ్చి 80 వేల మందికి ఉద్యోగాలు కల్పించారని వంచ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇది నేరం ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించినందుకు సైకో జగన్ చంద్రబాబు పై దొంగ కేసులు పెట్టి జైలుకు పంపారని ఆరోపించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడం తప్ప?
ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని చంద్రబాబు నాయుడు ప్రతినిత్యం తపించేవారని టీటీడీపీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం ఇంచార్జ్ వంచ శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు యుద్ధ ప్రాతిపదికన ఈ పనులు చేయడం వల్లే నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు వచ్చాయని అన్నారు .చంద్రబాబుఅరెస్ట్ కక్ష సాధింపు చర్య మాత్రమేనని స్పష్టం చేశారు. నిజాయితీ నిరూపణకు సమయం పట్టవచ్చు, కానీ చివరకు న్యాయం, ధర్మమే గెలుస్తుందని ధీమా వ్యకతం చేశారు. పిచ్చి జగన్ చేతిలో ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి పిచ్చివాడి చేతిలో రాయిలా మారిందని ఎద్దేవా చేశారు. జగన్ రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు పన్నిన ఈసారి రెండు తెలుగు రాష్ట్రాలలో తెలుగుదేశం పార్టీ విజయాన్ని ఎవరు ఆపలేరని ఆయన ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు కడిగిన ముత్యంలా , మచ్చలేని మహా నాయకుడిగా, మంచి ఆరోగ్యంతో విడుదల కావాలని భగవంతుని ప్రార్థిస్తున్నామని వంచ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

- Advertisement -

ఓట్ల కోసం చంద్రబాబు నాయుడు గారి అరెస్టు ఖండిస్తున్నారు..!
తెలంగాణలో ఎన్నికలు సమీపించడంతో ఇప్పుడు బి ఆర్ఎస్ పార్టీ నాయకులు కేవలం ఓట్ల కోసం చంద్రబాబు నాయుడి అరెస్టును ఖండిస్తున్నారని వంచ శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడి అక్రమ అరెస్టు వెనుక ఎవరెవరు ఉన్నది ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ తెలుసునని ఆయన అన్నారు . ఐటి ఉద్యోగస్తులు హైదరాబాదులో ఉద్రిక్త వాతావరణం సృష్టిస్తున్నారని తెలంగాణ ప్రభుత్వ పెద్దలు అనడం సిగ్గుచేటని వంచ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. చంద్రబాబు నాయుడికి వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక రానున్న ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ, జగన్ పార్టీ ఓడిపోతుందని భయంతో అక్కసుతో చేసిన పనిగా ప్రజలు గుర్తించారని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. అకారణంగా ఒక మాజీ ముఖ్యమంత్రిని జైల్లో బంధిస్తే కేంద్రం మాట్లాడకపోవడం ఏమిటి? ఆంధ్రప్రదేశ్ లో రాజ్యాంగ ఉల్లంఘన యధాతధంగా జరుగుతుంటే సరి చేయాల్సిన కేంద్రం ఉదాసీనతతో ఎందుకు వ్యవహరిస్తుంది. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు రాజ్యాంగబద్ధంగా పనిచేయాలని కేంద్రం ఒక మాట చెప్తే పరిస్థితిలో మార్పులు వచ్చేవి. ఆంధ్రప్రదేశ్ లో ప్రాథమిక హక్కులు అమలవుతున్నాయా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. రంగులు వేయడానికి 3000 కోట్లు దుబారా చేసిన జగన్ రెడ్డి 370 కోట్లతో రెండు లక్షల 15,000 మందికి ట్రైనింగ్ ఇచ్చి రూ . 80,000 మందికి ఉద్యోగాలు చూపించిన బాబు పై అక్రమ కేసులు బనాయిచడం జగన్ రెడ్డికి సిగ్గనిపించడం లేదా? ఇది నీ సైకో, నియంత వ్యవహారానికి నిదర్శనం కాదా? అని వంచ శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించారు .
అధికారపు చీకట్లను చీల్చుకుని కడిగిన ముత్యంలా బాబు తిరిగి వస్తాడని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు