Wednesday, September 11, 2024
spot_img

మూడు నెలల్లో ఒక్క డెలివరీ కూడా లేని ఇటలీ!

తప్పక చదవండి

రోమ్‌ : ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో యవసు మళ్లిన, వృద్ధుల సం ఖ్య మరింతగా పెరిగిపోతోంది. చైనా, జపాన్‌ లాంటి దేశాలు దీనికి పెద్ద ఉదాహరణగా నిలిచాయి. ఇప్పుడు ఇటలీ కూడా ఈ జాబితాలో చేరింది. దీనికి కారణం అక్కడ పిల్లలు పుట్టక పోవడమే. పలు రిపోర్టులలో వెల్లడైన వివరాల ప్రకారం గత మూడు నెలలుగా ఇటలీలో ఏ ఒక్క శిశు జననం కూడా జరగలేదు. ఇది జాతీయ సమస్యగా పరిణమించింది.ఈ నేపధ్యంలో ఇటలీ ప్రధాని దీనిని జాతీయ అత్యవసర పరిస్థితిగా చూడాలన్నారు. ఇక, ఇటలీ ఇటీవల వినూత్న ప్రపంచ రికార్డును సృష్టించింది. అయితే ఈ ప్రపంచ రికార్డులో సం తోషిం చాల్సిన విషయమేవిూ లేదు. దేశం శరవేగంగా వృద్దాప్య దశకు చేరుతోంది. ఈ నివేదిక ప్రకారం గత మూడు నెలల్లో ఇటలీలో ఒక్క శిశువు కూడా జన్మించలేదు. నేషనల్‌ స్టాటిస్టిక్స్‌ బ్యూరో ఐఎస్‌టీఏటీ గణాంకాలను పరిశీలిస్తే.. జనవరి 2023 నుండి జూన్‌ 2023 వరకు ఇటలీలో జన్మించిన పిల్లల సంఖ్య జనవరి 2022` జూన్‌ 2022 మధ్య జన్మించిన వారి కంటే 3500 తక్కువ. దేశంలో 15 నుంచి 49 ఏళ్లలోపు మహిళల సంఖ్య తక్కువగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. అంటే ఇటలీలో పునరుత్పత్తి వయసు గల మహిళల కొరత తీవ్రంగా ఉంది. ఈ వయసు కలిగిన మహిళల సంఖ్య 2021తో పోలిస్తే 2023లో చాలా వరకూ తగ్గింది. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ దీనిని జాతీయ ఎమ్జ్గంªన్సీగా భావిస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. గత ఏడాది ఆమె ఎన్నికల ప్రచారంలో ఈ అంశాన్ని చాలా గట్టిగానే ప్రస్తావించారు. ఇటలీలో రోజుకు ఏడుగురు పిల్లలు పుడుతుండగా, అదే సమయంలో దేశంలో 12 మరణాలు నమోదువున్నాయి. ఇది ఇలాగే కొన సాగితే ఇటలీ జనాభా వేగంగా తగ్గిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు