Monday, April 29, 2024

డమ్మీలతో దందాపై విచారణ మొదలు..

తప్పక చదవండి

కాంట్రాక్టు బేసిస్‌ మీద పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుల కష్టాన్ని దోచుకుంటున్న కథనాలను వరుసగా అందిస్తోంది ఆదాబ్‌ హైదరాబాద్‌.. ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం పారిశుధ్య కార్మికులకు శాపంగా మారుతోంది.. ఇంత జరుగుతున్నా జీ.హెచ్‌.ఎం.సి. కమిషనర్‌ ఇప్పటికీ స్పందించకపోవడం శోచనీయం.. దీంతో ఏ.ఎం.హెచ్‌.ఓ. కనుసన్నలలో ఎస్‌.ఎఫ్‌.ఏ. లు రెచ్చిపోతూ తమ అవినీతి దందాను నిస్సిగ్గుగా కొనసాగిస్తున్నారు.. దానికి కారణం చెబుతున్నారు.. వివరాలు చూద్దాం..

  • మాకు తప్పడం లేదంటున్న ఎస్‌.ఎఫ్‌.ఏ. లు..
  • పై అధికారులకు ముడుపులు చెల్లించాల్సి వస్తోంది..
  • ఆవేదన వ్యక్తం చేస్తున్న ఎస్‌.ఎఫ్‌.ఏ. లు..
  • ఏ.ఎం.ఓ.హెచ్‌.కు ప్రతి నెలా రూ. 6000 చెల్లించాల్సిందే..
  • మూడు గ్రూపులకు ఒక్కో గ్రూపుకు రూ. 2000 వసూలు
  • ఉన్నతాధికారుల నియంత్రణ కొరవడిన జీ.హెచ్‌.ఎం.సి సర్కిల్‌ -17..

హైదరాబాద్‌ : జీ.హెచ్‌. ఎం.సి. సర్కిల్‌ – 17లో ఏ.ఎం.ఓ.హెచ్‌. గా భార్గవ నారాయణ విధులు నిర్వహిస్తున్నారు.. కాగా ఈ సర్కిల్‌ లో సుమారు 41 మంది ఎస్‌.ఎఫ్‌.ఏ. లు పనిచేస్తున్నారు.. ఒక్కో ఎస్‌.ఎఫ్‌.ఏ. కింద దాదాపు మూడు గ్రూపులు ఉంటాయి.. ఇక ఒక్కో గ్రూపులో 7 మంది పారిశుధ్య కార్మికులు పనిచేస్తూ ఉంటారు.. మొత్తానికి 846 మంది కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు.. అయితే కొంతమంది ఎస్‌.ఎఫ్‌.ఏ. లు తమ కుటుంబ సభ్యుల పేర్లు పారిశుధ్య కార్మికుల లిస్ట్‌ లో చేర్చి, వారు విధులకు హాజరు కాకుండానే వారి పేరుమీద నెల నెలా జీతాలు డ్రా చేస్తున్న విషయం ఆదాబ్‌ వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే.. కొందరు ఎస్‌.ఎఫ్‌.ఏ.ల అవినీతిని ఇప్పటికే బహిర్గతం చేసాం.. తాజాగా మరో ఎస్‌.ఎఫ్‌.ఏ. వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఏ. రాజ్‌ కుమార్‌.. ఎస్‌.ఎఫ్‌.ఏ. అమీరేట్‌ ఏరియా, నీలా నగర్‌ బస్తీ, సొంత తమ్ముడైన ఏ. సంజీవ్‌ కుమార్‌, అతని తల్లి ఏ. శ్యామల పేర్లను రిజిస్టర్‌ లో అక్రమంగా ఇరికించి.. జీతం తీసుకుంటున్నట్లు తెలియవచ్చింది.. అయితే ఇదే విషయంపై కొందరు ఎస్‌.ఎఫ్‌.ఏ. లను వివరణ కోరగా.. తమ కింద మూడు గ్రూపులు పనిచేస్తుంటాయని.. ఒక్కో గ్రూప్‌ కి రూ. 2000 చొప్పున ఏ.ఎం.ఓ.హెచ్‌. కు చెల్లించాల్సి వస్తోందని.. ఈ విధంగా నెలకు రూ. 6000 లు ఖచ్చితంగా చెల్లించాల్సి రావడం తో.. విధిలేని పరిస్థితుల్లో డమ్మీలను నియమించుకుని వారి జీతం లో నుంచి ఏ.ఎం.ఓ.హెచ్‌. కి 40 శాతం చెల్లిస్తూ.. మిగిలిన జీతంలో కొంత ఆ కార్మికుడికి ఇస్తూ.. కొంత తాము తీసుకుం టున్నామని తెలిపారు.. ఒకవేళ ఏ.ఎం.ఓ.హెచ్‌. కి నెల నెలా చెల్లించకపోతే తమని నానా రకాల ఇబ్బందులకు గురిచేస్తూ.. నరకయాతన పెడతారని వాపోయారు.. ఇప్పటికైనా సర్కిల్‌ – 17, ఖైరతాబాద్‌ జోన్‌ లో జరుగుతున్న అవినీతిపై ఉన్నతాధి కారులు దృష్టి పెట్టి.. ప్రభుత్వ సొమ్మును కాజేస్తున్న. ఇప్పటికీ కాజేస్తున్న వారినుంచి రెవెన్యూ రికవరీ యాక్ట్‌ కింద ఆ సొమ్మును రికవరీ చేసి.. వారి మీద క్రిమినల్‌ కేసులు నమోదు చేసి.. ఉద్యోగాలనుండి శాశ్వతంగా తొలగించి.. మరోసారి ఇలాంటి వ్యవహారాలు జరక్కుండా చర్యలు తీసుకుంటారని.. కొత్తగా జీ.హెచ్‌.ఎం.సి. కమిషనర్‌ గా బాధ్యతలు స్వీకరించిన రొనాల్ట్‌ రోజ్‌ ఆ దిశగా కార్యాచరణ రూపొందించి.. జీ.హెచ్‌.ఎం.సి. ని ప్రక్షాళన చేస్తారని సామాజిక వేత్తలు ఆశిస్తున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు