Wednesday, September 11, 2024
spot_img

హాకీ సెమీ ఫైనల్స్‌లోకి చేరిన భారత పురుషుల జట్టు.

తప్పక చదవండి
  • ఆసియా క్రీడల్లో భారత హాకీ జట్టు జైత్ర యాత్ర..

చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత హాకీ జట్టు జైత్రయాత్ర కొనసాగుతున్నది. పూల్‌-ఎ లో జరిగిన అన్ని లీగ్‌ మ్యాచ్‌లలో భారత్‌ భారీ గోల్స్ తేడాతో ఘన విజయాలు నమోదు చేసింది. సోమవారం జరిగిన ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో కూడా బంగ్లాదేశ్‌పై 12-0 తేడాతో భారత్‌ ఏకపక్ష విజయం సాధించింది. దాంతో పూల్‌-ఎ నుంచి టేబుల్‌ టాపర్‌గా భారత హాకీ జట్టు సెమీఫైనల్స్‌లో ప్రవేశించింది. సెమీస్‌లో గెలిస్తే భారత్‌కు రజత పతకం ఖాయం కానుంది. ఫైనల్‌లోనూ విజయం సాధిస్తే హాకీ గోల్డ్‌ మెడల్‌ భారత్‌ సొంతం కానుంది. కాగా, పూల్‌-ఎ లో ఇప్పటి వరకు జరిగిన ఐదు లీగ్‌ మ్యాచ్‌లలో భారత్‌ ఏకంగా 58 గోల్స్ సాధించింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు