Thursday, May 16, 2024

సమ్మళిత, సమగ్ర అభివృద్ది లక్ష్యం

తప్పక చదవండి
  • ప్రభుత్వ విధానాలతో భారీగా పెట్టుబడులు
  • పెట్టుబడుల కేంద్రంగా హైదరాబాద్‌
  • టీఎస్‌ ఐపాస్‌ ద్వారా 24 వేల పరిశ్రమలకు అనుమతులు
  • 4 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి
  • కాళేశ్వరంపై దుష్పచ్రారం తగదు
  • తెలంగాణ అభివృద్దిపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌లో కెటిఆర్‌

హైదరాబాద్‌ : సమ్మళిత, సమగ్ర అభివృద్ది లక్ష్యంగా తమ ప్రభుత్వం కృషి చేస్తోందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఐటిశాఖ మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హైదరాబాద్‌కు భారీ స్థాయిలో పెట్టుబడులు తరలివచ్చాయని కేటీఆర్‌ స్పష్టం చేశారు. దీంతో ఇవాళ ప్రపంచంలోని దిగ్గజ కంపెనీలకు హైదరాబాద్‌ చిరునామాగా మారిందని కేటీఆర్‌ తెలిపారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణలో అతి తక్కువ కాలంలో అభివృద్ది అంటే ఏమిటో చేసి చూపామని అన్నారు. ఐటీసీ కాకతీయ హోటల్‌లో తెలంగాణ అభివృద్దిపై ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్‌ తెలంగాణ అభివృద్ధిపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ..టీఎస్‌ ఐపాస్‌, టీఎస్‌ బీ పాస్‌ విూకు తెలుసు. ఈ రెండిరటి ద్వారా సింగిల్‌ విండో విధానంలో పరిశ్రమలకు అనుమతులు ఇస్తున్నాం. కొత్త మున్సిపాలిటీ, కొత్త పంచాయతీ చట్టాలను తెచ్చి పారదర్శకంగా అమలు చేస్తున్నాం. టీఎస్‌ ఐపాస్‌ ద్వారా 24 వేల పరిశ్రమలకు అనుమతులు ఇచ్చాం. 4 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 24 లక్షల మందికి ఉపాధి కల్పన జరిగింది. ప్రపంచంలోని దిగ్గజ కంపెనీలకు హైదరాబాద్‌ చిరునామాగా మారింది. గూగుల్‌, ఆపిల్‌, అమెజాన్‌, మెటా వంటి తదితర కంపెనీలకు నిలయంగా మారింది. ఐటీ ఎగుమతులు 57 వేల కోట్ల నుంచి 2.41 లక్షల కోట్లకు చేరాయి. ఐటీ ఉద్యోగాలు 3 లక్షల నుంచి 9 లక్షలకు చేరాయి. ద్వితీయ శ్రేణి పట్టణాలైన వనపర్తి, నల్లగొండ, మహబూబ్‌నగర్‌, సిద్దిపేట, సిరిసిల్ల, నిజామాబాద్‌ వంటి పట్టణాలల్లో ఐటీ కంపెనీలు నెలకొల్పాం. ఇదంతా సీఎం కేసీఆర్‌ వల్లే సాధ్యమైంది అని కేటీఆర్‌ స్పష్టం చేశారు. ఈ తొమ్మిదిన్నరేండ్ల కాలంలో తెలంగాణ ప్రభుత్వం 1,60,083 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. మరి కాంగ్రెస్‌, బీజేపీ పాలిత రాష్టాల్ల్రో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ఎంత..చెప్పే దమ్ముందా..అని ప్రతిపక్షాలకు కేటీఆర్‌ సవాల్‌ విసిరారు.
గత పదేండ్లలో ప్రభుత్వ రంగంలో 1,60,083 ఉద్యోగాలు భర్తీ చేశాం. మరో 42 వేల ఉద్యోగాలు భర్తీ పక్రియలో ఉన్నాయి. మా కంటే మెరుగ్గా ఉద్యోగాలు భర్తీ చేసిన రాష్టాల్రు ఉన్నాయా..? ఉంటే తెలంగాణ పిల్లలకు చెప్పండి. ఊరికే గావుకేకలు, పెడబొబ్బలు కాదు. ఈ విధంగా ప్రజెంటేషన్‌ ఇవ్వండి. ఫలానా చోట ఇంత కన్న ఎక్కువ చేశామని చెప్పండి. గుజరాత్‌లో 6 కోట్ల జనాభా ఉంది. రాజస్థాన్‌లో ఎనిమిదిన్నర కోట్లు, కానీ ఈ రాష్టాల్లో ఉద్యోగాల భర్తీ అనుకున్నంత జరగలేదు. మనం 4 కోట్ల జనాభాకు 1.60 లక్షల ఉద్యోగాలను భర్తీ చేశాం. ఎనిమిదిన్నర కోట్లు, 6 కోట్ల జనాభా ఉన్న రాష్టాల్రు కూడా అన్ని ఉద్యోగాలను భర్తీ చేయలేదు. వాళ్లొచ్చి మమ్మల్ని మాట్లాడుతున్నారు. ఇవి వాస్తవాలు. ఉద్యోగాల భర్తీకి సంబంధించి వెబ్‌సైట్‌ కూడా పబ్లిష్‌ చేశాం. వాస్తవాలు ఇవి. కాదని రుజువు చేసే దమ్ము ప్రతిపక్షాలకు ఉందా..? అని కేటీఆర్‌ తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ధరణిని ఎత్తేసి, పట్వారీ వ్యవస్థను తీసుకొస్తారట.. పట్వారీ వ్యవస్థ అంటేనే దళారీ వ్యవస్థ అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ తేల్చిచెప్పారు.
తొమ్మిదిన్నరేండ్లలో తెలంగాణ అద్భుతంగా అభివృద్ధి చెందిందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనన్నారు. కేసీఆర్‌ వచ్చిన తర్వాతే కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాయని చెప్పారు. తలసరి ఆదాయంలో తెలంగాణ నంబర్‌ రాష్ట్రంగా నిలిచిందని, జీఎస్‌డీపీలో అత్యంత వేగంగా పెరుగుతున్న రాష్ట్రం తెలంగాణ అన్నారు. పచ్చని పంటలతో కళకళలాడు తున్నదని వెల్లడిరచారు. 2014కు ముందు ఎట్లుండే తెలంగాణ 2023లో ఎట్లైంది తెలంగాణ అని గణాంకాలు, ఫొటోలతో వివరించారు. ’తెలంగాణలో పంటల దిగుబడి పెరింది. ధాన్యం ఉత్పత్తిలో అన్నపూర్ణగా మారింది. మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికి స్వచ్ఛమైన తాగు నీటిని అందిస్తున్నాం. దీనికోసం కోసం రూ.37 వేల కోట్లు ఖర్చు చేశాం. ప్రస్తుతం మిషన్‌ భగీరథ ద్వారా 58 లక్షల కుటుంబాలకు నీరు అందిస్తున్నాం. ఈ పథకాన్ని ఇతర రాష్టాల్రు కూడా అనుసరిస్తున్నాయి. దీని స్ఫూర్తితో కేంద్రం ప్రభుత్వం హర్‌ ఘర్‌ జల్‌ పథకాన్ని ప్రారంభించింది. ఇంటింటికి స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తూ దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్నారు. మిషన్‌ కాకతీయ ద్వారా 46 వేల చెరువులను పునరుద్ధరించాం. దీంతో ప్రతి గ్రామంలో చెరువులు నిండు కుండలా కనిపిస్తున్నాయి. సాగునీరు రావడంతో సంపద సృష్టించబడిరది. నీళ్లు, నిధులు, నియామకాలకు తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణ న్యాయం చేసింది. మన ఊరు`మన బడి కార్యక్రమంతో పాఠశాలలను బలోపేతం చేశాం. 26 వేలకుపైగా స్కూళ్లను అభివృద్ధి చేశాం. ప్రతి జిల్లాలోనూ మెడికల్‌ కాలేజీలను ఏర్పాటు చేశాం. 56 ఏండ్ల కాంగ్రెస్‌ పాలనలో ఏర్పాటుచేసిన కాలేజీలు రెండే. గతంలో ఉస్మానియా, గాంధీ మెడికల్‌ కాలేజీలు మాత్రమే ఏర్పాటు చేశారు. బీఆర్‌ఎస్‌ పాలనలో 34 మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేశాం. రూ.12 వందల కోట్లతో యాదాద్రి ఆలయాన్ని అభివృద్ధి చేశాం. దశలవారీగా ప్రముఖ ఆలయాలను అభివృద్ది చేస్తామన్నారు. రైతును రాజును చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు తగ్గాయని కేంద్ర ప్రభుత్వమే చెప్పింది. సాగుకు 24 గంటల కరెంటు ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ. నల్లగొండలో ఫ్లోరోసిస్‌ లేకుండా చేశాం. సౌర విద్యుత్‌ ఉత్పత్తిలో తెలంగాణ రెండో స్థానంలో ఉంది. గ్రామ పంచాయతీలకు మౌలిక సదుపాయాలు కల్పించాం.
సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ.లక్షా 70 వేల కోట్లు ఖర్చు చేశాం. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకమైన కాళేశ్వరాన్ని నాలుగున్నరేండ్లలో పూర్తిచేశాం. కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 20 రిజర్వాయర్లు, 20 లిఫ్టులు. కాల్వలు తవ్వి పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేశాం. ప్రాజెక్టులపై రాజకీయాలు చేయొద్దు. ప్రాజెక్టులను బద్నాం చేసి అన్యాయం చేయొద్దు. బ్యారేజీల్లో సమస్యలు రావడం సర్వ సాధారణం. ప్రకాశం, ధవళేశ్వరం, కడెం జలాశయాల్లోనూ సమస్యలు వచ్చాయి. సాగర్‌ కట్టిన తర్వాత కూడా లీకేజీ సమస్యలు వచ్చాయి. రెండేండ్ల క్రితం శ్రీశైలం పంపులు కూడా నీటమునిగాయి. రాజకీయాల కోసం కాళేశ్వరం ప్రాజెక్టును బద్నాం చేయొద్దు. కేంద్రంలో దుర్మార్గమైన ప్రభుత్వం ఉన్నది. తెలంగాణకు అప్పులు పుట్టకుండా కుట్ర చేస్తున్నది. కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే.. కరెంటు ఉండదు’ అని మంత్రి కేటీఆర్‌ అన్నారు. గతంలో తెలంగాణలో ఒక రైతు భూమి రిజిస్టేష్రన్‌ కావాలంటే చేయి తడపనిదే రిజిస్టేష్రన్‌ అయ్యేది కాదు. అంతేకాదు ఎప్పుడు రిజిస్టేష్రన్‌ అవుతదో, మ్యుటేషన్‌ ఎప్పుడు అయితదో తెలవని పరిస్థితి. మన చేతుల్లో ఏం ఉండేది కాదు. వాళ్ల దయ మన ప్రాప్తం. ధరణి వచ్చిన తర్వాత అన్ని లేయర్స్‌ పోయాయి. వీఆర్వో, వీఆర్‌ఏ, ఎమ్మార్వో, ఆర్డీవో, జాయింట్‌ కలెక్టర్‌, కలెక్టర్‌, సీసీఎల్‌ఏ, రెవెన్యూ సెక్రటరీ, రెవెన్యూ మినిస్టర్‌ ఇలా ఎనిమిది లేయర్స్‌ తీసేశాం. ధరణి ద్వారా రైతుల వేలి ముద్రకు అధికారం ఇచ్చింది బీఆర్‌ఎస్‌ గవర్నమెంట్‌. విూ భూమి రికార్డును ఎవరూ ట్యాంపర్‌ చేయకుండా విూకు అధికారం ఇచ్చారు.
ధరణి తీసుకొచ్చింది కేసీఆర్‌. ధరణిలో లోటుపాట్లు ఉండొచ్చు. మేం లేవు అనట్లేదు. కానీ ఇవాళ భూమాత అని తెస్తున్నారు. తిరిగి పట్వారీ వ్యవస్థను తీసుకొస్తామని చెబుతున్నారు. పట్వారీ వ్యవస్థ అంటేనే దళారీ వ్యవస్థ. పట్వారీ వ్యవస్థను తీసుకొచ్చిన వారిని ఆశీర్వదిద్దామా.? లేదా ధరణి తెచ్చి, భూముల రిజిస్టేష్రన్‌ లో పారదర్శకత తెచ్చిన వారిని ఆశీర్వదిద్దామా ప్రజలు ఆలోచించాలి అని కేటీఆర్‌ సూచించారు. తొమ్మిదిన్నర ఏళ్లలో జరిగిన అభివృద్ధి పై విూకు చెప్పాల్సిన అవసరం ఉందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఈ తొమ్మిదిన్నరేళ్ల కాలంలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. రెవెన్యూ మండలాలూ, రెవెన్యూ డివిజన్ల సంఖ్య భారీగా పెంచామన్నారు. అతి తక్కువ ఉన్న మున్సిపాలిటీల సంఖ్య కూడా పెరిగింద న్నారు. కొత్త జిల్లాలు పెంచుకున్నామన్నారు. తండాలను గ్రామ పంచాయతీలు చేసుకున్నామన్నారు. రాష్ట్ర తలసరి ఆదాయం 2014 లో 1, 24, 104 ఉన్న ఆదాయం ఇప్పుడు 3,17,115 పెరిగిందని కేటీఆర్‌ అన్నారు. జీఎస్‌డీపీలో 13.27 లక్షల కోట్లకు పెరిగిందని కేటీఆర్‌ తెలిపారు. తెలంగాణ లో పేదరికం 13.18 శాతం నుంచి 5.8?కు తగ్గిందన్నారు. పంట దిగుబడి 2014 కు ముందు 68 లక్షల టన్నులు ధాన్యం ఉత్పత్తి కానీ ఇప్పుడు 3.5 లక్షల టన్నుల దాన్యం ఉత్పత్తి అవుతోందన్నారు. 37 వేల కోట్లతో 58 లక్షల ఇళ్లకు మంచినీళ్ళు అందించామన్నారు. ఇంటింటికి మంచినీళ్లు అందించి తెలంగాణ దేశంలో నంబర్‌ 1 స్థానంలో ఉందన్నారు. మిషన్‌ కాకతీయతో 46 వేల చెరువులు బాగు చేసుకున్నామని కేటీఆర్‌ తెలిపారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు