Monday, May 20, 2024

అభ్యర్థి లేక బీజేపీ విలవిల

తప్పక చదవండి
  • వికారాబాద్ నియోజకవర్గం లో ఉలుకు పలుకు లేని బీజేపీ నాయకత్వం

వికారాబాద్ : వికారాబాద్ నియోజకవర్గంలో బీజేపీ నాయకత్వంలో ఉలుకు పలుకు లేకపోవడంతో ఇప్పటికే మండల,గ్రామ స్థాయిలో ఉన్న బీజేపీ నాయకులు,కార్యకర్తలు కాంగ్రెస్,బిఆర్ఎస్ పార్టీలలోకి వలస వెళ్లడంతో బీజేపీ క్యాడర్ సన్నగిల్లిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో బీజేపీలో చేరిన మాజీ మంత్రి డాక్టర్ ఏ.చంద్రశేకర్ ఉన్న సమయంలో బలోపేతమైన బీజేపీ కే సి ఆర్ ఆ పార్టీని వీడటంతో స్థానిక నాయకులు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. కాగా ఇప్పటివరకు వికారాబాద్ బీజేపీ అభ్యర్థిని ఖరారు చేయకపోవడంతో బీజేపీ నుండి ఇతర పార్టీలోకి వలస వెళుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ బలోపేతం వైపు అడుగులు వేసే తరుణంలో బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడి హోదా నుండి తప్పించడంతో పార్టీ క్యాడర్ పూర్తిగా సన్నగిల్లిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ప్రస్తుతం వికారాబాద్ లో బీజేపీ పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.అయితే బీజేపీ అభ్యర్థి ని ఖరారు చేయడంలో ఇంకా ఆలస్యం జరిగితే బీజేపీ ఓటు బ్యాంకు బిఆర్ఎస్ పార్టీకి ప్లస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు