ఇస్లామాబాద్ : తోషాఖానా కేసులో దోషిగా తేలి జైలులో ఉన్న పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి, పాకిస్థాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ అధినేత ఇమ్రాన్‌ఖాన్‌కు స్వల్ప ఊరట లభించింది. ఆయనను పంజాబ్ ప్రావిన్సులోని అటోక్ జైలు నుంచి రావల్పిండిలోని అడియాలా జైలుకు మార్చాలని అధికారులను ఇస్లామాబాద్ హైకోర్టు ఆదేశించింది. ఇమ్రాన్ కుటుంబ నేపథ్యం, హోదాను దృష్టిలో పెట్టుకుని.. సకల సౌకర్యాలతో అత్యంత భద్రత నడుమ ఉండే రావల్పిండి జైలుకు తరలించాలని పీటీఐ నేతలు కోర్టును ఆశ్రయించారు. సోమవారం కేసును విచారించిన న్యాయమూర్తి.. ఇమ్రాన్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చినట్లు డాన్ పత్రిక వెల్లడిరచింది.