Sunday, April 28, 2024

చెరువును వదలని అక్రమార్కులు..

తప్పక చదవండి
  • కోట్ల విలువ చేసే భూమి కబ్జా..
  • గుట్టలు తవ్వి చెరువులు నింపుతుంటే అధికారులకు పట్టదా..?
  • గడిచిన ఎనిమిది ఎండ్లలో ఎన్నో చెరువులు కబ్జాకు గురయ్యాయి
  • భూముల కాపాడాల్సిన రెవెన్యూ శాఖ ప్రేక్షక పాత్ర వహిస్తోంది
  • ఆక్రమణల తొలగింపుకు అడ్డంకులు.. కొత్త వాటిని అడ్డుకోరా..?
  • చింతపల్లి మండలంలో ఎటుచూసినా
    ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్న కబ్జా రాయుళ్లు
  • ప్రభుత్వ భూములను భూ కబ్జా కోరల నుండి కాపాడేది ఎవరు..?

చింతపల్లి మండలం : దేవరకొండ నియోజకవర్గం చింతపల్లి మండలం రాంనగర్‌ పోలపల్లి గ్రామ సమీపంలో ఉన్న చెరువులో యథేచ్ఛగా కబ్జాలు జరుగుతున్నాయి. గుట్టలు తవ్వి చెరువులు నింపుతున్న అధికారులకు తమకు సంబంధం లేనట్టు ప్రేక్షక పాత్ర వహిస్తున్న తీరును ప్రజలను ఆశ్చర్యను గురిచేస్తుందని చెప్పాలి. ప్రభుత్వ భూముల నుండి మట్టి తవ్వి చెరువులు నింపి రియల్‌ మాఫియాలకు మరొక రూపకంగా రూపుదిద్దుకుంటుంటే అధికా రులకు చలనం లేదా.ఎఫ్‌టీఎల్‌ పరిధి దాటి మరీ వచ్చి నిర్మాణాలు జరుగుతున్నాయి. ఎఫ్‌టీఎల్‌ దిమ్మెలను తొలగించి మరీ చెరువు పరిధిలోని భూముల్లోకి చొచ్చుకువస్తున్న కబ్జాగాళ్లు రాత్రికి రాత్రి భూమి చదును..మొరం డంపు చేసి చెరువు స్థలాన్ని కబ్జా చేసేస్తున్నారు.అధికార పార్టీ నేతల అండ,యంత్రాంగంలోని ఇరిగేషన్‌,రెవెన్యూ,కార్పోరేషన్‌లోని కీలక అధికారులను గుప్పిట్ల పెడుతూ ఆక్రమణలను యథేచ్ఛగా సాగిస్తున్నట్లుగా ఆరోపణలున్నాయి.వాస్తవానికి చింతపల్లి మండలం రాంనగర్‌ పోలేపల్లి గ్రామానికి సంబంధించిన చెరువు ప్రముఖమైనదని చెప్పాలి.ఆ మూడు శాఖల వైఫల్యంతోనే ఆక్రమణలు..వాస్తవానికి పోలేపల్లి రాంనగర్‌ చెరువు కబ్జాలను నిలు వరించడంలో ఇరిగేషన్‌, రెవెన్యూ,అధికారుల పాత్ర ఉందని చెప్పక తప్పదు.లెవల్‌ దిమ్మెలను తొలగించి మరీ నిర్మాణాలు చేపడుతున్న వారిపై ఇరిగేషన్‌ అధికారులు కంప్లైట్‌ చేయకుండా తాత్సారం వహిస్తు న్నారు. ఇది భూ కబ్జాదారుల్లో ఏం కాదులే అన్న వైఖరి పెంపొందించేలా చేస్తోంది. ఇక చెరువు భూములకు సమీపంలోని పట్టా,రిజిస్ట్రేషన్‌ ల్యాండ్స్‌ సర్వే నెంబర్లకు బై నెంబర్లు వేస్తూ చెరువు భూములపై రిజిస్ట్రేషన్లు జరుపుతున్నారన్న ఆరోపణలున్నాయి. రెండు శాఖల అధికారుల నిర్లక్ష్యం, తప్పిదాలతో చెరువుల భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. ఇరిగేషన్‌ హనుమాన్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ. పోలేపల్లి రాంనగర్‌ గ్రామంలో ఉన్న చెరువులో అక్రమ కట్టడాలు కడుతున్నది వాస్తవమేనని వాటిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని పై అధికారులకు నల్లగొండ జిల్లా కలెక్టర్‌ కు తెలపడం జరిగింది.అందులో భాగంగా ఎమ్మార్వో సర్వే రిపోర్ట్‌ ఇచ్చిన యెడల తక్షణమే వారిపై చట్టపరమైన క్రిమినల్‌ చర్యలు చేపడతామని వివరించారు.
ఆక్రమణల తొలగింపు అడ్డంకులు..కొత్త వాటిని అడ్డుకోరా..?..
గత సంవత్సర కాలంలో చెరువు ఎఫ్టీఎల్‌ పరిధిలోకి చొచ్చుకు వచ్చి ఆక్రమంగా వందలాది అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు.దేవరకొండ నియోజకవర్గం పలు మండలాల పరిధిలో ఎన్నో చెరువులు భూ కబ్జా రాయుళ్లు చేరబడుతున్న ఎవ్వరికి పట్టనట్టు ఉండడం శోచనీయమైన సంఘటన అంటున్న సామాన్యుడు.ఎనిమిది ఏళ్లుగా చెరువు స్థలాలు చెరబట్టేందుకు విశ్వ ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నా..అధికార యంత్రాంగం మాత్రం పట్టీపట్టనట్లు వ్యవహరిస్తోంది చెరువులు,కుంటలు,ప్రభుత్వ భూముల కాపాడాల్సిన రెవెన్యూ శాఖ ప్రేక్షక పాత్ర వహిస్తోంది.ఇదే విషయంపై చింతపల్లి ఎమ్మార్వో శంషుద్దీన్‌ వివరణ కోరగా మా దృష్టికి ఇప్పుడే వచ్చిందని తక్షణమే చెరువులు కబ్జా కూరలో చిక్కకుండా ఇరిగేషన్‌ అధికారులకు సహకరిస్తామని వీలైనంత అతి తక్కువ సమయంలో సర్వే నిర్వ హించి ఇరిగేషన్‌ అధికారులకు అందజేస్తామని వివరించడం జరిగింది.చెరువు ఎకరాల్లో ఆక్రమణకు గురైనట్లు గతంలోనే రెవెన్యూ,ఇరిగేషన్‌ అధికారుల తేల్చినప్పటికీ న్యాయస్థానాల్లో కేసులున్నాయని పేర్కొంటూ కూల్చివేతలకు దూరంగా ఉంటున్నారు.కలెక్టర్‌ ఆధ్వర్యంలోని టాస్క్‌ ఫోర్స్‌ ఆధ్వర్యంలో ముందుకు కదిలితే తప్పా ఆక్రమణల తొలగింపు సాధ్యం కాదని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు.
కబ్జాలే పనిగా పెట్టుకున్న కొంతమంది..
గడిచిన ఏడేనిమిదేళ్లుగా దేవరకొండ నియోజకవర్గంలో ప్రధాన జలశయాలను సైతం కబ్జాగాళ్లు చెరబడుతున్నారు.ఫుల్‌ ట్యాంకు లెవల్‌కు గుర్తుగా ఏర్పాటు చేసిన రాళ్లను తొలగించేసి చదును చేసి మొరం పోస్తూ..ఆక్రమణలకు పాల్పడుతున్నారు.ఖాళీ స్థలాలను చదను చేస్తూ రాత్రికి రాత్రే మొరం డంపు చేసి బేస్‌మెంట్‌ లెవల్‌ నిర్మాణాలను చేపడుతున్నారు.కొద్ది కాలం తర్వాత చిన్న ఇంటి నిర్మాణం చేపట్టి..కార్పోరేషన్‌ అధికారులకు చేతులు తడిపి ఇంటి నెంబర్‌ తెచ్చుకుంటూ క్రమబద్దీకరించుకునే ప్రయత్నం చేస్తున్నారు.ఇలా చెరువు ఎఫ్‌టీఎల్‌ పరిధిలో నిత్యం కబ్జాల పర్వం చోటు చేసుకుంటున్న ఇటు ఇరిగేషన్‌ అధికారులు గానీ,అటు రెవెన్యూ అధికారులు గాని పట్టించుకోవడం లేదు.కోట్ల విలువైన చెరువు భూమి ఆక్రమణకు గురవుతోంది.భవిష్యత్‌ నీటి అవసరాలకు,తరాలకు ఆహ్లాదాన్ని పంచే అవకాశం ఉన్న చెరువులను భూ కబ్జాగాళ్లు భోం చేస్తున్నా యంత్రాంగం తూతూ మంత్రంగా చర్యలతో సరిపెడుతుండటంతో ప్రయోజనం ఉండటం లేదు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు