Tuesday, October 15, 2024
spot_img

షాద్ నగర్ లో అడ్డగోలుగా అక్రమ సెల్లార్ల తవ్వకాలు నిర్మాణాలు

తప్పక చదవండి
  • ఇష్టానుసారంగా అక్రమ నిర్మాణాలు పట్టించుకోని మున్సిపల్ అధికారులు
  • మామూళ్ల మత్తులో జోగుతున్న అధికారులు అంటూ షాద్ నగర్ ప్రజల సెటైర్లు
  • సామాన్య ప్రజలకు ఒక న్యాయం బడా బాబులకు ఒక న్యాయమా
  • లంచాలకు అలవాటు పడిన అధికారుల తీరుతో ప్రభుత్వ ఆదాయానికి గండి
  • ఉన్నతాధికారులు దృష్టి సారించాలని కోరుతున్న షాద్ నగర్ ప్రజలు
  • అక్రమ నిర్మాణాలు, సెల్లార్ల నిర్మాణం ఆపకపోతే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తాం
  • ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చూసి చూడనట్టు వదిలేస్తున్న అధికారులు

షాద్ నగర్ : షాద్ నగర్ పట్టణంలో అనుమతులు లేకున్నా పదుల సంఖ్యలో అక్రమ సెల్లార్లు,బహుళ అంతస్తుల భవనాలు ఇష్టానుసారంగా నిర్మిస్తున్న చూసి చూడనట్టు వదిలేయటమేంటని, పుట్టగొడుగుల్లా వెలుస్తున్న షాద్ నగర్ మున్సిపల్ అధికారులు ( టౌన్ ప్లానింగ్) అధికారులకు కనబడటం లేదా అని షాద్ నగర్ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పట్టణంలో సామాన్య ప్రజలు ఇల్లు కట్టుకోవాలంటే అధికారుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగిన అనుమతులు ఇవ్వరని అదే బడా బాబులకు మాత్రం సరైన పత్రాలు లేకున్నా క్షణాల్లో అనుమతులు లభిస్తాయని అధికారుల తీరుపై సామాన్యులు మండి పడుతున్నారు. ఈ అక్రమ నిర్మాణాలపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలని వాటిని అరికట్టాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు. లంచాలకు అలవాటు పడిన అధికారులతో ప్రభుత్వ ఆదాయానికి భారీ గడ్డి పడుతుందని ఇలాంటి వాటిని అడ్డుకోవాల్సిన అధికారులే చూసి చూడనట్టు వదిలేస్తే అర్థమేంటని అనుకుంటున్నారు. ఇప్పటికైనా మామూళ్ల మత్తును వదిలేసి అక్రమ నిర్మాణాలను ఆపాలని ప్రజలు షాద్నగర్ మున్సిపల్ అధికారులను కోరుతున్నారు. షాద్నగర్లో సెల్లార్ల నిర్మాణాలకు అనుమతి లేకున్నా నిర్మాణాలు ఎలా నిర్మిస్తున్నారు. ఈ అధికారుల పనితీరుపై ప్రజా ప్రతినిధులు దృష్టి సారించి ప్రజలకు చేయాలని షాద్నగర్ ప్రజలు కోరుతున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు