Friday, May 3, 2024

నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలంటే కేసీఆర్ ఉద్యోగం పోవాలే

తప్పక చదవండి
  • గిరిజనులు, ఆదివాసీల అభివృద్ధికి ఇందిర ఎంతో కృషి
  • ఎన్నికల్లో కాంగ్రెస్ అద్భుత విజయం సాధిస్తుందని ధీమా
  • తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకే రాష్ట్రం ఇచ్చారన్న ప్రియాంక

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ విమర్శలు చేశారు. ఆదివారం ఉమ్మడి ఆదిలాబాద్ లో ఖానాపూర్, ఆసిఫాబాద్ నియోజకవర్గాలలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా జరిగిన విజయభేరి సభలో ఆమె మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు అని, ఎన్నో బలిదానాలు చూసి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇస్తే.. కేసీఆర్ మాత్రం తెలంగాణ ప్రజలను మోసం చేసి ప్రభుత్వం ఏర్పాటు చేసుకుని నిరుద్యోగులను మోసం చేసిందన్నారు. అయన ఇంట్లోనే 4గురికి ఉద్యోగాలు ఇచ్చుకున్నారన్నారు. మరోవైపు మోదీ కార్పొరేట్ రంగాలకు ఊతం కల్పిస్తూ ప్రజలను నట్టేట ముంచుతున్నారన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఎంఐఎం పార్టీలు ఒకటేనని వారిలో ఎవరికి ఓటేసినా కూడా ప్రజలు మరోసారి మోసపోవడం ఖాయం అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పేదల సంక్షేమానికి ఇందిరాగాంధీ విశేషంగా కృషి చేసిందని, పాత సంక్షేమాలకు కొత్త పేర్లు పెట్టి ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. ఆదివాసీలు అంటే ఇందిరా గాంధీకి ఎంతో ఇష్టం ఉండేదని, అందులో భాగంగానే ఐటీడీఏలు, ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్లు, గిరిజన అభివృద్ధి పథకాలు, పోడు వ్యవసాయానికి పట్టాలు, పక్కా ఇండ్లు , ఎన్నో నిర్మించారని అందుకే ఇందిరమ్మ పేరు చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. ఇందిరాగాంధీ మరణించి 40 ఏళ్లైనా ఇంకా ప్రజల గుండెల్లో ఉన్నారన్నారు. ఆమె చేసిన పనుల వల్ల ప్రజలు ఆరాధిస్తున్నట్లు చెప్పారు. ఆదివాసీ సంస్కృతి ప్రపంచంలోనే అత్యున్నతమైనది అన్నారు. గిరిజనులు, ఆదివాసీల అభివృద్ధికి ఇందిరాగాంధీ కృషి చేశారన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ అద్భుత విజయం సాధిస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు. పరీక్ష తేదీలు, ఫలితాల ప్రకటన తేదీలు జాబ్ క్యాలెండర్‌లో వుంటాయని ప్రియాంకా గాంధీ చెప్పారు. ఆసిఫాబాద్ ప్రజలకు బీఆర్ఎస్ ఏం చేసిందో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. తెలంగాణ యువతకు 2 లక్షలు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామన్నారు. ధరణి ద్వారా రైతులను , ప్రజలను బీఆర్ఎస్ మోసం చేస్తుందని ప్రియాంకా దుయ్యబట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ఆమె హామీ ఇచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల రైతులు అప్పులు పాలవుతున్నారని ప్రియాంకా ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు పండించిన పంటలకు మద్ధతు ధర ఇస్తామని.. ప్రజాధనం ప్రజలకే చెందాలనేదే కాంగ్రెస్ విధానమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో లక్ష కోట్ల అవినీతి జరిగిందని ప్రియాంకా గాంధీ ఆరోపించారు. కాళేశ్వరం, ఢిల్లీ లిక్కర్ స్కాంపై మోడీ మాట్లాడరని .. కేవలం కాంగ్రెస్ నేతలపైనే ఈడీ, సీబీఐని పంపిస్తారని ఆమె దుయ్యబట్టారు. రెండు సార్లు నమ్మి బీఆర్ఎస్‌కు ఓటు వేసి 10 ఏళ్లు వెనక్కిపోయారని .. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ప్రజలు సంతోషంగా వున్నారని ప్రియాంక చెప్పారు.

ప్రజలకు జవాబుదారిగా వున్న నేతలను ఎన్నుకోవాలని .. ఆత్మపరిశీలన చేసుకుని ఓటు వేయాలని ఆమె పిలుపునిచ్చారు. అమరవీరుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తామని.. జల్ , జంగల్, జమీన్‌పై ఆదివాసులకు హక్కు వుంటుందని ఇందిర భావించేవారని ప్రియాంకా గాంధీ తెలిపారు. మీ భూములపై హక్కులను ఇందిరాగాంధీ కల్పించారని ఆమె గుర్తుచేశారు. బీఆర్ఎస్‌‌పై పెట్టుకున్న ఆశలు ఒక్కటీ నెరవేరలేదని.. బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒక్కటేనని ఆరోపించారు. ప్రధాని మోడీ విధానాలను కేసీఆర్ ఎప్పుడూ వ్యతిరేకించరని.. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం కలిసి నాటు నాటు డ్యాన్స్ వేస్తున్నారని ప్రియాంకా సెటైర్లు వేశారు.

- Advertisement -

వాళ్ల డ్యాన్సులు చూడండి.. కానీ ఓటు వేయొద్దని ఆమె పిలుపునిచ్చారు. బీఆర్ఎస్‌కు ఓటేస్తే బీజేపీకి ఓటు వేసినట్లేనని.. పదేళ్లలో తెలంగాణ పురోగతి సాధించిందా లేదా ఆలోచించాలని ప్రియాంకా గాంధీ కోరారు. తెలంగాణలో పదేళ్లలో ఒకదాని తర్వాత ఒకటి అన్నీ స్కాములేనని .. బీఆర్ఎస్, బీజేపీకి ఎంఐఎం తమ్ముడు ఉన్నాడని సెటైర్లు వేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి చేసిందని చెబుతున్న మోడీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రియాంకా ప్రశ్నించారు. ప్రధాని మోడీ సీబీఐ, ఈడీని కాంగ్రెస్ నేతలపైనే ప్రయోగిస్తున్నారని.. తెలంగాణలో ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం కావాలా.. వద్దా అని ఆమె కోరారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని ప్రియాంకా గాంధీ తెలిపారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు