Friday, May 3, 2024

మా సహనాన్ని పిరికితనంగా భావిస్తే ఖబడ్దార్…

తప్పక చదవండి
  • మీరు ఏ దేశానికి భక్తులు..పాకిస్తాన్ కా..? ఆఫ్గనిస్తాన్ కా.. ?
  • మీకసలు జనగణమన, వందేమాతరం ఆలపించడం తెలుసా.. ?
  • ఇదే నా సవాల్.. మీరు దేశభక్తులైతే భాగ్యలక్ష్మీ వద్ద ఆలపించే దమ్ముందా.. ?
  • దాడులకు యత్నించిన మజ్లిస్ నాయకులపై పోలీసులెందుకు చర్యలు తీసుకోవడం లేదు?
  • ఫిర్యాదు చేసిన బీజేపీ నేతలపైనే ఉల్టా కేసులు పెట్టి సమాజానికి ఏ సంకేతాలు పంపుతున్నారు?
  • దారుస్సలాం పై జెండా ఎగరేసే సత్తా మాకుంది..
  • తక్షణమే బీజేపీ కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలి..
  • ఎంఐఎం కార్యకర్తలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే..

( ఓల్డ్ సిటీ న్యూసిటీగా మారకపోవడానికి కారణం ఎంఐఎం, బీఆర్ఎస్ కాదా? మిమ్ముల్ని చూసి పాతబస్తీ మేధావులు ఛీదరించుకుంటున్నారు.. ప్రశాంతమైన తెలంగాణను నాశనం చేయడమే పని.. కాంగ్రెస్, బీఆర్ఎస్ రాజకీయ అవకాశవాద పార్టీలు : బండి సంజయ్ కుమార్ )

న్యూ ఢిల్లీ : బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలపై మరోసారి నిప్పులు చెరిగారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో, కరీంనగర్ లో ఆ పార్టీలు కలిసి విధ్వంసం సృష్టించాలనుకుంటున్నాయని మండిపడ్డారు. ఎంఐఎం కార్యకర్తలు తన ఇల్లు, ఆఫీస్ పైకి ర్యాలీగా వెళుతూ దాడికి యత్నిస్తే పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేని ప్రశ్నించారు. ఆత్మరక్షణ కోసం యత్నించిన బీజేపీ కార్యకర్తలపై ఉల్టా కేసులు పెట్టడం ద్వారా సమాజానికి ఏ సంకేతాలు పంపుతున్నారని నిలదీశారు. మా సహనాన్ని చేతగాని తనంగా భావిస్తే ఖబడ్దార్… అంటూ హెచ్చరించారు. తామే నిజమైన దేశభక్తులమని, తెలంగాణ ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా తాము చెప్పినట్లే నడవాలంటూ ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. ‘‘ మీరు దేశభక్తులా…. ఏ దేశానికి? పాకిస్తాన్ కా… ఆఫ్ఘనిస్తాన్ కా?’’అని ప్రశ్నించారు. మీరు నిజంగా దేశభక్తులే అయితే భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయంవద్దకు వచ్చి జాతీయ గీతమైన జనగణమణ, వందేమాతరం గీతాలను ఆలపించాలంటూ సవాల్ విసిరారు. శనివారం రోజు ఢిల్లీ నుండి హైదరాబాద్ బయలు దేరేముందు బండి సంజయ్ కరీంనగర్ ఘటనతోపాటు బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీ తీరును తప్పుపడుతూ వీడియో సందేశాన్ని పంపారు.

- Advertisement -

అందులోని ముఖ్యాంశాలు :
భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దేశం కోసం, ధర్మం కోసం పనిచేసే కార్యకర్తలు. తెలంగాణలో, కరీంనగర్ లో ప్రశాంతంగా ఉండాలని, ప్రజలు సంతోషంగా ఉండాలి కోరుకుంటున్నాం. కానీ బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీ కలిసి విధ్వంసం స్రుష్టించాలని కుట్ర చేస్తున్నయ్. దీనికి మతం రంగు పులిమి బదనాం చేయాలని చూస్తున్నయ్. పోలీస్ వ్యవస్థ కలుషితమైంది. కొందరు పోలీసులు ప్రమోషన్లు, పోస్టింగుల కోసం బీఆర్ఎస్ చెప్పుచేతల్లో ఉంటూ బీజేపీ కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేసి కేసులు పెడుతున్నారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే కేసులు పెడుతూ, రౌడీషీట్లు ఓపెన్ చేస్తున్నారు. బీఆర్ఎస్, ఎంఐంఎం నేతలు విధ్వంసం స్రుష్టిస్తున్నా, కుట్రలు చేస్తున్నా పట్టించుకోరు. నిజాయతీ గల పోలీసులు దీనిని చూసి అసహ్యించుకుంటున్నారు. దాడులు చేశారని ఫిర్యాదు చేసిన బీజేపీ కార్యకర్తలపైనే కేసులు పెడుతున్నారంటే పోలీసులు తీరు ఎట్లా ఉందో అర్ధం చేసుకోవచ్చు. దీనివల్ల పోలీసులు ప్రజలకు ఏ సంకేతాలు పంపుతున్నారు. ఎంఐఎం నేతలు, బీఆర్ఎస్ నేతలు ఎలాంటి విధ్వంసమైనా స్రుష్టించవచ్చని, ఎవరి ఇళ్లపైనైనా, ఆఫీసులపైనైనా దాడులు చేయవచ్చని చెబుతున్నారా? ఇది తప్పని చెప్పే వాళ్లపై ఉల్టా కేసులు పెడతామని చెబుతున్నారా?. ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి ఉందా? అసలు ఎవరు ఎవరి ఇండ్లపైకి, ఆఫీసులపైకి వెళ్లారు? మా బీజేపీ కార్యకర్తలేమైనా దారుస్సలాం ఎంఐఎం ఆఫీస్ పై దాడికి పోయారా? ఎంఐఎం కార్యకర్తల ఇళ్లపై దాడులకు పోయారా?….. మా ధైర్యాన్ని, సాహసాన్ని పిరికితనంగా భావిస్తే ఖబడ్దార్… దారుస్సలాంపై జెండా ఎగరేస్తాం. అనవసరంగా మమ్ముల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేయొద్దు. ఎంఐఎం అడ్డా అని చెప్పుకున్న పాతబస్తీకి పోయి కాషాయ జెండా ఎగరేసిన చరిత్ర మాది. ఎవడికి ఆపే తరరం లేదు. ఒక పార్టీకి, వర్గానికి కొమ్ము కాస్తే ధీటుగా ఎదుర్కొనే సత్తా బీజేపీకి ఉందనే సంగతిని పోలీసులు, బీఆర్ఎస్ నేతలు గుర్తుంచుకోవాలి.

పోలీసులు నిజానికి ఎవరిని కంట్రోల్ చేయాలి? ర్యాలీకి పోలీసులెట్లా పర్మిషన్ ఇచ్చారు? మెయిన్ రోడ్డు ఎక్కడ? మా ఇల్లు, ఆఫీస్ ఎక్కడ? మా ఇళ్లపైకి, ఆఫీసుల పైకి రెండుమూడుసార్లు ర్యాలీగా వెళుతుంటే పోలీసులు ఏం చేస్తున్నరు? ఆత్మరక్షణ కోసం మా కార్యకర్తలు నిలబడితే ఉల్టా చోర్ కోత్వాల్ కే డాంటే మాదిరిగా… తిరిగి వాళ్లపైనే కేసులు పెడతారా? ఇదేనా పోలీస్ వ్యవస్థ? మీపై మీకు అసలు నమ్మకం ఉందా? తప్పు చేసిన వాళ్లను రక్షిస్తూ… ఫిర్యాదు చేసిన వాళ్లపైనే కేసులు పెట్టాలని పోలీసులకు అంబేద్కర్ రాజ్యాంగంలోని ఏ సెక్షన్ చెబుతోంది? మీరు అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం నడుచుకోవడం లేదా? తెలంగాణలో కేసీఆర్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారా? కేసీఆర్ రాజ్యాంగంలో మజ్లిస్ నాయకులకు మాత్రమే రక్షణ ఇవ్వాలని ఉందా? ప్రజా సమస్యలపైన పోరాడే బీజేపీ కార్యకర్తలపై కేసులు పెట్టి అరెస్ట్ చేసి వేధించాలని ఉందా? బీఆర్ఎస్ పార్టీ అండ చూసుకుని నిన్న ఒవైసీ ఏమన్నడు ‘‘ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఎంఐఎం చెప్పినట్లే వినాలి. మేం చెప్పినట్లే నడవాలి. అధి కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా మరే పార్టీ అయినా అంతే’’ అని విర్రవీగుతున్నడు. మీరు చెప్పినట్లు ఆడటానికి మాది బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ కాదు… అణువుణా దేశభక్తిని నింపుకుని ధర్మం కోసం, ప్రజల కోసం పనిచేస్తూ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కాషాయ జెండా పట్టుకుని తెగించి కొట్లాడే పార్టీ బీజేపీ… ఆనాడు చీర కొంగు నడుముకు చుట్టి పోరాడిన చాకలి ఐలమ్మ వంటి తెలంగాణ సాయుధ పోరాట యోధుల దెబ్బకు పాకిస్తాన్ పారిపోయిన ఖాసీం రజ్వీ పార్టీ ఎంఐఎం. ప్రశాంతంగా ఉన్న తెలంగాణను నాశనం చేసేందుకు ఎంఐఎం కుట్రలు చేస్తున్నా నోరు మెదపరా? పాతబస్తీ ప్రజలు దశాబ్దాల తరబడి పేదరికంలోనే మగ్గుతున్నా పట్టించుకోరా? ఓల్డ్ సిటీ న్యూసిటీ కాకుండా చేస్తున్న కుట్రలను అడ్డుకోరా?

మజ్లిస్ ఆగడాలపై పోరాడుతూఅధికారంలోకి వస్తే ఓల్డ్ సిటీని న్యూ సిటీ చేద్దామనుకుంటున్న బీజేపీపై మతతత్వవాదిగా ముద్ర వేస్తారా? పాతబస్తీలోని ముస్లిం మేధావులు కూడా ఎంఐఎం ఆగడాలను చీదరించుకుంటున్నారు. ముస్లిం మహిళలంతా మహిళా రిజర్వేషన్ బిల్లును, ట్రిపుల్ తలాఖ్ చట్టాన్ని వ్యతిరేకించిన ఎంఐఎం పార్టీని తరిమికొట్టాలని చూస్తోంది. బీజేపీ అధికారంలోకి వస్తే మనుగడే ఉండదనే భయంతో ఎంఐఎం నాయకులు బెదిరింపులు, దాడులకు పాల్పడుతూ తెలంగాణలో అల్లర్లు స్రుష్టించి లబ్ది పొందాలని కుట్ర చేస్తున్నరు. ఈ మధ్య అసదుద్దీన్ ఒవైసీ చెప్పిన మాటలు వింటే నవ్వొచ్చింది. ఎంఐఎం నాయకులే అసలు సిసలైన దేశభక్తులట. నేనడుగుతున్నా…. ‘‘దేశభక్తులమని చెప్పే ఎంఐఎం నాయకులు ఏ దేశానికి భక్తులు. పాకిస్తాన్ కా?… ఆఫ్గనిస్తాన్ కా?… అసలు ఏనాడైనా మీ నోటి నుండి జాతీయ గీతమైన జనగణమణ, వందేమాతరం ఆలపించారా? అసలు మీకు జనగణమణ, వందేమాతరం ఆలపించడం వచ్చా? నేను సవాల్ చేస్తున్నా…. మీరు నిజంగా భారత దేశ భక్తులైతే… మీలో తెలంగాణ రక్తమే ప్రవహిస్తే… పాకిస్తాన్ వారసులు కాదని భావిస్తే… మీ పార్టీ ప్రజా ప్రతినిధులందరితో కలిసి పాతబస్తీ భాగ్యలక్ష్మీ ఆలయం వద్దకు రండి… మీడియాను కూడా పిలుద్దాం. అందరి సమక్షంలోనే జాతీయ గీతమైన వందేమాతరం, జనగణమన గీతాలను ఆలపించండి. ఇదే నా ఛాలెంజ్…. మీకు దమ్ముంటే ఈ దేశ భక్తులే అయితే నా సవాల్ కు సిద్ధం కావాలి. ఎంఐం దేశ ద్రోహుల పార్టీ. దేశ ద్రోహులు చస్తే సంతాప సభలు నిర్వహించే పార్టీ. మిమ్ముల్ని అడ్డుకుంటాం. అరాచకాలను ఆపేదాకా బీజేపీ పోరాడుతాం. బీజేపీ కార్యకర్తలపై పెట్టిన కేసులు ఎత్తివేసి అక్రమ కేసులు పెట్టిన వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు