Wednesday, May 8, 2024

కేసీఆర్ ఆశీస్సులు ఉంటే గోషామహల్ లో గెలుస్తా..

తప్పక చదవండి
  • గోషామహల్ ప్రజల ఆశీస్సులతో ముందుకు దూసుకుపోతున్న
    ఆశిష్ కుమార్ యాదవ్…
  • ఏ పదవీ లేకున్నా ప్రజాసేవే ఆయన లక్ష్యం..
  • కేసీఆర్ సేవాగుణాన్ని స్ఫూర్తిగా తీసుకున్న యువ లీడర్..
  • పలు సేవా కార్యక్రమాలతో దూసుకుపోతున్న వైనం..
  • గోషామహల్ బీ.ఆర్.ఎస్. టికెట్ ఆయనకిస్తే గెలుపు ఖాయం.. !
  • ముఖ్యమంత్రి కెసిఆర్ ని కలసిన ఆశిష్ కుమార్ యాదవ్…
  • గోషామహల్ నియోజకవర్గం పరిస్థితిపై సీఎం ఆరా..

సేవ చేయడానికి పదవులు అవసరం లేదు.. చేయాలనే ఆకాంక్ష ఉంటే చాలు.. ప్రజల కష్టాలు తెలిస్తే చాలు.. స్థానిక ష్టితిగతులపై అవగాహన ఉంటే చాలు.. అలాంటి కోవలోకే వస్తారు ఈ యువ నాయకులు.. గోషామహల్ నియోజకవర్గ పరిధిలో ఆయన పేరు తెలియని వారు లేరు.. ప్రతి పేదవాడి చిరునవ్వులో ఆయన కనిపిస్తాడు.. ఆకలి తీర్చుకున్న ప్రతి హృదయం ఆయనకు దీవెనలు అందిస్తూనే ఉంటుంది.. ఒకటా రెండా ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజా నాయకుడిగా అతి తక్కువ కాలంలోనే పేరు సంపాదించిన ఆశిష్ కుమార్ యాదవ్, కేసీఆర్ లోని సేవాగుణాన్ని పుణికి పుచ్చుకుని నియోజకవర్గంలో దూసుకుపోతున్నారు.. కేసీఆర్ ప్రకటించిన అసెంబ్లీ అభ్యర్థుల లిస్ట్ లో గోషామహల్ ను ఖాళీగా ఉంచిన విషయం విదితమే.. ఈ స్థానంలో ఆశిష్ కుమార్ యాదవ్ కి బీ.ఆర్.ఎస్. అభ్యర్థిగా అవకాశం కలిపిస్తే ఆయన ఖచ్చితంగా విజయం సాధిస్తారు అంటున్నారు గోషామహల్ ప్రజలు, అభిమానులు..

హైదరాబాద్:
గోషామల్ నియోజక వర్గంలో ఈమధ్య వినిపిస్తున్న పేరు యువనాయకుడు ఆశిష్ కుమార్ యాదవ్.. ఏ పదవి లేకున్నా నియోజకవర్గ వ్యాప్తంగా సేవా కార్యక్రమాలతో దూసుకుపోతున్నారు.. అడిగిన వారికి కాదనకుండా హితోధికంగా సహాయం చేస్తూ ప్రజా నాయకుడిగా పేరుతెచ్చుకున్నారు.. యువకుడైనందువల్ల అలుపు, సొలుపూ పక్కనబెట్టి అనుక్షణం ప్రజల్లో ఉంటూ వారికి ఆత్మబంధువులా మారిపోయారు.. ” ఆశిష్ కుమార్ ఆయుష్ కేంద్ర ” అనే స్వచ్చంద సంస్థ ద్వారా ఉచిత మెడికల్ క్యాంప్ లు, రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ ప్రజారోగ్యం కోసం అనుక్షణం పాటుపడుతున్నారు.. పేదలు, వ్యాపారస్తులు, స్థానిక నాయకులు, విద్యార్థినీ విద్యార్థులు ఒక్కరేమిటి అన్నివర్గాలవారికి ఆశిష్ యాదవ్ అండగా నిలుస్తూ వారిలో మమేకమై కలిసిపోతున్నారు.. తెలంగాణ రాష్ట్రంలోని బస్తీ దవాఖానలకు చేయూతగా ఆశిష్ నిర్వహిస్తున్న వైద్య శిబిరాలు ఎందరో పేదలకు ఆరోగ్యాన్ని అందించాయి.. ఎన్నో రకాల జబ్బులకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి, చికిత్సలు చేయిస్తూ, మందులను కూడా ఉచితంగా అందిస్తున్నారు ఆశిష్ యాదవ్.. ఇదొక్కటే కాకుండా ఇంకా ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు ఆయన నిర్వహిస్తున్నారు.. పాఠశాలల స్టూడెంట్స్ కు ఉచితంగా అవసరమైన పుస్తకాలు, తదితర మెటీరియల్ అందిస్తూ పేద విద్యార్థినీ, విద్యార్థులకు చదువును చేరువ చేస్తున్నారు.. పేదలకోసమే తన జీవితం అంకితం అని చెప్పే ఆశిష్ యాదవ్ నిజంగా అభినందనీయులు.. గోషామహల్ నియోజకవర్గాన్ని సమస్యలు లేని నియోజక వర్గంగా తీర్చిదిద్దాలన్నదే తన ఆశయం అంటారాయన.. ఇంతకు ముందు పనిచేసిన నాయకులు కేవలం పార్టీలకు, స్వప్రయోజనాల కోసమే పనిచేశారని, ఆ పరిస్థితులను చక్కదిద్దాలన్నదే తన ప్రయత్నమని ఆయన అంటారు.. తాను ఏ పదవికోసం ప్రాకులాడటం లేదని, కేవలం ప్రజా సంక్షేమమే తన ఆశయమని వినయంగా చెబుతారు ఆశిష్ యాదవ్..

- Advertisement -

కాగా సోమవారం రోజు హైదరాబాద్ లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలసి నియోజకవర్గంలోని పలు సమస్యల గురించి ఆయన దృష్టికి తీసుకు వెళ్లారు గోషామహల్ యువ నాయకులు ఆశిష్ కుమార్ యాదవ్.. నియోజకవర్గంలోని శిథిలావస్థకు చేరుకున్న పురాతన కట్టడాలకి నిధులు మంజూరు చేయాలని కోరారు.. అలాగే గోషామహల్ అభివృద్ధి కొరకు కృషి చేయాలని కోరడం జరిగింది. దీనికి సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించి.. త్వరలోనే నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఆశిష్ పుష్పగుచ్ఛంతో సీఎం ని సన్మానించి, శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. కేసీఆర్ నియోజకవర్గంలో ప్రస్తుత పరిస్థితిపై వివరాలు అడగగా అక్కడి రాజకీయ సమీకరణాలను వివరించడం జరిగింది.. ఈ సందర్భంగా గోషామహల్ నియోజకవర్గం నుంచి ఆశిష్ యాదవ్ కు సీఎం కేసీఆర్ అవకాశం కల్పించినట్లయితే ఖచ్చితంగా ఆశిష్ విజయం సాధిస్తారని ఆయన అభిమానులు, స్థానిక ప్రజలు చెప్పడం గమనార్హం..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు