Monday, October 14, 2024
spot_img

వాజ్‌పేయ్‌ పార్క్‌ పేరు మార్పు..

తప్పక చదవండి
  • కోకోనట్‌ పార్క్‌గా నామకరణం..
  • సోమవారం నుంచే అమల్లోకి..
  • మండి పడుతున్న బీజేపీ శ్రేణులు..

పాట్నా:
బీహార్‌ రాజధాని పాట్నాలోమాజీ ప్రధాని అటల్‌ బీహారీ వాజ్‌పేయి పేరుతో ఉన్న పార్కును కోకోనట్‌ పార్కుగా మార్చారు. దీనిపై బీజేపీ మండిపడింది.. కంకర్‌బాగ్‌ ప్రాంతంలో ఉన్న అటల్‌ బీహారీ వాజ్‌పేయి పార్కు పేరును కోకోనట్‌ పార్క్‌గా ఆ రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ మార్చారు. ఈ పేరు మార్పు సోమవారం నుంచి అమలులోకి వస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు ఒక శిలాఫలకాన్ని ఆ పార్కులో ఏర్పాటు చేశారు. కాగా, కంకర్‌బాగ్‌ ప్రాంతంలో ఉన్న పార్కును గతంలో కొబ్బరి పార్క్‌గా పిలిచేవారు. అయితే 2018 ఆగస్ట్‌ 16న వాజ్‌పేయి చనిపోగా ఆ పార్కు పేరును అటల్‌ బిహారీ వాజ్‌పేయి పార్కుగా నాటి బీహార్‌ ప్రభుత్వం మార్పు చేసింది. అయితే బీహార్‌లో ప్రస్తుతం అధికారంలో ఉన్న జేడీ(యూ), ఆర్జేడీ నేతృత్వంలోని ప్రభుత్వం తాజాగా ఆ పార్కు పేరును మరోసారి మార్చింది. అటల్‌ బీహారీ వాజ్‌పేయి పార్కు పేరును పాత పేరైన కోకోనట్‌ పార్కుగా తిరిగి నామకరం చేసింది. ఈ మేరకు కొత్త శిలాఫలకాన్ని పార్కులో ఏర్పాటు చేశారు. అయితే పార్కు ప్రవేశం వద్ద వాజ్‌పేయి పేరు ఉన్న బోర్డు, లోపల ఉన్న ఆయన విగ్రహంలో ఎలాంటి మార్పులు చేయలేదు. మరోవైపు పార్కు పేరు మార్పుపై బీజేపీ మండిపడింది.. సీఎం నితీశ్‌ కుమార్‌ ఒకవైపు వాజ్‌పేయి స్మారకానికి పూలమాలలు వేయగా, మరోవైపు ఆయన మంత్రి తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ ఏకంగా ఆ పార్కు పేరును మార్చారని విమర్శించింది. ఇది రెండు నాలుకల ప్రభుత్వమని దుయ్యబట్టింది. అలాగే వాజ్‌పేయి పార్కు పేరును మార్చవద్దని బీజేపీ డిమాండ్‌ చేసింది. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం .. నెహ్రూ, ఇందిరా, రాజీవ్‌ గాంధీ పేర్లున్న కేంద్ర సంస్థల పేర్లు మార్పు చేయడంపై పలు విమర్శలను ఎదుర్కొంటోంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు