Saturday, May 18, 2024

రైతులను కరువుకు వదిలేసిన కర్కశ ప్రభుత్వం : నారా లోకేశ్‌

తప్పక చదవండి

అమరావతి : రైతాంగాన్ని కరువుకు వదిలేసిన కర్కశ ప్రభుత్వం అంటూ టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి కామెంట్స్‌ నారా లోకేష్‌ విరుచుకుపడ్డారు. కరువుపై చర్చించని క్యాబినెట్‌ విూటింగ్‌ ఎందుకు? అని ప్రశ్నించారు. శనివారం విూడియాతో మాట్లాడుతూ.. కర్నూలు జిల్లాలో కరువు కారణంగా పనుల్లేక ఊళ్లకు ఊళ్లు ఖాళీ అవువుతున్నాయన్న వార్తలు ఆందోళనకు గురిచేస్తున్నాయన్నారు. వందేళ్లలో ఈ ఏడాదే అతి తక్కువ వర్షపాతం నమోదైనట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్‌కు రాజకీయ ప్రత్యర్థులను తప్పుడు కేసుల్లో ఇరికించడంపై ఉన్న శ్రద్ధ కరువుతో అల్లాడుతున్న రైతాంగాన్ని ఆదుకోవడంపై లేదని మండిపడ్డారు. అడ్డగోలు దోపిడీపై తప్ప కరువు నివారణ చర్యలు చేపట్టాలన్న సోయి లేదన్నారు. తీవ్ర కరువు పరిస్థితుల్లో రైతాంగం ఉంటే… వారి సమ స్యలపై క్యాబినెట్‌ సమావేశంలో కనీసం చర్చించకపోవడం జగన్‌ ప్రభుత్వానికి అన్నదాతల సమస్యల పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. వర్షాభావ పరిస్థితులపై ప్రభుత్వం కనీసం సవిూక్ష చేయకపోవడం బాధ్యతారాహిత్యమని విమర్శించారు. 400 మండలాల్లో కరువు పరిస్థితులు ఉంటే కేవలం 100 మండలాల్లో కరువు అని ప్రభుత్వం ప్రకటించడం దారుణమన్నారు. కరువు కోరల్లో చిక్కి రైతాంగం విలవిల్లాడుతున్న ఈ కష్టకాలంలో నిబంధనలను సడలించి అయినా యుద్ధప్రాతిపదికన రైతులను ఆదుకోవాల్సిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను అని లోకేష్‌ పేర్కొన్నారు.
గాలిలో దీపంలా ప్రజారోగ్యం : నారా లోకేశ్‌
పాలనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ విమర్శలు గుప్పించారు. పిచ్చోడి పాలన ఫలితం…ప్రజారోగ్యం గాలిలో దీపం… అంటూ వ్యాఖ్యలు చేశారు. నాలుగున్నరేళ్ల జగన్మోహన్‌ రెడ్డి అసమర్థపాలన రాష్ట్ర ప్రజలకు శాపమైందన్నారు. ప్రజారోగ్యం గాలిలో దీపంలా మారిందని అన్నారు. నాగార్జునసాగర్‌ సవిూపాన గల విజయపురి సౌత్‌ కమ్యూనిటీ ఆసుపత్రి ప్రాంగణంలో చెట్లకింద రోగుల దుస్థితి జగన్‌ చేతగాని పాలనకు అద్దం పడుతోందన్నారు. నల్లమల అటవీప్రాంతంలో గిరిజనతాండాల ప్రజలకు ఏకైక దిక్కుగా ఉన్న ఈ ధర్మాసుపత్రిలో మూడేళ్లుగా చెట్లకిందే వైద్యసేవలు అందిస్తున్నారంటే ముఖ్యమంత్రి సిగ్గుతో తలదించుకోవాలని ఆయన తెలిపారు.
రాష్ట్ర వైద్య, ఆరోగ్యమంత్రి సొంతజిల్లాలోనే పరిస్థితి ఇలా ఉంటే అల్లూరి సీతారామరాజు జిల్లాలాంటి మారుమూల గిరిజన ప్రాంతాల ప్రజలకు ఇక ఆ దేవుడేదిక్కని చెప్పుకొచ్చారు. కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో ఆక్సిజన్‌ సరఫరా వైఫల్యం కారణంగా కళ్లెదుటే వేలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడం కళ్లారా చూశామన్నారు. జగన్‌ దివాలాకోరు పాలన పుణ్యమా అని కర్నూలు, అనంతపురం వంటి బోధనాసుపత్రుల్లోనే దూది, గాజుగుడ్డ కూడా అందుబాటులో లేని దుస్థితి నెలకొందన్నారు. ‘‘రాష్ట్రంలో ఇంత దారుణమైన పరిస్థితులు కళ్లెదుట కన్పిస్తుంటే రాజుగారి వంటివిూద దేవతావస్త్రాల మాదిరిగా తమ హయాంలో వైద్య, ఆరోగ్యరంగం వెలిగిపోతుందని, జగనన్న సురక్ష పేరుతో ఇళ్లవద్దకే వెళ్లి వైద్యసేవలు అందిస్తున్నామని చెబుతున్న ముఖ్యమంత్రిని పిచ్చోడుగాక మరేమనాలి?!’’ అంటూ లోకేష్‌ విరుచుకుపడ్డారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు