Wednesday, April 17, 2024

రైతులు, కేంద్ర ఉద్యోగులపై వారాల జల్లు..

తప్పక చదవండి
  • ఆరు పంటలకు కనీస మద్దతు ధర పెంపు
  • కేబినెట్‌ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు
  • కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్ల కరువు భత్యం పెంపు
  • డీఏ పెంపు సహా , రైల్వే ఉద్యోగులకు బోనస్‌
  • 78 రోజుల జీతంతో సమాన బోనస్‌
  • సమావేశ వివరాలను మీడియాకు వెల్లడించిన
    కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్..

న్యూ ఢిల్లీ : పండగ వేళ కేంద్ర ప్రభుత్వ, రైల్వే ఉద్యోగులతో పాటు అన్నదాతలకు కేంద్ర శుభవార్త తెలిపింది. ఢిల్లీ లో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు సహా, రైల్వే ఉద్యోగులకు బోనస్‌, రబీ సీజన్‌లో ఆరు పంటలకు కనీస మద్దతు ధర పెంపు వంటి వాటికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 2024-2025 రబీ సీజన్‌కు గాను గోధుమ, బార్లీ, సన్‌ఫ్లవర్‌, శనగ, ఆవాలు, కందులు ఆరు పంటలకు కనీస మద్దతు ధర పెంపునకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. గోధుమలకు కనీస మద్దతు ధరను క్వింటాలుకు రూ.150 పెంచుతూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయం ప్రకారం.. గోధుమల కనీస మద్దతు ధరను రూ.150 పెంచడంతో క్వింటా గోధుమల ధర రూ.2,275కు చేరుకుంది. అలాగే బార్లీపై రూ.115 పెంచి రూ.1850బీ శెనగపై రూ.105 పెంచి రూ.5440బీ కందులుపై రూ.425 పెంచి రూ.6425బీ ఆవాలుపై రూ.200 పెంచి రూ.5650బీ సన్‌ఫ్లవర్‌పై రూ.150 పెంచి రూ.5,800గా కనీస మద్దతు ధరగా నిర్ణయించారు. కేబినెట్‌ సమావేశం అనంతరం నిర్ణయాలను కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ మీడియాకు తెలిపారు.

పండుగకు ముందే ప్రభుత్వోద్యోగులకు, పెన్షనర్లకు మోడీ ప్రభుత్వం పెద్ద కానుకను అందించింది. కేబినెట్‌ సమావేశంలో కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్ల కరువు భత్యం పెంపునకు ఆమోదం తెలిపింది. డియర్‌నెస్‌ అలవెన్స్‌లో 4 శాతం పెంపుతో 42 శాతం నుంచి 46 శాతానికి పెంచారు. అక్టోబరు 18 నాడు మంత్రివర్గ సమావేశం జరిగింది. దీనిలో డియర్‌నెస్‌ అలవెన్స్‌ పెంపునకు ఆమోదం లభించింది. కరువు భత్యం పెంపుతో పాటు కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు అక్టోబర్‌ నెల జీతం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. జూలై నుండి సెప్టెంబర్‌ వరకు ఉన్న బకాయిలను కూడా అక్టోబర్‌ నెల జీతంతో పాటు కేంద్ర ఉద్యోగులు.. పెన్షనర్లకు ఇవ్వవచ్చు. నవరాత్రి ఉత్సవాలు అక్టోబర్‌ 15 నుండి ప్రారంభమయ్యాయి. అక్టోబర్‌ 24న దసరా, నవంబర్‌ 12న దీపావళి. ఈ పండుగల కల్లా కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు డియర్‌నెస్‌ అలవెన్స్‌ను పెంచాలని మోడీ ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో 47 లక్షల మంది ఉద్యోగులు, 68 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. డియర్‌నెస్‌ అలవెన్స్‌ పెంపుతో కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లు ద్రవ్యోల్బణం నుంచి ఉపశమనం పొందుతారు. ఇటీవలి కాలంలో ఆహార ద్రవ్యోల్బణం బాగా పెరిగింది. అయితే, రిటైల్‌ ద్రవ్యోల్బణం ఆగస్టులో 6.83 శాతంగా ఉన్న సెప్టెంబర్‌లో 5.02 శాతానికి పడిపోయింది. దీపావళికి ముందు రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. రైల్వే ఉద్యోగులకు వారి 78 రోజుల జీతంతో సమానంగా బోనస్‌ ఇచ్చేందుకు కేంద్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య వల్ల 11.07 లక్షల మంది జాతీయ రవాణా సంస్థలోని నాన్‌ గెజిటెడ్‌ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. బోనస్‌ చెల్లింపు వల్ల ప్రభుత్వ ఖజానాపై రూ.1968.87 కోట్ల భారం పడుతుందని భావిస్తున్నట్లు మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ తెలిపారు. సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ ప్రకటన చేస్తూ.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం 2022-23 ఆర్థిక సంవత్సరానికి 78 రోజుల వేతనానికి సమానమైన ఉత్పాదకత లింక్డ్‌ బోనస్‌ (%ూూదీ%)ని అన్ని అర్హతలు కలిగిన నాన్‌ గెజిటెడ్‌ రైల్వేలకు ఆమోదించిందని తెలిపారు. 2022-2023 ఆర్థిక సంవత్సరానికి గాను 78 రోజులకు సమానమైన వేతనాన్ని బోనస్‌గా చెల్లించనున్నారు. రైల్వేలోని ఆర్పీఎఫ్‌, ఆర్పీఎస్‌ఎఫ్‌ సిబ్బంది మినహా ట్రాక్‌ మెయింటెయినర్లు, లోకో పైలట్లు, రైలు మేనేజర్లు (గార్డులు), స్టేషన్‌ మాస్టర్లు, సూపర్‌వైజర్లు, టెక్నీషియన్లు, టెక్నీషియన్‌ హెల్పర్లు, పాయింట్‌మెన్‌, మినిస్టీరియల్‌ సిబ్బంది, ఇతర గ్రూప్‌ ‘సి’ సిబ్బందికి ఈ నిర్ణయం ప్రయోజనం చేకూరుస్తుంది. బోనస్‌ చెల్లింపు వల్ల ఖజానాపై రూ.1,968.87 కోట్ల భారం పడుతుందని భావిస్తున్నట్లు మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ తెలిపారు.రైల్వే ఉద్యోగులకు ప్రయోజనాలను కల్పిస్తూ, 11,07,346 మంది రైల్వే ఉద్యోగులకు రూ.1,968.87 కోట్ల పీఎల్‌బీని చెల్లించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 2022-2023 సంవత్సరంలో రైల్వే పనితీరు చాలా బాగుంది. రికార్డు స్థాయిలో 1,509 మిలియన్‌ టన్నుల కార్గో లోడ్‌ అయిందని అధికారిక ప్రకటన తెలిపింది. దీనితో పాటు, ఈ ఆర్థిక సంవత్సరంలో రైల్వేలో సుమారు 6.5 బిలియన్ల (650 కోట్లు) ప్రయాణికులు రైలులో ప్రయాణించారు. మూలధన వ్యయం, రైలు కార్యకలాపాలలో సామర్థ్యం, మెరుగైన సాంకేతికత కారణంగా మెరుగైన మౌలిక సదుపాయాలతో రైల్వే రికార్డు పనితీరు అంచనా వేయబడిరదని ప్రకటన పేర్కొంది. రైల్వే ఉద్యోగుల పనితీరును మరింత మెరుగుపరిచేందుకు కృషి చేసేందుకు పీఎల్‌బీ చెల్లింపు ప్రోత్సాహకంగా పనిచేస్తుందని ఆ ప్రకటన పేర్కొంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు