Monday, May 6, 2024

ఇజ్రాయిల్ నుంచి ఢిల్లీకి..

తప్పక చదవండి
  • క్షేమంగా చేరుకున్న భారతీయులు..
  • ప్రయాణీకులకు స్వాగతం పలికిన కేంద్ర మంత్రి రాజీవ్..

న్యూఢిల్లీ : ఇజ్రాయిల్, హమాస్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఈ యుద్ధంలో ఇరు దేశాలకు చెందిన పౌరులు కూడా మరణించారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయిల్ నుండి తన పౌరులు సురక్షితంగా తిరిగి రావడానికి భారతదేశం ఆపరేషన్ అజయ్‌ను ప్రారంభించింది. ఈ క్రమంలో ఇజ్రాయిల్ నుండి 212 మంది భారతీయ పౌరులతో కూడిన మొదటి బ్యాచ్ ఈ ఉదయం ఏ I1140 విమానంలో న్యూఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంది. ఈ సమయంలో ఇజ్రాయిల్ నుండి తమ దేశానికి తిరిగి వచ్చిన ప్రయాణికులకు కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ విమానాశ్రయంలో స్వాగతం పలికారు. ఇజ్రాయిల్ లో జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో ఆ దేశం విడిచి 212 మంది భారతీయులతో కూడిన మొదటి చార్టర్ విమానం గురువారం బెన్ గురియన్ విమానాశ్రయం నుండి బయలుదేరింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు