Sunday, May 5, 2024

అప్పుడు స్వాతంత్రం కోసం పోరాటం..ఇప్పుడు భూమికోసం పోరాటం..

తప్పక చదవండి
  • ఆగిన ఓ స్వతంత్ర పోరాట యోధుడి గుండె..
  • ప్రభుత్వం కనికరించకపోవడంతో తుది శ్వాస..
  • పలువురిని కంటతడి పెట్టిస్తున్న మేక మల్లారెడ్డి దీన గాధ..

హైదరాబాద్ : స్వాతంత్య్ర పోరాట సమర యోధుడు, హన్మకొండ జిల్లా, ఆత్మకూరు మండలంలోని, గుడెపాడ్ కు చెందిన మేక మల్లారెడ్డి (91) మృతి చెందాడు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మల్లారెడ్డి మంగళవారం రోజు ఉదయం గుడెపాడ్ లోని ఆయన స్వగృహంలో కన్నుమూసారు. స్వాతంత్ర్య పోరాటంలో అలుపెరుగని పోరాటం చేసి, నిజాంపై తిరుగుబాటు చేసి, జైలుకు వెళ్లిన మల్లయ్య మృతిచెందడం పట్ల ఆయన కుటుంబ సభ్యులు, పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వీరయ్య ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మేక మల్లారెడ్డి సోమవారం ఉదయం హన్మకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చి స్వతంత్ర సమరయోధులు కోటా కింద తనకు రావాల్సిన భూమి కోసం దరఖాస్తు చేసుకున్నారు.. ఇలా కొన్ని వందల సంఖ్యలో, ఎన్నో సార్లు భూమి కోసం దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు ఆయన కుటుంబ సభ్యులు.. కనీసం తాను చనిపోయే వరకు అయినా భూమి కేటాయిస్తారా..? లేదా అని ఆయన కలెక్టరేట్ కార్యలయ ఉద్యోగులని గట్టిగా అడిగారు. చనిపోయిన తర్వాత అయిన తన కుటుంబానికి భూమి కేటాయించండి అని బాధతో వాపోయారు. ఇదే విషయాన్ని గురించి పదే పదే కుటుంబ సభ్యులుతో చేర్చిస్తూ.. ఆవేదనతో సడెన్ గా గుండె పోటు రావడంతో చనిపోయారు. కలెక్టర్ కార్యాలయం చుట్టూ ఎన్ని సార్లు తిరిగినా అధికారులు కనికరించక పోవడంతో.. పైగా స్వాతంత్ర సమరయోధునికి ప్రభుత్వం భూమి కేటాయించిలేదని ఆవేదనతో ఆయన గుండెపోటుతో మరణించారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు