Wednesday, May 15, 2024

మరికొన్ని రోజులు చంద్రబాబు.. చీకటి గదిలోనే

తప్పక చదవండి
  • మరోసారి రిమాండ్ పొడిగించిన న్యాయస్థానం
  • నాయకులు, కార్యకర్తలు సహనం కోల్పోవద్దు
  • కడిగిన ముత్యంలా బాబు బయటకు రావడం ఖాయం
  • టీడీపీ గెలుపు కోసం అందరు శ్రమించామని విజ్ఞప్తి
  • ఉమ్మడి రాష్ట్రాల్లో టీడీపీ గెలుపును ఎవ్వరు అడ్డుకోలేరు
  • ధీమా వ్యక్తం చేసిన టీడీపీ జాతీయ కార్యదర్శి కాసాని వీరేష్ ముదిరాజ్

స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో అరెస్ట్ అయిన చంద్రబాబు మరికొన్ని రోజుల్లో జైల్లోనే ఉండనున్నారు. చంద్రబాబు రిమాండ్ ను విజయవాడ ఏసీబీ కోర్టు మరోసారి పొడిగించింది. ఈ నెల 19 వరకు రిమాండ్ పొడిగిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్ నేటితో (అక్టోబర్ 5) ముగిసింది. దీంతో రిమాండ్ పొడిగించాలని కోర్టులో సీఐడీ మెమో దాఖలు చేసింది. చంద్రబాబును వర్చువల్ గా విచారించిన జడ్జి.. 14 రోజులు రిమాండ్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు . చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటిషన్లపై వాదోపవాదాలు తీవ్ర స్థాయిలో జరిగాయి. చంద్రబాబు తరపు న్యాయవాది, సీఐడీ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. వారి దగ్గరున్న సాక్ష్యాలను కోర్టుకి సమర్పించారు. ఈ కేసులో ఉన్న అభియోగాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. రేపు మరోసారి వాదనలు వింటామన్నారు. మరోవైపు చంద్రబాబు రిమాండ్ ముగియడంతో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయనను న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. చంద్రబాబు రిమాండ్ ను పొడిగిస్తూ జడ్జి ఉత్తర్వులు ఇచ్చారు.
ప్రమోద్ కుమార్ దూబే, చంద్రబాబు నాయుడు తరుపున న్యాయవాది :
చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై వాదనలు వినిపించాను. బెయిల్ పిటిషన్ పై వాదనలు ముగిశాయి. ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి బెయిల్ పిటిషన్ పైన తన వాదనలు వినిపించారు. పోలీస్ కస్టడీపైనా నా వాదనలు వినిపించాను. ఇరువైపులా వాదనలు పూర్తయ్యాయి. రేపు(అక్టోబర్ 6) మరోసారి 12 గంటలకు వాదనలు వింటానని న్యాయమూర్తి అన్నారు.
కడిగిన ముత్యంలా బాబు బయటకు రావడం ఖాయం..
ధీమా వ్యక్తం చేసిన టీడీపీ జాతీయ కార్యదర్శి కాసాని వీరేష్ ముదిరాజ్ :
నాయకులు, కార్యకర్తలు సహనం కోల్పోవద్దని ..మరికొన్ని రోజుల్లో కడిగిన ముత్యంలా బాబు బయటకు రావడం ఖాయమని టీడీపీ జాతీయ కార్యదర్శి కాసాని వీరేష్ ముదిరాజ్ ధీమా వ్యక్తం చేశారు. అక్రమంగా చంద్రబాబు ఫై కేసు పెట్టి టీడీపీ శ్రేణుల ఆత్మస్తైర్యం దెబ్బ తీయాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చూస్తున్నారని
కాసాని వీరేష్ ముదిరాజ్ పేర్కొన్నారు. ఏపీలో జగన్ తెలంగాణాలో కేసీఆర్ లు ప్రజల మద్దత్తు కోల్పోయారని అభద్రతా భావంలో బాబు ఫై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని ఆరోపించారు. టీడీపీ లో ప్రతీ కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేసి పార్టీ గెలుపు కోసం కృషి చేయాలనీ వీరేశ్ పిలుపు నిచ్చారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు