Friday, May 17, 2024

హుక్కా ఫ్లెవర్స్ దొంగిలించి అమ్ముతున్న 4ముఠా సభ్యులను అరెస్ట్..

తప్పక చదవండి
  • నిందితులను అదుపులోకి తీసుకున్న అబిడ్స్ పోలీసులు

హైదరాబాద్ : అర్ధ రాత్రి దుకాణాలు మూసివేసిన తరువాత మాటు వేసి షెటర్లను బద్దలగొట్టి విలువైన వివిధ రకాల హుక్కా పదార్థాలను దొంగలిస్తున్న ముఠా అబిడ్స్ ఎం.జె మార్కెట్ లోని 29న అగర్వాల్ ఛాంబర్ ట్రూప్ బజార్ లోని ఓ హుక్కా షాపులో దొంగతనానికి పాల్పడింది.. దొంగిలించిన హుక్కా ఫ్లేవర్స్ అమ్ముతూ పట్టుబడ్డారు ముఠా సభ్యులు.. నిందితుల నుండి 2.30లక్షల విలువైన హుక్కా ఫ్లేవర్స్,ఒక ఆటో, 2 ద్విచక్ర వాహనాలు, 3 సెల్ ఫోన్ లు స్వాధీనం చేసుకున్నారు అబిడ్స్ పోలీసులు..


నిందితుల వివరాలు : ఏ 1. మొహమ్మద్ ఇర్ఫాన్.. ఏ 2.మొహమ్మద్ సోహైల్.. ఏ 3.మొహమ్మద్ మసూద్.. ఏ 4. మొహమ్మద్ అథేర్..
జల్సాలకు అలవాట్లు పడి ఇలాంటి దొంగతనాలకు పాల్పదుతున్నట్లు తెలిపారు పోలీసులు.. ముఠా లోని సభ్యులందరు చాదర్ ఘాట్ ప్రాంతానికి చెందిన ఒకరికి ఒకరు స్నేహితులే వారు.. ముఠాలోని ప్రధాన నిందితుడు ఏ1 గతంలో కాచిగుడా పోలీసుస్టేషన్ లో పలు కేసులో నిందితుడు.. కేసు నమోదు చేసి కోర్టుకు తరలిస్తున్నట్లు తెలిపారు పోలీసులు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు