Wednesday, May 8, 2024

భారత్‌లో మసగబారుతున్న పార్లమెంటరీ ప్రజాస్వామ్యం

తప్పక చదవండి

మన నూతన పార్లమెంటుకు ఐదు అంచెల పటిష్టమైన భద్రతా వలయానికి బీటలు పడ్డాయి.ఆ రక్షణ వలయాలను ఛేదించుకొని ఇద్దరు గుర్తు తెలియని దుండగులు పార్లమెంటులోనూ,మరో ఇద్దరు పార్లమెంటు వెలుపల ప్రవేశించటం విస్మయాన్ని కలిగిం చింది. ఆ అగంతకుల ఉద్దేశం ఏమైనాప్పటికీ మన పార్లమెంటు సభ్యులకు, మంత్రులకు,సభాపతికీ రక్షణ కల్పించటంలో భద్రతా వైఫల్యం అనేది మరోసారి కొట్టొచ్చినట్లు కనపడిరది. ఈ దుడగులు సభలోకి అధికారికంగా బీజేపీ ఎంపీ నుండి పాసులు సంపాధించి,సజావుగా ప్రవేశించి విజిటర్స్‌ గ్యాలరీనుండి సభలోకి దూకి,ఒక బెంచీ నుండి మరో బేంచీ పైకి లంఘించి గెంతు తూ పసుపు రంగు క్యాన్లతో పొగబెట్టి, అధికార,ప్రతిపక్ష ఎంపీల ను గడగడలాడిరచి,వీరంగం వేయటాన్ని మీడియాలో చూసి ప్రపంచ మే ఆశ్చర్యపోయింది.ఆసమయంలో పార్లమెంటులోపల మార్షల్స్‌, ఇతర రక్షణ సిబ్బంది ఏమైనరో తెలియదు. పార్లమెంట్‌ సభ్యులలో అధికభాగం 60 ఏళ్ళు పైబడిన వృద్దులే. చివరకు వారే అపసోపా లుపడి ఏలాగోలాగా ఆ దుండగులను పట్టుకున్నారు. ఇంత పెద్ధ దుర్ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ కానీ, హోంశాఖ మంత్రి అమిత్‌ షా కానీ,పార్లమెంటు వెలుపల టివీ ఛానల్‌లో యథాలా పంగా మాట్లాడారు తప్పితే,సభా వేదికపై నోరు విప్పకపోవటం ఏమిటి? అన్నది ఇక్కడో పెద్ద ప్రశ్నపైగా ఈసంఘటన పెద్ద విష యం కాదన్నట్టుగా బిజెపినేతలు ప్రకటనలుచేయటంమరీ విచిత్రం రంగు క్యాన్లకు బదులుగా,ఆ దుండగులు ప్రాణాం తక విషవా యువులను వెదజల్లి ఉంటే? మారణఆయుధాలు తెచ్చి ఉంటే! మొత్తం పార్లమెంటు సభ్యుల,మంత్రుల ప్రాణాలకు ఎంత ముప్పు దాపురించేది? ఇంత సీరియస్‌ విషయంలో కూడా బాధ్యత గల దేశ ప్రధాని, హోంమంత్రి సభలోనిజానిజాలను ప్రకటించి, చర్చ ను చేపట్టి ఉంటే బాగుండేది. ప్రతిపక్షాల ఆంధోళనపై ప్రధాన మంత్రిమోడీ చాలా ఆలస్యంగా స్పందిస్తూ, ఈసంఘటన తీవ్రమైన ఉల్లంఘనే అని అంగీకరిస్తూనే,ఈ విషయంలో ప్రతి పక్షాల ఆం దోళన అనవసర రాద్ధాంతం అని ఈసడిరచడం, విపక్షాలపై విమ ర్శలతో ఎదురు దాడికి దిగటం చిత్రంగా ఉంది. ఈ అంశంపై ప్రభుత్వంసభలో ప్రకటన చేయాల్సిందిగా విపక్షాలు పట్టుపడుతు న్నాయి. కేంద్ర ప్రభుత్వం అందుకు ససేమిరా అంటున్నది. దాం తో విపక్షాలు సభలో ఆందోళనకు దిగుతున్నాయి. దీని వల్ల పార్ల మెంటులో నిత్యం గలాభా జరిగి, సభాకార్యక్రమాలకు ప్రతిష్ఠంభన ఏర్పడుతుంది. వాయిదాలు మీద వాయిదాలతో విలువైన సభా సమయం వృథాఅవుతుంది.పార్లమెంటుఉభయసభలనుంచి విపక్ష సభ్యులనుసస్పెండ్‌ చేయడం రివాజైపోయింది. ఇప్పటివరకు ఉభయ సభల్లో ఈ అంశంపై సస్పెండెంట్‌ అయిన సభ్యుల సంఖ్య 141 చేరుకోని రికార్డును సృష్టించటం ఆందోళన కలిగి స్తుంది. ఇంత వరకు మన కేంద్ర ప్రభుత్వం గత తొమ్మిదిన్నర సం వత్స రాలుగా దేశం ఎదుర్కొంటున్న అత్యంత కీలక విషయాల్లో ముఖ్య మైనవి రైతు సమస్యలు, కాశ్మీర్‌ సమస్య, మణిపూర్‌ సమస్య రాజ్య ంగ చట్ట సంస్కరణలు ఏదైనా సరే, పార్ల మెంటులో చర్చలు జరప కుండానే బిల్లులు పాస్‌ చేసుకుంటూ, తనకున్న సంపూర్ణ మెజార్టీ తో, నిరంకుశపోకడలతో ప్రజాస్వామ్య విలువలను హత్య చేస్తున్న దని విపక్షాలుఆరోపిస్తున్నాయి. ఇదిఇలాఉండగా, విపక్షాలు క్రమ శిక్షణ రాహిత్యంతో వ్యవహరిస్తున్నాయని కేంద్ర మంత్రులు ప్రతి విమర్శ చేస్తున్నారు. అసలు, ఆదుండ గుల కు పాసులు ఇచ్చిన బీజేపీ ఎంపీని ఇంత వరకు పోలీసులు అరెస్టు చేయనే లేదు.ఆ బీజేపీ ఎంపీ స్థానంలో కాంగ్రేస్‌ ఎంపీ గానీ, మరో విపక్ష పార్టీ ఎంపీ గానీ పాసు లు ఇచ్చి ఉంటేగనుక ఈపాటికి పార్లమెం ట్‌లో భూకంపం వచ్చి, ఓదుమ్ము రేగేది. ప్రధానీ, హోంమంత్రి వీరావేశంతో తమ దైన హావ, భావ విన్యాసాలతో చెలరేగి పోయేవారు. ‘‘వీరంతా దేశ ద్రోహులు, ప్రజాస్వామ్య హంతకులు, అర్భన్‌ నక్సలైట్లు, పాకి స్తాన్‌, ఆల్‌ ఖైదా, లేదా ఖలిస్థాన్‌ తీవ్రవాద ఏజెంట్లు అంటూ గంటలతరబడి ఉపన్యాసాలుదంచేవారు.వారిపార్టీ శ్రేణులు, ఇతర ఉపశాఖల వందిమాగాధులు నిరసన ర్యాలీలు, రాస్తా రోఖోలు చేసి భీభత్సం సృష్టించేవారు.వారి మీడియా సంస్థలు 24 గంటలు ‘‘పీకలు తెగిన మెకల్లా’’ టీవిచర్చల్లో అరచి,ఫీుపెట్టి ఉండేవారు. దేశ భక్తి గురించి శ్రోతల చెవులు చిల్లులు పడేట్లు మొత్తుకొని, నానాయాగి చేసే వారు. ఇక వారి సంస్థాగత సోషల్‌ (పేయిడ్‌) మీడియా గ్రూ పుల వారి, కారు కూతలకు అద్ధూ అదుపు ఉండేది కాదు. దేశం అంతా రచ్చ,రచ్చ జరిగుండేది. ఏది ఏమైనా, పార్ల మెంట్‌లో అగంతు కులు జరిపిన దాడిని నివారించటంలో భాజపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. పార్లమెంటులో ఎంపిలు మాట్లాడే స్వేచ్ఛను పూర్తిగా కోల్పోయారు. ఈవిధమైన విషమ పరిస్ధితులు దాపురించ డం ప్రజాస్వామ్యానికి, దేశ ప్రతిష్టకు ఎంతమాత్రం క్షేమకరం కాదు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు