Saturday, May 18, 2024

పారబాయిల్డ్‌ బియ్యం ఎగుమతులపై ఆంక్షల పొడిగింపు!

తప్పక చదవండి

న్యూఢిల్లీ : పారాబాయిల్డ్‌ బియ్యం ఎగుమతులపై విధించిన 20 శాతం లెవీని కేంద్రం పొడిగించనుంది. 20 శాతం లెవీని విధిస్తూ ఈ ఏడాది జూలైలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. అయితే ఈ ఆంక్షలు అక్టోబర్‌ 15తో ముగుస్తాయి. దీంతో దేశీయంగా బియ్యం ధరలను అదుపు చేసే నెపంతో మరోసారి ఎగుమతులపై లెవీ అమలును పొడిగించాలని నిర్ణయం తీసుకున్నట్టు బ్లూమ్‌బర్గ్‌ సంస్థ వెల్లడిరచింది. మరోవైపు, చక్కెర ఎగుమతు లపై కేంద్రం ఆంక్షలు విధించనున్నట్టు తెలుస్తోంది. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని బ్లూమ్‌బర్గ్‌ వెల్లడిరచింది. భారత్‌ ఆంక్షలు విధించనున్న నేపథ్యంలో ఈ ఏడాది 2 మిలియన్ల టన్నులకు మించి ఎగుమతులు ఉండకపోవచ్చని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నా యి. దీంతో విదేశాల్లో చక్కెర ధరలకు రెక్కలొచ్చే అవకాశం ఉంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు