Saturday, May 18, 2024

లైంగిక వేధింపుల కారణంతోనే మహిళా మంత్రి రాజీనామా

తప్పక చదవండి

చెన్నై : లైంగిక వేధింపులకు గురైనందుకే మంత్రి పదవికి రాజీనామా చేశానని పుదుచ్చేరి రవాణాశాఖ మంత్రి చందప్రియాంక పేర్కొన్నారు. మంగళవారం ఆమె తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీనికి గల కారణాలను వివరిస్తూ ప్రజలకు ఆమె ఓ లేఖ విడుదల చేశారు. ‘అణగారిన వర్గానికి చెందిన నేను కులపరంగా, లైంగికపరంగా వేధింపులకు గురయ్యాను. ఆధిపత్య శక్తులకు వ్యతిరేకంగా పోరాడుతూ మంత్రిగా కొనసాగలేను’ అని ప్రియాంక లేఖలో పేర్కొన్నారు. దీంతో ఆమెను ఇలా ఇబ్బంది పెట్టింది ఎవరన్న దానిపై చర్చ మొదలైంది. పుదుచ్చేరిలో 40 ఏళ్ల తర్వాత మహిళకు మంత్రివర్గంలో స్థానం లభించగా ఇప్పుడు ఆమె తీవ్ర విమర్శలు చేస్తూ రాజీనామా చేయడం సంచలనంగా మారింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు