Tuesday, April 30, 2024

కాంగ్రెస్‌ నేతల్లో ఉత్సాహం

తప్పక చదవండి
  • రేవంత్‌ రెడ్డితో పలువురు అభ్యర్థుల భేటీ
  • ఎమ్మెల్యేలను క్యాంపుకు తరలించే యోచన
  • కాంగ్రెస్‌ కోసం కష్టపడ్డవారికి రేవంత్‌ కృతజ్ఞతలు

హైదరాబాద్‌ : రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయబో తుందని ఎగ్టిట్‌ పోల్స్‌ అంచనాల ప్రకటించినందున టీ కాంగ్రెస్‌లో ఉత్సాహం వ్యక్తం అవుతోంది. ఇదే సమయంలో ఫలితాల అనంతరం గెలిచిన ఎమ్మెల్యేలను క్యాంపునకు తరించాలనే ఆలోచనతో పార్టీ పెద్దలు ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్‌ తరపున ఎన్నికల్లో పోటీ చేసిన పలువురు అభ్యర్థులు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డితో భేటీ అయ్యారు. పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, ఎ.చంద్రశేఖర్‌, మల్‌రెడ్డి రంగారెడ్డి, బండి రమేష్‌తో పాటు మరికొంత మంది అభ్యర్థులు శుక్రవారం హైదరాబాద్‌లోని రేవంత్‌ రెడ్డి నివాసానికి వెళ్లి కలిశారు. తమ నియోజకవర్గాల్లో ఓటింగ్‌ సరళిని రేవంత్‌ రెడ్డికి వివరించారు.ఈ విషయం కూడా ఈ భేటీలో నేతల మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. చాలా చోట్ల రాత్రి వరకు పోలింగ్‌ జరిగిన నేపథ్యంలో ఆ స్థానాల్లో పోలింగ్‌ సరళిపై పార్టీ నేతలు ఆరా తీస్తున్నారు. పోలింగ్‌ శాతం గెలుపు ఓటముల పై ఎలా ఉండబోతున్నదనేది విశ్లేషించుకుంటున్నారు. పోలింగ్‌ తక్కువ జరిగిన స్థానాలపై ఈ సందర్భంగా కాంగ్రెస్‌ నేతలు ఆరా తీసున్నారు. పోలింగ్‌ ఎందుకు తగ్గిందనే దానిపై విశ్లేషిస్తున్నారు. పోలింగ్‌ శాతం గెలుపు ఓటములపై ఎలా ఉంటుందని చర్చిస్తున్నట్లు సమాచారం. మరోవైపు తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు కోసం శ్రమించిన, సహకరించిన నాయకులు, కార్యకర్తలు, మిత్రులు, అభిమానులు, శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు అంటూ టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి ట్విట్టర్‌ వేదికగా తెలిపారు. గడచిన పదేళ్లుగా అడుగడుగునా అణచివేతలు, దాడులు, కేసులకు వెరవకుండా కాంగ్రెస్‌ చేసిన పోరాటంలో మీరంతా ప్రజల పక్షాన నిటారుగా, నికార్సుగా నిలబడ్డారు.. అని పేర్కొన్నారు. మీ కష్టం, మీ శ్రమ వృధా కాలేదు.. తెలంగాణలో ప్రజాస్వామ్య పునరుద్ధరణలో మీ అందరి పాత్ర మరువలేనిది.. అంటూ అందరికీ అభినందనలు తెలిపారు. దౌర్జన్యం, దోపిడిపై తిరుగుబాటే ఈ సారి జరిగిన అసెంబ్లీ ఎన్నిక అని టీజేఎస్‌ చీఫ్‌, ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. ఎగ్జిట్‌ పోల్స్‌ చూపినట్టు డిసెంబర్‌ 3న ఈ అధికార పార్టీని ఖచ్చితంగా సాగనంపుతారని చెప్పారు. ఇలాంటి సందర్భాలు చాలా అరుదుగా వస్తాయని, కావున ఇదొక అద్భుతమైన ప్రజా చైతన్యమని ఉద్ఘాటించారు. మార్పును కోరి ఈ సారి రెండు సార్లు పట్టం కట్టిన ప్రభుత్వాన్ని దించాలని నిర్ణయించుకున్నారని కోదండరామ్‌ అన్నారు. ఈ అరుదైన సందర్భాన్ని చూడడం కూడా ఓ అదృష్టంగా భావిస్తున్నానని ఆనందం వ్యక్తం చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు