Tuesday, May 7, 2024

రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్..

తప్పక చదవండి
  • డిసెంబర్ 3న బీజేపీ సర్కార్ ఏర్పడుతుంది..
  • ట్రైబల్ యూనివర్సిటీ ఆలస్యంపై క్లారిటీ
  • తెలంగాణలో వచ్చేది బీజేపీనే అని ధీమా వ్యక్తం..
  • కేటీఆర్ సీఎం కావాలి.. కవిత అరెస్ట్ కాకూడదు ఇదే కేసీఆర్ లక్ష్యం..
  • కారు స్టీరింగ్ మజ్లీస్ చేతులో ఉందని ఎద్దేవా..
  • కేసీఆర్ పదేళ్లుగా తన కుటుంబం గురించే ఆలోచిస్తున్నారని విమర్శలు
  • ఆదిలాబాద్ జనగర్జన సభలో విమర్శల వర్షం కురిపించిన అమిత్ షా

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ హైకమాండ్ తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ రెండు పర్యాయాలు రాష్ట్రానికి వచ్చి సభల్లో పాల్గొన్నారు. తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదిలాబాద్ లో నిర్వహించిన బీజేపీ జనగర్జన సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన సీఎం కేసీఆర్ పై ధ్వజమెత్తారు. “చంద్రశేఖర్ రావూ జీ” అని సంబోధిస్తూ విమర్శనాస్త్రాలు సంధించారు. పవిత్ర భూమి ఆదిలాబాద్‌కు రావటం సంతోషకరంగా ఉందన్న అమిత్ షా.. తెలంగాణలో బీజేపీ రాజ్యం తీసుకురావాలని పిలుపునిచ్చారు. కాగా ఈ ఎన్నికల్లో కచ్చితంగా మోదీ నేతృత్వంలో తెలంగాణలో బీజేపీ సర్కార్ ఏర్పడుతుందని దీమాం వ్యక్తం చేశారు. తెలంగాణలో డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ రావాల్సిన సమయం వచ్చిందన్నారు. కేసీఆర్‌ వల్లే గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు ఆలస్యమైందని అమిత్ షా చెప్పుకొచ్చారు. గిరిజన యూనివర్సిటీకి ఏర్పాటు చేసేందుకు.. కేసీఆర్‌ ప్రభుత్వం స్థలం చూపించలేదని.. అందుకే ఇన్ని రోజులు ఆలస్యమైందని కారణం చెప్పారు అమిత్ షా.

కృష్ణా ట్రైబ్యునల్‌ నిబంధనలు మార్చేసి.. తెలంగాణకు ఎలాంటి నీటి ఇబ్బంది లేకుండా ప్రధాని మోదీ చేసినట్టు అమిత్ షా చెప్పుకొచ్చారు. పదేళ్లుగా తెలంగాణలో పేదల సమస్యలను సీఎం కేసీఆర్ ఏమీ తీర్చలేదని… రైతులు, దళితులు, గిరిజనులను ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. కేసీఆర్ కేవలం కేటీఆర్‌ను ఎలా సీఎం చేయాలని మాత్రమే ఆలోచించారని విమర్శించారు. తన కుటుంబాన్నే పట్టించుకున్నారని ఆరోపించారు. గిరిజనుల సంక్షేమం కోసం కేసీఆర్ ఎన్నో హామీలు ఇచ్చారని.. కానీ అవన్నీ మాటలకే పరిమితమయ్యాయని.. ఏవీ అమలుకు నోచుకోలేదని అమిత్ షా ఆరోపించారు. కేసీఆర్‌ ఎన్నికల గుర్తు కారని.. కానీ ఆ కారు స్టీరింగ్‌ మాత్రం మజ్లిస్ పార్టీ చేతుల్లో ఉంటుందని అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆధునిక రజాకార్‌ల నుంచి తెలంగాణను బీజేపీ మాత్రమే కాపాడుతుందని అమిత్‌ షా చెప్పుకొచ్చారు. అయితే.. దేశంలోని దళితులు, గిరిజనుల కోసం మోదీ సర్కార్ తొమ్మిదేళ్లుగా చాలా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని చెప్పుకొచ్చారు అమిత్ షా. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ చట్టం తీసుకొచ్చామని తెలిపారు. ప్రతి పేద మహిళకు గ్యాస్‌ సిలిండర్‌ ఇచ్చామన్నారు. రైతుల ఖాతాల్లో రూ.6 వేలు జమ చేస్తున్నామన్నారు. ఓ నిరుపేద గిరిజన మహిళను రాష్ట్రపతిని చేసిన ఘనత మోదీది అని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పేదల కోసం చేసిందేమీ లేదని.. ఇప్పుడొచ్చి ఏవేమో మాట్లాడుతోందంటూ అమిత్ షా విమర్శించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు