Wednesday, April 24, 2024

నిబద్దతతో కూడిన సర్వే.. ఫోరెన్సిక్ ఎలక్షన్స్ సర్వే..

తప్పక చదవండి
 • ఒక ప్రణాళికతో ఓటర్ల నాడీ తెలుసుకుని గెలుపు గుర్రాల వివరాలు..
 • ఏ పొలిటికల్ పార్టీ కోసమో.. ఏ సంస్థ కోసమో నిర్వహించిన సర్వే కాదు..
 • ప్రజలేమనుకుంటారు..? వారికి ఏమి కావాలి అన్నది సుష్పష్టం..
 • అప్పటికి ప్రజల్లో మూడ్ ను బట్టి కాకుండా.. తమ జీవితాలకు ఏది కావాలో తెలుసుకున్న వాస్తవాలు..
 • భారత్ పొలిటికల్ రీసర్చ్ అండ్ అనలిటిక్స్ సెంటర్ ( బీ – ప్రాక్ ) సంస్థ వారు అందిస్తున్న విస్తుపోయే నిజాలు..
 • ఈ సర్వే ప్రకారం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రానుందా..?
 • సర్వే బృందానికి నేతృత్వం వహించిన డాక్టర్ బాల,
  సోషియో పొలిటికల్ అండ్ లేగో పొలిటికల్ కన్సల్టెంట్..

ఎలక్షన్స్ దగ్గర పడుతున్న కొద్దీ పలు సర్వే సంస్థలు తమ తమ అభిప్రాయాలను వెల్లడిస్తూ ఉంటాయి.. అయితే ఈ సర్వేలన్నీ నిబద్దతతో కూడుకుని ఉన్నాయా..?అన్నది సందేహమే.. ఏ ప్రాతిపదికన ఈ సంస్థలు సర్వేలు చేపడతాయి అన్నది కూడా ప్రశ్నార్థకమే.. పైగా ఒక రాజకీయ పార్టీ ఆదేశాలతోనో, ఒక వ్యక్తి లేదా సంస్థ ఆదేశాలతోనో ఈ సర్వేలు జరుగుతుంటాయి.. సాధారణంగా అలాంటి సర్వేలు ఎవరైతే తమను పురమాయిస్తారో వారికి అనుకూలంగా మాత్రమే వెల్లడి అవుతుంటాయి.. ఇది పచ్చినిజం.. ఈ సర్వేలు వెల్లడించే ఫలితాలు అంత నమ్మకంగా ఉండవు.. కేవలం ఎదుటి పార్టీ వాళ్ళను కన్ఫ్యూజన్ కు గురి చేసేందుకు మాత్రమే పనికి వస్తాయి.. మరికొంత ఓటర్లను కూడా సందేహాలకు గురిచేస్తుంటాయి.. అంత వరకే ఈ సర్వేలను నమ్మగలుగుతాము.. నిజానికి ఓటర్ల మనసులో ఏముంది..? ఎలాంటి నాయకులను ఎన్నుకోదలచుకున్నారు..? ఎలాంటి మేళ్లు ఏర్పడబోయే ప్రభుత్వం నుంచి కోరుకుంటున్నారు..? అన్న విషయాలని పరిగణలోకి తీసుకుని సర్వేలు నిర్వహిస్తున్నారు అన్నది ఇక్కడ పాయింట్.. అయితే మిగతా పేరొందిన సర్వే సంస్థలకు భిన్నంగా భారత్ పొలిటికల్ రీసర్చ్ అండ్ అనలిస్ట్ సెంటర్ ( బీ – ప్రాక్ ) అనే సంస్థ.. ఫోరెన్సిక్ ఎలేచ్షన్స్ సర్వే పేరుతో ఒక నిబద్దతతో కూడిన సర్వేను నిర్వహించింది.. తెలంగాణలో గెలుపు గుర్రాల వివరాలను వెల్లడించింది..

హైదరాబాద్ : పొలిటికల్ సర్వే జరుగుతున్నప్పుడు చాలా సంస్థలు ఏ హోటల్ దగ్గరో, ఏ పచారీ దుఖాణం దగ్గరో, రోడ్ల కూడలిలోనో, సినిమా హాల్స్ దగ్గరో తమ సర్వేలను నిర్వహిస్తూ ఉంటాయి.. కానీ ఆ సమయంలో ఓటరు మానసిక స్థితి ( మూడ్ ) ఎలా ఉంటుందో చెప్పలేము.. సర్వే సంస్థ ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆ క్షణానికి తమకు తోచిన సమాధానం చెబుతుంటారు.. కానీ ముందు ముందు ఆ అభిప్రాయం మారిపోయే ప్రమాదం ఉంది.. అప్పటికి ఓటరు చెప్పిన సమాధానాన్నే ప్రాతిపదికగా తీసుకుని, సర్వే సంస్థలు తుది అభిప్రాయం జాబితాను సిద్ధం చేస్తుంటాయి.. ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నది ప్రశ్నార్థకమే.. ఇలాంటి సర్వేలకు నిబద్దత ఉండదు.. ఈ సర్వేలను ప్రామాణికంగా తీసుకుని ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది..? ఏ అభ్యర్థి విజయం సాధిస్తాడు అన్నది కూడా నిబద్దతతో నమ్మలేము.. నిజానికి ఓ రాజకీయ నాయకుడు తాను ఆటలకు వెళ్ళేటప్పుడు.. ప్రతి ఓటరుకూ మీకు ఇది చేస్తాను.. మీ పిల్లలకోసం ఎదో చేస్తాను అని చెబుతారు.. కానీ నిజంగా ఓటరు మనసులో ఉన్న అసలు, సిసలు అభిప్రాయాన్ని తెలుసుకుని దానికి తగ్గట్టుగా పని చేస్తాను అని చెప్పే ప్రయత్నం ఎవరూ చేయకపోవడం దురదృష్టకరం.. ఏ రాజకీయ పార్టీ అయినా తాము గెలిస్తే శాశ్వతమైన ప్రణాళికలు సిద్ధం చేస్తాం.. సమాజానికి ఉపయోగపడే పనులు చేపడుతాం.. అవసరమైన నిర్మాణాలు చేబడుతాం అని చెప్పే ప్రయత్నం జరగడం లేదు.. ఓటరు నిజంగా కోరుకుంటున్న వాటిని వెలికితీసి ఆ దిశగా ప్రయత్నాలు చేస్తామని చెప్పగలిగే దమ్మున్న పార్టీ గానీ, దమ్మున్న లీడర్ గానీ లేకపోవడం శోచనీయం..

- Advertisement -

అయితే చరిత్రలో తొలిసారిగా తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆలోచనలపై ఫోరెన్సిక్ సర్వేను “బి-ప్రాక్” నిర్వహించింది.
ఇక్కడ వారు రెండు సాధారణ సూత్రాలు/జీవిత ప్రాథమిక సూత్రాన్ని స్వీకరించి ఈ సర్వేను నిర్వహించారు.. అంటే “ఆంత్రోపాలజీ, సైకాలజీ” ఆధారంగా ప్రజల మనస్సుల్లో చొచ్చుకుని వెళ్లి ఫోరెన్సిక్ సర్వే నిర్వహించారు..
ఇక గ్రౌండ్ వర్క్ కోసం ఫార్ములా.. అంటే “పీపుల్స్ ఇమాజినేషన్, పోలరైజేషన్ ఆఫ్ వోటర్స్ క్యాప్చర్” తో సర్వే ఖచ్చిత ఫలితాల కోసం నిర్వహించారు..

కాగా నిబద్దతతో కూడిన ఈ సర్వే ప్రకారం ఈసారి జరుగబోయే సార్వత్రిక ఎన్నికల్లో… తెలంగాణ రాష్ట్రంలో పార్టీలు సాధించే ఓట్ల శాతం.. గెలిచే సీట్ల వివరాలు ఇలా ఉన్నాయి.. :

 • భారతీయ జనతా పార్టీ 2. 98 శాతం ఓట్లు సాధించి.. 1 లేదా 2 స్థానాలు మాత్రమే సాధిస్తుంది..
 • ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ 48. 43 శాతం ఓట్లు సాధించి 65 నుంచి 72 స్థానాలు సాధిస్తుంది..
 • భారత రాష్ట్ర సమితి 36. 87 శాతం ఓట్లు సాధించి 35 నుంచి 40 సీట్లు సాధిస్తుంది..
 • తెలుగు దేశం పార్ట…
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు