Wednesday, April 24, 2024

పి.హెచ్‌.సిలలో డాక్టర్లు అందుబాటులో ఉండాలి

తప్పక చదవండి
  • ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..
  • రైతులకు టార్పాలిన్స్‌ అందజేయాలి..
  • జిల్లా కలెక్టర్‌ ఎస్‌ వెంకట్రావు..

సూర్యాపేట (ఆదాబ్‌ హైదరాబాద్‌) : వర్షాల వల్ల వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో డాక్టర్లు అందుబాటులో ఉండాలని కలెక్టర్‌ తెలిపారు. మంగళవారం వెబ్‌ ఎక్స్‌ ద్వారా సంబంధిత అధికారు లతో కాన్ఫరెన్స్‌ నిర్వహిం చారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ గ్రామాలలో టాంటాం వేసి ప్రజలు అప్రమత్తంగా ఉండే విధంగా తెలపాలన్నారు. డి ఆర్‌ డి ఓ కిరణ్‌ కుమార్‌, డి ఎం ఓ జిల్లాలో మిగిలి ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాల న్నారు.ఇరిగేషన్‌ ఇంజనీర్లు వర్షాలను అంచనా వేసి ట్యాంకులను పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలన్నారు.గ్రామాలలో పంచాయతీ సెక్రటరీలు నీటి నిల్వలు లేకుండా చూడాలని, గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలని కలెక్టర్‌ తెలిపారు. జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య ఎంపీ ఓలు, పంచాయతీ సెక్రటరీలతో సమావేశం నిర్వహించి ప్రజలకు అందుబాటులో ఉండాలని హెడ్‌ క్వార్టర్స్‌ విడిచి వెళ్లవద్దని కలెక్టర్‌ పేర్కొన్నారు. నర్సరీలు, సంపదమనాలు పరిశీలించాలన్నారు. ప్రజలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్‌ తెలియజేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు