Monday, May 13, 2024

మనసున్న మహానేత కెసిఆర్..

తప్పక చదవండి
  • బీఆర్ఎస్ కార్యకర్తలని కంటికి రెప్పలా కాపాడుతున్నాడు..
  • కన్న తండ్రిలా కాపాడుకుంటున్నారు.
  • ప్రజలందరినీ రాజకీయాలకు అతీతంగా చూసుకుంటున్నాడు..
  • కొనియాడిన బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు డాక్టర్ దాసోజు శ్రవణ్..

హైదరాబాద్: ఎవరికైనా కుటుంబ సభ్యుడిని కోల్పోవడం చాలా దురదృష్టకరం. ఆ వ్యక్తి కుటుంబ పెద్ద లేదా ఏకైక జీవనాధారం అయితే మరింత బాధాకరం. ఇది గ్రహించిన సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ కార్యకర్తలందరికి జీవిత బీమాను ప్రవేశపెట్టారు. పార్టీ కార్యకర్తల సంక్షేమం పట్ల ఆయనకు చాలా శ్రద్ధ ఉంది. పార్టీ సభ్యులందరికీ పార్టీ నాయకత్వమే ప్రీమియం చెల్లిస్తుంది. బీఆర్ఎస్ లో వున్న దాదాపు 60 లక్షల మంది సభ్యులందరికీ 2023-24 సంవత్సరానికి జీవిత బీమా కోసం రూ. 25.54 కోట్ల ప్రీమియం పార్టీ నాయకత్వం చెల్లించినట్టు డాక్టర్ దాసోజు శ్రవణ్ తెలిపారు. “బీఆర్‌ఎస్ పార్టీ సభ్యులే కాదు, రాష్ట్రంలోని ప్రజలందరి పట్ల సీఎం కేసీఆర్ ఒకే విధమైన శ్రద్ధను కనబరిచారు. మెజారిటీ జనాభాకు ఏదో ఒక పథకం ద్వారా జీవిత బీమా వర్తించేలా చూశారు. రైతులు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, ఇతర వర్గాలని బీమా పరిధిలోకి తీసుకొచ్చారు. రైతుల సంక్షేమం కోసం కేసీఆర్ రైతు బీమా ప్రవేశపెట్టారు. కేసీఆర్ సర్కారే  ప్రీమియం చెల్లిస్తూ, రైతు బీమా ద్వారా చనిపోయిన రైతు కుటుంబాలకు 5 లక్షల రూపాయల పరిహారం, కేవలం వారం 10 రోజుల్లోపు, అందేలా చర్యలు తీసుకున్నారు. రాజకీయాలకు సంబంధం లేకుండా అందరికి రైతు బీమా వర్తింపచేస్తున్నారు. 2023-24 సంవత్సరానికి, 41.04 లక్షల మంది రైతులకు, రైతు బీమా కోసం కేసీఆర్ ప్రభుత్వం రూ.1,477 కోట్ల ప్రీమియం మొత్తాన్ని ఎల్.ఐ.సి.కి  చెల్లించింది..

శనివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో, మరణించిన పార్టీ కార్యకర్తల కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం చెక్కులను పంపిణీ చేసిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బీ.ఆర్.ఎస్. పార్టీ నాయకత్వం వారిని అన్ని విధాలుగా ఆదుకుంటుందని వారికి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా చెక్కులను పంపిణీ చేయడంతో పాటు, 2023-24 సంవత్సరానికి బీ.ఆర్.ఎస్. కార్యకర్తల జీవిత బీమాను రెన్యూవల్ చేసారు. ఈ కార్యక్రమంలో శాసన సభ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్యే హరిప్రియ, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ డెయిరీ చైర్మన్ సోమ భరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

కేవలం డబ్బులు చెల్లించడమే కాకుండా, కార్యకర్తల బీమా కార్యకలాపాలు నిర్వహించడానికి తెలంగాణ భవన్ లో ప్రత్యేక టీంని, వ్యవస్థని ఏర్పాటు చేసారు.
దేశంలో ఏ రాజకీయ పార్టీ వ్యవస్థాపకుడు లేదా అధినేత తమ పార్టీ కార్యకర్తలపై ఇంత ప్రేమాభిమానాలు, శ్రద్ధ చూపలేదు. బీఆర్ఎస్ కార్యకర్తలని కంటికి రెప్పలా కన్న తండ్రిలా కాపాడుకుంటున్నారు,” అని దాసోజు శ్రవణ్ సీఎం కేసీఆర్ కి క్యాడర్ పట్ల ఉన్న శ్రద్ధను వివరించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు