Monday, May 13, 2024

రోడ్డు వేశారు.. శిథిలాలు మరిచారు..

తప్పక చదవండి
  • కోటి యాభై లక్షల ఖర్చుతో రోడ్డు నిర్మాణం.
  • రోడ్డుకు అడంగా శిథిలాలు వదిలేశారు..
  • నెల రోజులుగా నిలిచిపోయిన రాకపోకలు..
  • పక్షం రోజుల కిందట అత్యవసరంగా వెళుతున్న
    అంబులెన్స్ సైతం వెనిక్కి వెళ్లిన వైనం
  • ఎమ్మెల్యే, కార్పొరేటర్, జిహెచ్ఎంసీ ఇంజినీర్ కు ఎన్ని
    ఫిర్యాదులు చేసినా ఫలితం శూన్యం
  • మాన్ హోల్స్ కి కవర్లు వెయ్యడం మరిచారు..
  • వారం క్రితం ఓ వృద్ధుడు మాన్ హోల్ లో పడిపోయాడు..

హైదరాబాద్ : హుస్సేని అలం నుండి కబూతర్ ఖాన వెళ్లే దారిలో రెండు విడివిడిగా సిమెంట్ రోడ్డులు వేశారు. అయితే ఒక్కరోడ్డుకు మాత్రమే శిథిలాలు తొలగించారు మరొక్క రోడ్డుకు అడ్డంగా వేసిన శిథిలాలను తీయడం మరిచారు. మరోవైపు కొంత దూరంలో ఉన్న పిట్టలోల్ల బస్తీలో(పార్ధి వాడ) కూడా ఇదే రకంగా శిదిలాలు రోడ్డు మధ్యలో వదిలి వెళ్ళారు.. రోడ్డువేసి దాదాపుగా నెల రోజులు కావస్తున్నా శిథిలాలు మాత్రం తొలగించలేక పోయారు. కోట్ల రూపాయలు వెచ్చించి వేసిన రోడ్డుకు సరిగ్గ మ్యాన్ హోల్ కవర్లు కూడా వెయ్యలేదు. కాగా బస్తీవాసులు అటు ఎమ్మెల్యే, కార్పొరేటర్ కి ఫిర్యాదు చెయ్యడంతో పాటు అటు జిహెచ్ఎంసీ ఇంజనీర్ కు సైతం ఫిర్యాదు చేశారు. కానీ ఎవరూ సరిగ్గా చొరవ తీసుకొని శిథిలాలను తొలగించలేదు. ఈ మధ్యనే అత్యవసరంగా వెళుతున్న ఆంబులెన్స్ కి సైతం ఆటంకం ఏర్పడింది. అంతే కాకుండా మ్యాన్ హొల్స్ మూతలు తెరిచివుండడంతో రాత్రివేళ ఓ వృద్ధుడు మాన్ హోల్ లో పడిపోయాడు. ఎలాగో బతికి బయటపడ్డాడు. ఇలా రోడ్డుకు అడ్డంగా శిథిలాలు ఉండడంతో స్థానికులతో పాటు, ఇతరులకు కష్టతరంగా మారింది. పైగా గణేష్ నవరాత్రులు మొదలు కానున్నాయి.. గణేష్ విగ్రహాలను లోడ్ చేసుకొని వస్తున్న లారీలు తప్పిపోయి ఈ మార్గాన వచ్చి దారికి అడ్డంగా ఉన్న శిథిలాలు ఉండడం చూసి వెనెక్కి తీసుకోవడంలో చాలా ఇబ్బందికి గురవుతున్నారు. వెంటనే స్థానిక జిహెచ్ఎంసీ కమిషనర్ చొరవ తీసుకొని సంబంధిత అధికారులకు, కాంట్రాక్టర్ కు అదేశాలిచ్చి రోడ్డుకు అడ్డంగా ఉన్న శిథిలాలను తొలగించాలని స్థానిక కబూతర్ ఖాన వాసులు డిమాండ్ చేస్తున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు