Wednesday, May 15, 2024

తెలంగాణలో వరుసగా ఐటీ సోదాలు

తప్పక చదవండి
  • పైలట్ రోహిత్ రెడ్డి ఇంట్లో ఐటీ దాడులు
  • తాండూర్ తో పాటు మణికొండలోని పైలట్ నివాసానికి అధికారులు
  • ఏకకాలంలో ఐదు చోట్ల తనిఖీలు చేపట్టిన వైనం
  • లెక్కల్లోకి రాని రూ.44 లక్షలు గుర్తించిన అధికారులు
  • కోహినూర్ గ్రూప్స్, కింగ్స్ ప్యాలెస్ యజమానుల ఇళ్లలో సోదాలు
  • రాజకీయ పార్టీకి భారీగా ఫండింగ్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని పలు నేతల నివాసాలపై ఐటీ దాడులు జరగడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల మాజీ ఎంపీ, వీ6 ఛానల్ ఓనర్ వివేక్ వెంకటస్వామి నివాసంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఆ పార్టీ తాండూరు అభ్యర్థి పైలెట్‌ రోహిత్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. వికారాబాద్‌ జిల్లా తాండూరులోని ఆయన నివాసంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాల్లో భారీగా నగదు పట్టుబడినట్లు తెలిసింది. మెుత్తం రూ.20 లక్షల నగదు, పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనుచరుడిని ఐటీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడులపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఇక హైదరాబాద్ పాతబస్తీలోనూ ఐటీ సోదాలు జరుగుతున్నాయి. బడా వ్యాపారుల టార్గెట్‌గా ఈ సోదాలు జరుగుతున్నాయి. తెల్లావారుజాము నుంచే కోహినూర్ గ్రూప్స్ ఎండీ మజీద్ ఖాన్, కింగ్స్ ప్యాలెస్ యజమానుల ఇళ్లల్లో ఈ ఐటీ సోదాలు జరగుతున్నాయి. కోహినూర్, కింగ్స్ గ్రూపుల పేరుతో వీరు నగరంలో ఫంక్షన్‌హాళ్లు, హోటల్స్ నిర్వహిస్తున్నారు. ఒక రాజకీయ పార్టీకి పెద్ద మొత్తంలో డబ్బులు సమకూర్చుతున్నట్లుగా ఐటీ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు.. హైదరాబాద్ పాతబస్తీలోని బడా వ్యాపారుల టార్గెట్‌గా ఐటీ సోదాలు జరుగుతున్నాయి. కోహినూర్ గ్రూప్స్ ఎండీ మజీద్ ఖాన్, కింగ్స్ ప్యాలెస్ యజమానుల ఇళ్లల్లోనూ ఐటీ సోదాలు జరగుతున్నాయి. తెల్లావారుజాము నుంచే పలువురు ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. కోహినూర్, కింగ్స్ గ్రూపుల పేరుతో వీరు నగరంలో ఫంక్షన్‌హాళ్లు, హోటల్స్ నిర్వహిస్తున్నారు. ఒక రాజకీయ పార్టీకి పెద్ద మొత్తంలో డబ్బులు సమకూర్చుతున్నట్లుగా ఐటీ శాఖ అనుమానం వ్యక్తం చేసింది. అందులో భాగంగానే ఈ తనిఖీలు జరిగినట్లు సమాచారం.

- Advertisement -

తాజాగా మంత్రి మల్లారెడ్డి అనుచరుడు, బీఆర్ఎస్ బోడుప్పల్ పార్టీ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి ఇంట్లో సోదాలు జరిగాయి. ఎన్నికల అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సంజీవరెడ్డి నివాసానికి మల్లారెడ్డికి చెందిన డబ్బు భారీ మొత్తంలో చేరిందన్న ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో సోదాలు జరిగాయి. సంజీవరెడ్డిని ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా అడ్డుకుని సోదాలు చేశారు. అయితే, సోదాల్లో ఎలాంటి డబ్బు దొరకకపోవడం గమనార్హం. సోదాల సందర్భంగా సంజీవరెడ్డి ఇంటి ముందు బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు పరస్పరం నినాదాలు చేసుకున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు