Saturday, May 4, 2024

ఎమ్మెల్యే సతీష్ కుమార్ వైఫల్యాలపై కాంగ్రెస్ పార్టీ చార్జి షీట్

తప్పక చదవండి
  • అసమర్ధ ఎమ్మేల్యే పాలనపై ప్రజలకు అవగాహన కల్పించటం కోసమే మా చార్జి షీట్
  • బీజేపీ, బీఆర్ఎస్ వేరు కాదు.. కేసీఆర్ కు హుస్నాబాద్ అంటే సెంటిమెంట్
  • హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్

హుస్నాబాద్ ఎమ్మేల్యే సతీష్ కుమార్ వైఫల్యాలపై, ప్రజలకు అవగాహన కల్పించటం కోసమే చార్జి షీట్ విడుదల చేస్తున్నట్లు
హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీ పార్లమెంటు సభ్యులు పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం హుస్నాబాద్ నియోజక వర్గ కేంద్రం లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో పొన్నం కాంగ్రెస్ పార్టీ 7 మండలాల అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో కలిసి పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో స్థానిక ఎమ్మెల్యే సతీష్ కుమార్ పాలనా వైఫల్యాలపై చార్జిషీటు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసమర్థత ఎమ్మెల్యే సతీష్ కుమార్ పాలన లో హుస్నాబాద్ నియోజక వర్గ అభివృద్ధి కుంటపడింది అని అన్నారు. నియోజక వర్గంలో పేద వాళ్లకు ఒక్క డబుల్ బెడ్ రూం కట్టివ్వ లేదన్నారు. గౌరవెళ్లి, గండి పల్లి ప్రాజెక్టు లు పూర్తి చేయక పోగా, భూ నిర్వాసితులను ఆడా, మగా అని చూడకుండా దురుసుగా ప్రవర్తించి, అర్థ రాత్రి లాఠీ చార్జ్ లు చేసి, అరెస్ట్ చేసి చేతులకు బేడీలు వేసిన ఘనత సతిష్ కుమార్ దేనని అన్నారు. వ్యవసాయాధారిత మైన ఈ ప్రాంతం లో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయలేదన్నారు.
వ్యవసాయ గిడ్డంగుల సామర్థ్యం పెంచే ప్రయత్నం చేయలేదన్నారు. గిరిజనులు ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో గిరిజన సంక్షేమ కోసం ఏమెళ్యే కృషి చేయలేదన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం విషయం లో హుస్నాబాద్ నియోజక వర్గం వెనుక బడిందని అన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలన తో విసిగి పోయిన ప్రజలు ప్రభుత్వాన్ని మార్చాలనుకుంటున్నారని, ఏ గ్రామానికి వెళ్ళినా కాంగ్రెస్ పార్టీకి , తనకు అనూహ్య స్పందన లభిస్తోందని చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే వైఫల్యాల పై మాట్లాడితే వ్యక్తి గతంగా తీస్కుంటున్నారని, ఎమ్మేల్యే సమర్థుడు అయితే ఎందుకు హుస్నాబాద్ నియోజక వర్గాన్ని అభివృద్ధి చేయలేక పోతున్నారో బదులివ్వమని అడిగారు. బిజెపి, బిఆర్ఎస్ వేరు కాదని, వారి ఉద్దేశం వేముల వాడ, సిరిసిల్ల, మాన కొండూరు నియోజక వర్గాల్లో పరిస్థితులు చూస్తే అర్థమవుతుంది అని అన్నారు. హుస్నాబాద్ ను సెంటిమెంట్ గా తీస్కొని ఇక్కడ ముఖ్యమంత్రి సభ నిర్వహించారని, డెవలప్ మెంట్ మాత్రం సిద్దిపేట, గజ్వేల్ కు పరిమితమైందని అన్నారు. ఎమ్మెల్యేకు నిజంగా హుస్నాబాద్ నియోజకవర్గంలో ప్రేమ ఉంటే, ఇంకా తన ఓటు హక్కును హుజురాబాద్ నియోజకవర్గ నుండి ఎందుకు ఇక్కడికి మార్చుకోలేదన్నారు. గౌర వెళ్లి ప్రాజెక్టు దగ్గర కుర్చీ వేసుకుని పూర్తి చేస్తానన్న కేసీఆర్, ఎందుకు ప్రాజెక్టు పూర్తి చేయలేక పోయారు అనే ప్రశ్నకు సమాధానం ఇవ్వాలన్నారు. త్వరలో కాంగ్రెస్ పార్టి కేంద్ర, రాష్ట్ర స్థాయి నాయకులు హుస్నాబాద్ నియోజక వర్గం లో ఎన్నికల ప్రచారం లో పాల్గొంటారని చెప్పారు. ఎంపి గా గెలిపించి పార్ల మెంటుకు పంపిస్తే, తెలంగాణ రాష్ట్ర సాధన లో కీలక పాత్ర పోషించానని, అలాగే ఎమ్మేల్యే గా గెలిపిస్తే హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధి కొరకు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో పిసిసి సభ్యులు, ఏడు మండలాల అధ్యక్షులు, కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు