Saturday, May 18, 2024

దీపావళి టపాసుల ఎఫెక్ట్

తప్పక చదవండి
  • సరోజినిదేవి ఆసుపత్రికి పేషెంట్ల క్యూ
  • జాగ్రత్తలు అవసరమంటున్న డాక్టర్లు

దీపావళి పండుగలో పలు చోట్ల అపశ్రుతులు చోటు చేసుకున్నాయి. ఆనందంగా బాణసంచా కాల్చుతూ పలువురు చిన్నారులు గాయపడ్డారు. వారి కళ్లకు గాయాలు అయ్యాయి. దీంతో వారిని హైదరాబాద్‌లోని సరోజినిదేవి కంటి ఆస్పత్రికి పేషంట్లు క్యూకడుతున్నారు. నగరంలోని పలు ప్రాంతాల నుంచి సుమారు 60 మంది ఇప్పటికే కంటి సమస్యలతో హాస్పిటల్‌లో చేరారు. ఆసుపత్రిల జాయిన్ అయ్యిన వారంత దీపావళి సందర్భంగా టపాసులు పేలుస్తూ గాయపడినవారే. వీరిలో ఎక్కువ మంది పెద్దవాళ్లే కాటవం గమనార్హం. టపాసులు కాల్చే సమయంలో చేతి వేళ్లతో పాటు కళ్ళు కూడా ప్రమాదానికి గురయ్యే అవకాశముంది. చిన్నారులు, గర్భిణులు, ఆస్తమా వ్యాధిగ్రస్తులు, సీనియర్‌ సిటిజన్లు గాయపడే ప్రమాదం ఉందం ఉంటుంది. అందువల్ల వారు టపాసులకు దూరంగా ఉండటం ఉత్తమం. టపాసులు పేల్చడానికి ముందు, ప్యాకింగ్‌లపై ఉండే సూచనలు తప్పకుండా పాటించాలి. అగ్నిప్రమాదాలు జరిగే అవకాశం గల ప్రాంతాలకు దూరంగా మాత్రమే టపాసులు పేల్చాలి. భవనాలు, చెట్లు, పూరిగుడిసెలు , ఎండుగడ్డి లాంటి చోట బాణాసంచా పేల్చడం వల్ల ప్రమాదాలు జరిగే ఛాన్స్ ఉంది.

పిల్లలు టపాసులు కాల్చేటప్పుడు పెద్దలు పక్కనే ఉండాలి. దగ్గరుండి వారితో టపాసులు కాల్పించాలి. పెద్ద శబ్దం వచ్చే బాంబులకు పిల్లలను దూరంగా ఉంచాలి. దీపావళి సామగ్రికి సమీపంలో కొవ్వొత్తులను, అగరువత్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉంచవద్దు. టపాసులు కాల్చేటప్పుడు నిర్లక్ష్యంగా ఉంటే చూపు కోల్పోయే ప్రమాదం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. అందువల్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు