Sunday, May 19, 2024

బిఆర్‌ఎస్‌ను విమర్శించే అర్హత కాంగ్రెస్‌కు లేదు

తప్పక చదవండి
  • రేవంత్‌ మాటలను ప్రజల గమనించాలి : మంత్రి హరీశ్‌రావు

ఆదిలాబాద్‌ : 55 ఏళ్లు పాలించి తెలంగాణకు ఏమి చేయలేని కాంగ్రెస్‌ పార్టీ బిఆర్‌ఎస్‌ను విమర్శించే స్థాయి లేదని, నాడు కరెంటు ఉంటే వార్త… నేడు తెలంగాణ లో కరెంటు పోతే వార్త అని మంత్రి హరీష్‌ రావు అన్నారు. ఉట్నూర్‌లో బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పాలిత కర్ణాటకలో కేవలం 3 గంటల కరెంటు మాత్రమే ఇస్తున్నారన్నారు. 3గంటల కరెంటు చాలని రేవంత్‌ రెడ్డి పేర్కొనడం దుర్మార్గమన్నారు. 24 గంటల కరెంటు కావాలంటే బీఆర్‌ఎస్‌కు ఓటు వేయాలన్నారు. బీజేపీ వాళ్ళు కరెంటుకు విూటర్లు పెట్టాలని, బిల్లులు వసూలు చేయాలని అంటున్నారని హరీష్‌ రావు పేర్కొన్నారు. కేసీఆర్‌ మాత్రం ఒప్పు కోవడం లేదని.. అందుకే రాష్ట్రంపై కేంద్రం అక్కసు పెంచుకుందన్నారు. బీఆర్‌ఎస్‌ పథకాలను కాంగ్రెస్‌ కాపీ కొట్టిందన్నారు. రైతు బంధు సృష్టికర్త కేసీఆర్‌ అని.. అలాంటి రైతులను మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్‌ పార్టీదన్నారు. ఖానాపూర్‌లో జాన్సన్‌ను గెలిపించాలని హరీష్‌ రావు కోరారు. జాన్సన్‌ తమ కుటుంబ సభ్యుడని.. అభివృద్ధి పూచీ తమదని అన్నారు. పోడు పట్టాలు రాని రైతులకు కూడా రైతు బంధు ఇస్తామన్నారు. బీజేపీ వాళ్ళు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారని హరీష్‌ రావు ప్రశ్నించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు