- సరైన సమయంలో విజ్ఞతతో కూడిన నిర్ణయం
తీసుకున్న కాంగ్రెస్ అధిష్టానం.. - నీలం మధు ముదిరాజ్ ను పార్టీలోకి ఆహ్వానించిన ఖర్గే..
- ఏ పార్టీ తనను ఆదరిస్తే.. ఆపార్టీని గుండెల్లో పెట్టుకుంటామని
ఎప్పుడో చెప్పిన నీలం మధు ముదిరాజ్.. - కాంగ్రెస్ పార్టీ నిర్ణయంతో నూతనోత్సాహంతో ముందుకు..
- నీలం మధును ఆదరించే ముదిరాజ్ వర్గం ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా
కాంగ్రెస్ ను ఆదరించే సువర్ణావకాశం.. - కాంగ్రెస్ తీసుకున్న ఈ నిర్ణయం కలిసొచ్చే అంశం..
- ఇక పఠాన్ చెరులో కాంగ్రెస్ కు ఎదురులేదంటున్న ప్రజలు..
- బీ.ఆర్.ఎస్. కాంగ్రెస్ పార్టీల్లో మొదలైన గుబులు..
హైదరాబాద్ : ఎట్టకేలకు పఠాన్ చెరు ప్రజా నాయకుడు నీలం మధు ముదిరాజ్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.. ఆయనకు ఏ పార్టీ వారు ఆహ్వానం పలుకుతారో అన్న మీమాంశకు తెరపడింది.. కాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 60 లక్షలకు పైగా ఓట్లున్న ముదిరాజ్ సామాజిక వర్గానికి ఒక్క టికెట్ కూడా ఇవ్వకుండా ఘోరంగా అవమానించిన కేసీఆర్ కు తగిన బుద్ధి చెప్పారు కాంగ్రెస్ పెద్దలు.. నీలం మధు ముదిరాజ్ చేరికతో కాంగ్రెస్ పార్టీకి ఎంతో బలం చేకూరింది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ముదిరాజ్ సామాజిక వర్గం, మధు తన అభిమానులు, గత ఐదు సంవత్సరాల నుంచి పటాన్చెరు నియోజకవర్గంలో ఎన్.ఎం.ఆర్. యువసేన పేరుతో ప్రజలకు దగ్గరగా ఉంటూ.. వారికి అవసరమైన సేవలు అందిస్తూ.. నిత్యం ప్రజా క్షేత్రంలో ఉంటూ.. నీలం మధు తన కంటూ సొంత కార్యకర్తలను, అభిమాన గణాన్ని సంపాదించుకోవడంలో కృతకుత్యులు అయ్యారని చెప్పవచ్చు.. కాగా తాను సంపాదించుకున్న అవ్యాజమైన ప్రేమ, అనురాగాలతో ఓట్లు అత్యధికంగా పడటానికి అవకాశం ఉంది.. మరీ ముఖ్యంగా ఉమ్మడి మెదక్ జిల్లా, రంగారెడ్డి జిల్లాల నీలం మధు ప్రభావం అత్యధికంగా చూపే అవకాశం ఉందన్నది అక్షర సత్యం.. ఇక పటాన్చెరులో తన సామాజిక వర్గం ఓట్లతో పాటు, ఆయనను ఎంతగానో అభిమానించే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ లతో బాటు సంపన్న వర్గాల ఓట్లతో.. నీలం బంధు ఊహించని విధంగా అత్యధిక మెజార్టీతో గెలవనున్నట్లు నియోజక వర్గ వ్యాప్తంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.. ఏది ఏమైనా కాంగ్రెస్ అధిష్టానం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుందని రాజకీయ విశ్లేషకులు సైతం అంటున్నారు.. ఎట్టకేలకు పఠాన్ చెరులో బీ.ఆర్.ఎస్. కోటకు బీటలు వారే సమయం ఆసన్నమైందని మేధావులు చెబుతున్నారు..