Tuesday, October 15, 2024
spot_img

మహిళలకు ఉచిత బస్సులను ప్రారంభించిన సిఎం, ప్రొటెం స్పీకర్‌

తప్పక చదవండి

హైదరాబాద్‌ : మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని సీఎం రేవంత్‌, మంత్రులు, ప్రొటెం స్పీకర్‌ ప్రారంభించారు. శాసన సభ ఆవరణలో మహాలక్ష్మి, చేయూత పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ నుంచి ఎక్కడకి అయినా బస్సుల్లో ఇక నుంచి ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. ఎక్స్‌ప్రెస్‌, ఆర్డినరీలలో ఉచితం. అసెంబ్లీ ఆవరణలో మూడు బస్‌లను ప్రారంభించారు. ఆరోగ్య శ్రీ పథకాన్ని సైతం సీఎం రేవంత్‌ ప్రారంభించారు. వరల్డ్‌ ఛాంపియన్‌, కామన్వెల్త్‌ గోల్డ్‌ మెడలిస్ట్‌, బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌కు పారిస్‌ ఒలింపిక్స్‌ సన్నద్ధత కోసం రూ.2 కోట్ల చెక్‌ను రేవంత్‌ అందించారు. ఈ సందర్భంగా రేవంత్‌ మాట్లాడుతూ.. ఈరోజు తెలంగాణ ప్రజలకు పండగరోజన్నారు. 2009, డిసెంబర్‌ 9న తెలంగాణ ప్రక్రియ ప్రారంభమైందన్నారు. తెలంగాణ తల్లి అంటే సోనియమ్మ రూపం కనిపిస్తుందన్నారు. తనది తెలంగాణ అని చెప్పుకునే అవకాశం మనకు సోనియమ్మ ఇచ్చారని రేవంత్‌ కొనియాడారు. తెలంగాణ ప్రజల కోసం సోనియమ్మ ఆరు గ్యారంటీలను ఇచ్చారన్నారు. ఇవాళ ఆరు గ్యారంటీలలో రెండు గ్యారంటీలను అమలు చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుందన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10లక్షల వరకు ప్రజలకు ఉచిత వైద్యం అందిస్తామన్నారు. మహిళలు ఈరోజు నుంచి రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించవచ్చన్నారు. ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని హావిూ ఇచ్చారు. తెలంగాణను సంక్షేమ రాజ్యంగా మారుస్తామని రేవంత్‌ తెలిపారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు