Thursday, February 29, 2024

అమరవీరుల స్తూపం వద్ద బీఆర్‌ఎస్‌ నేతల నివాళి

తప్పక చదవండి

హైదరాబాద్‌ : గన్‌పార్క్‌లోని అమరవీరుల స్తూపం వద్ద బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు అమరులకు నివాళులర్పించారు. శనివారం ఉదయం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు హరీశ్‌ రావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, మల్లారెడ్డి సహా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా బీఆఎస్‌ఎల్పీ నేతగా పార్టీ అధినేత కేసీఆర్‌ను ఎన్నుకున్నారు. అనంతరం అసెంబ్లీ సమావేశానికి బయల్దేరారు. ఈ క్రమంలో అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ కోసం ప్రాణాలు త్యాగం చేసిన అమరులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ అమరులకు జోహార్లు.., జై తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు. అనంతరం శాసనసభకు చేరుకున్నారు. బీఆర్‌ఎస్‌ ఎల్పీ నేతగా కేసీఆర్‌ను ఎన్నికున్నట్లు తీర్మానాన్ని స్పీకర్‌, అసెంబ్లీ కార్యదర్శికి అందిచనున్నారు. కాగా, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్‌ అక్బరుద్దీన్‌ ఒవైసీ మరికాసేపట్లో ప్రమాణం చేయించనున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు