Monday, May 6, 2024

బంగాళదుంపకు, ఉల్లిగడ్డకు సిఎం తేడా తెలియదు : చంద్రబాబు

తప్పక చదవండి

బాపట్ల : మిచౌంగ్‌ తుపాను భయంకరంగా వచ్చిందని.. లోతట్టు కాలనీలోని రెండు మూడు రోజులు నీళ్లలోనే ఉన్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. నేడు ఆయన బాపట్లో విూడియాతో మాట్లాడుతూ బాపట్ల ఒక జిల్లా హెడ్‌ క్వార్టర్‌ అని.. అలాంటి జిల్లా కేంద్రంలో కాలనీలు నీటమునగటం దారుణమన్నారు. టీడీపీకి ఓటు వేశారని ఎస్టీ కాలనీ వాసులను ప్రభుత్వం పట్టించుకో లేదన్నారు. యానాదులు ఎప్పుడూ టీడీపీకి అండగా ఉన్నారని చంద్రబాబు తెలిపారు. యానాదులు ఆర్థికంగా బాగా వెనకబడి ఉన్నారన్నారు. ముఖ్యమంత్రికి ఉల్లిపాయకి, బంగాళదుంపకి తేడా తెలియదని చంద్రబాబు పేర్కొన్నారు. ఐదేళ్ల క్రితం హుద్‌ హుద్‌ తుపాను సమయంలో 25 కేజీలు బియ్యం, ఐదు వేలు నగదు ఇచ్చామన్నారు. ఈ ప్రభుత్వం మాటలు చెప్తుంది తప్ప పేదలని ఆదుకునే పరిస్థితి లేదన్నారు. యానాదులందరినీ ఆదుకుంటామన్నారు. యానాదుల్లో సైతం రాజకీయ చైతన్యం వచ్చి నాయకులుగా ఎదగాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
ఉల్లిగడ్డకు బంగాళాదుంప తేడా తెలియకపోవటం దురదుష్టకరం : దేవినేని ఉమ
రాష్ట్రంలో వ్యవసాయ భూములకు సాగు నీరు అందించడంలో వైసీపీ విఫలం అయ్యిందని.. ఓ ప్రణాళిక లేకపోవడమే దీనికి కారణమని మాజీ మంత్రి దేవినేని ఉమ విమర్శలు గుప్పించారు. శనివారం విూడియాతో మాట్లాడుతూ మూడు రోజుల క్రితం కురిసిన వర్షానికి, తుఫాన్‌ ప్రభావంతో అన్ని రకాల పంటలు నాశనం అయ్యాయన్నారు. ఉల్లిపాయకి.. బంగాళాదుంపకి తేడా తెలియని వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారని ఎద్దేవా చేశారు. 8 మంది కౌలు రైతులు చనిపోయారన్నారు. మూడు నెలల్లో తెలుగుదేశం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నీట మునిగిన పంటను చూడడానికి వెళ్తే తమ దగ్గరికి పోలీసులు వచ్చి ఫొటోలు తీస్తున్నారన్నారు. అప్పులు చేసి పంట వేస్తే నోటి దగ్గరకు వచ్చిన పంట నాశనం అయ్యిందన్నారు. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని దేవినేని ఉమా పేర్కొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు