Monday, May 6, 2024

డ్రోన్లతో శత్రుదేశాలను చెక్..

తప్పక చదవండి
  • భారత్ భద్రతా విషయంలో కీలక నిర్ణయాలు..
  • చైనా, పాకిస్తాన్ కు దడ పుట్టించేలా..
  • సరిహద్దుల్లో అధునాతన డ్రోన్లను మోహరించిన
    ఇండియన్ ఎయిర్ ఫోర్స్..
  • వార్డెన్ ఆఫ్ నార్తన్ స్క్వాడ్రాన్ కింద డ్రోన్ల ఆపరేషన్..
  • శాటిలైట్లతో లింక్ ఏర్పాటు..
  • 35 వేల ఆడుగుల ఎత్తులో ఎగిరే సత్తా వున్న డ్రోన్లు..
    న్యూ ఢిల్లీ : చైనా, పాకిస్తాన్‌కు దడ పుట్టించేలా భారత్ భద్రతా విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే లడఖ్ సహా కాశ్మీర్ తదితర ప్రాంతాల్లో అత్యాధునిక ఫైటర్ జెట్లను మోహరించిన భారత ప్రభుత్వం.. మరో కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా.. సరిహద్దుల్లో అధునాతన డ్రోన్లను మోహరించింది ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌. హెరాన్‌ Mk 2 డ్రోన్లను సరిహద్దుల్లో మోహరించారు. వార్డెన్‌ ఆఫ్‌ నార్తన్‌ స్క్వాడ్రాన్‌ కింద ఈ డ్రోన్లను ఆపరేట్‌ చేస్తున్నారు. మానవరహిత డ్రోన్లతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని ఎయిర్‌ఫోర్స్‌ అధికారులు చెబుతున్నారు. చైనాతోపాటు పాకిస్తాన్‌ సరిహద్దులపై హెరాన్‌ ఎం.కె. 2 డ్రోన్లతో వైమానికదళం నిఘా పెట్టింది. శాటిలైట్లతో వీటికి లింక్‌ను ఏర్పాటు చేశారు. మైనస్‌ డిగ్రీల ఉష్ణోగ్రతల్లో కూడా సులభంగా ఈ డ్రోన్లను ఆపరేట్‌ చేయవచ్చు. ఎలాంటి వాతావరణంలోనైనా ఎగిరే సామర్ధ్యం వీటికి ఉంది. ఇంటెలిజెన్స్‌ సేకరణకు, నిఘాకు ఈ డ్రోన్లు చాలా ఉపయోగపడతాయి. ఇజ్రాయెల్‌ ఎయిరోస్పేస్‌ ఇండస్ట్రీస్‌ ఈ డ్రోన్లను తయారు చేసింది. 35 వేల అడుగులో ఎగరే సత్తా ఈ డ్రోన్లకు ఉంది. 150 నాట్ల వేగంతో ప్రయాణం చేస్తాయి. మొత్తం 97 డ్రోన్లను భారత్‌ దిగుమతి చేసుకుంటోంది. ప్రాజెక్ట్‌ చీతా కింద డ్రోన్ల తయారీకి కేంద్ర చాలా ప్రాధాన్యతను ఇస్తోంది.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు