- ప్రత్యేక రాయితీలు ప్రకటించిన టి.ఎస్.ఆర్.టీ.సి.
- పల్లె వెలుగుతో పాటు హైదరాబాద్ సిటీ
సాధారణ ప్రయాణికులకు వర్తింపు.. - టి-24 టికెట్ కేవలం రూ. 75 లేక్ ఇవ్వాలని నిర్ణయం..
- పంద్రాగస్టు రోజున మాత్రమే ఈ రాయితీలు వర్తిస్తాయి..
- ఒక ప్రకటనలో తెలియజేసిన టి.ఎస్.ఆర్.టి.సి. యాజమాన్యం..
హైదరాబాద్ : భారతదేశ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తన ప్రయాణికులకు ప్రత్యేక రాయితీలను ప్రకటించింది. టీఎస్ఆర్టీసీ పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణించే సీనియర్ సిటిజన్లతో పాటు హైదరాబాద్ సిటీలోని సాధారణ ప్రయాణికులకు టికెట్‌లో భారీ రాయితీలను కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తిరిగే పల్లె వెలుగు సర్వీసుల్లో వెళ్లే సీనియర్ సిటీజన్లకు టికెట్ ధరలో 50 శాతం రాయితీ.. అలాగే హైదరాబాద్ నగరంలో టి-24 టికెట్‌ను కేవలం రూ.75లకే ఇవ్వాలని నిర్ణయించింది. పిల్లలకు అయితే టి-24 టికెట్‌ను రూ.50లకే ఇవ్వనుంది. అయితే ఈ నెల 15న అంటే స్వాతంత్య్ర దినోత్సవం రోజున మాత్రమే ఈ రాయితీలు ప్రయాణికులకు వర్తిస్తాయని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం స్పష్టం చేసింది.