Monday, June 17, 2024

బస్సు యాత్రలోనే అభ్యర్ధుల పేర్లు ప్రకటిస్తాం..

తప్పక చదవండి
 • సంచలన కామెంట్స్ చేసిన టీటీడీపీ చీఫ్ కాసాని జ్ఞానేశ్వర్..
 • తెలంగాణాలో తెలుగుదేశం 119 స్థానాల్లో పోటీ చేస్తుంది..
 • బీసీలకు, మహిళలకు, యువతకే పెద్ద పీట వేస్తాం..
 • మల్కాజ్గిరి పార్లమెంట్ అధ్యక్షుని ప్రమాణ స్వీకార సభలో
  కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ వెల్లడి..

  హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో తెదేపా 119 స్థానాల్లో పోటీ చేస్తుందని.. మహిళలకు, యువతకు పెద్ద పీట వేస్తామని టీటీడీపీ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ప్రకటించారు.. ఈ మేరకు ఆయన ఆదివారం తెలంగాణ తెలుగుదేశం పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ అధ్యక్షున్ని ప్రమాణ స్వీకార కార్యక్రమం, బాచుపల్లిలోని ఆ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. మల్కాజగిరి పార్లమెంట్ అధ్యక్షుడు గా అశోక్ కుమార్ గౌడ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ మాట్లాడుతూ.. నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన అధ్యక్షునికి, ఆ కమిటీకి శుభాకాంక్షలు తెలియజేశారు. వచ్చే ఎన్నికల్లో తెదేపా ఏమి చేస్తుంది..? ఏమి చెయ్యాలో..? ఇంతకుముందు ఏమి చేసిందో..? రేపటి బస్సుయాత్ర వివరిస్తామన్నారు. దానితో పాటు తెలుగుదేశం అభ్యర్ధుల పేర్లను కూడా బస్సు యాత్రలో ప్రకటిస్తామని పేర్కొన్నారు.
  తెలంగాణాలో తెలుగుదేశం 119 స్థానాల్లో పోటీ చేస్తుంది :
  తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ 119 స్థానాల్లో పోటీ చేస్తుందని నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ పిలుపునిచ్చారు. 119 నియోజక వర్గాల్లో నిలబడుతూ.. టీడీపీ తన సత్తా చూపిస్తుందని పేర్కొన్నారు. టీడీపి లేదు అంటూనే బిజేపి, బిఆర్ఎస్, కాంగ్రేస్ పార్టీలు బయపడుతున్నాయని పేర్కొన్నారు. ఖమ్మం సభ ద్వారా టీడీపి తన సత్తాను నిరూపించుకుందని అన్నారు. పార్టీ ఎక్కడ ఉందో తెలపడానికి… గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల బహిరంగ సభ పెట్టి మా సత్తా ఏంటో చూపించాలా అని ఘాటు వాఖ్యలు చేసారు. వచ్చే ఎన్నికల్లో కుటుంబ పాలనకు స్వస్తి చెబుతానని అన్నారు. తెలంగాణ ప్రాంతంలో.. వార్డు, బూత్, కమిటీలు వేసి నియోజక వర్గ ఇంచార్జీలు.. నిత్యం ప్రజల్లో ఉండాలని సూచించారు. బిజేపి, బిఆర్ఎస్ నిలబెట్టిన స్థానాల్లో.. గ్రేటర్లో ఉన్న 24 స్థానాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని 119 నియోజక వర్గాల్లో అనేక మంది.సైకిల్ గుర్తు, టీడీపికి తమ ఓట్లు వేస్తారని స్పష్టం చేశారు. మొన్న వచ్చిన వరదల్లో ములుగు ప్రాంత బాధిత కుటుంబాలకు టీడీపీ అండగా నిలబడిన సన్నివేశాన్ని కాసాని జ్ఞానేశ్వర్ సమావేశంలో వివరించారు. ప్రజలకు దుప్పట్లు, బియ్యం, నిత్యావసర వస్తువులు, మనిషికి రూ .10 వేలు ఇచ్చి ప్రజలకు బరోసా కల్పించి వారి కుటుంబాలకు అండగా నిలిచిందని అన్నారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు బస్సు యాత్ర నిర్వహిస్తున్నట్లు పార్టీ కార్యకర్తలు, నాయకులు శక్తి వంచన లేకుండా పనిచేసి బస్సు యాత్రను విజయవంతం చేయాలని కోరారు.
  టీడీపీ విజయాన్నీ ఏ శక్తి అడ్డుకోలేదు :
  టీడీపీ జాతీయ కార్యదర్శి కాసాని వీరేష్ ముదిరాజ్ :
  టీడీపీ క్రమశిక్షణ, నిబద్దత కలిగిన పార్టీ అని టీడీపీ జాతీయ కార్యదర్శి కాసాని వీరేష్ ముదిరాజ్ పేర్కొన్నారు. ప్రజల్లో టీడీపీ మీద ఉన్న ఆదరణ ఇంకా ఎక్కడా చెక్కు చెదరలేదని ఆయన అన్నారు. నాయకులు, కార్యకర్తలు ప్రజలు చేరువయ్యి నియోజక వర్గంలో చేపట్టబోయే సంక్షేమ పథకాలను వివరించాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రంలోని 17 పార్లమెంట్ 119 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తుందని వీరేష్ అన్నారు. టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ముందుగా ప్రకటించిన విధంగా బీసీలకు, మహిళలకు, యువతకే పెద్ద పీట వేస్తామని పేర్కొన్నారు. ధనమే పరమావధిగా సాగుతున్న రాజకీయ సంగ్రామంలో టీడీపీ నూతన ఒరవడిని సృష్టిస్తుందని జోష్యం చెప్పారు.. రూ.100 ఖర్చు చెయ్యి రూ. లక్ష సంపాదించుకో అనే విష సంస్కృతికి టీడీపీ చరమగీతం పాడాలనుకుంటుందని వీరేష్ పేర్కొన్నారు. ఎటువంటి అవీనితికి, అక్రమాలకు పాల్పడని నికార్సైన నాయకులు టీడీపీలో లెక్కకు మించి ఉన్నారని స్పష్టం చేసిన వీరేష్.. ప్రజలు అంకితభావంతో పనిచేసే అభ్యర్థులనే గెలిపించుకోవాలని సూచించారు. వచ్చే ఎన్నికలు తెలంగాణ రాష్ట్రానికే కాదు యావత్ దేశానికే కీలకం కానునున్నాయని.. అవినీతి పాలనలు అంతం కావాలంటే టీడీపీ వంటి క్రమశిక్షణ కలిగిన పార్టీ అధికారంలోకి రావాలని అన్నారు. నాయకులు, కార్యకర్తలు ఇరువురు సమన్వయంతో పనిచేస్తే గెలుపు దానంతట అదే వస్తుందని స్పష్టం చేశారు.
  తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ :
  టీడీపీకి పాత రోజులు పోయి కొత్త రోజులు వచ్చాయని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. టెక్నాలజీ మార్పుతో పాటు అందరు మారాలన్నారు. ఓటర్ లిస్టు అర్హులైన వారిని ఎన్రోల్ మెంట్ చేసి, అందరిని ఓటరు లిస్టులో చేర్చాలని సూచించారు. అర్హులయిన అందరినీ చేర్చి , అనర్హులను దూరం పెట్టాలని, మన భవిష్యత్తు ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. 17 వ పార్లమెంట్ లో కీలకంగా ఉండాలని తెలిపారు. ఫామ్ నంబర్ 6, 7 ఉన్నాయని, పార్టీ గురించి వ్యతిరేకంగా ప్రచారం చేస్తే.. సోషల్ మీడియాలో వాటిపై కౌంటర్ ఇవ్వాలని పేర్కొన్నారు.
  జాతీయ అధికార ప్రతినిధి తిరుమలగిరి జ్యోత్స్న మాట్లాడుతూ :
  పేదల కోసం గాంధీ హాస్పిటల్ నుండి సేవలందించింది ఒక్క టిడిపినేనని జాతీయ అధికార ప్రతినిధి తిరుమలగిరి జ్యోత్స్న పేర్కొన్నారు.. గీతం, నల్సార్, ఉర్దూ యూనివర్సిటీలను ఏర్పాటు చేసిన ఘనత టీడీపీకే దక్కుతుందని అన్నారు. హైదరాబాద్ లో సైబరబాద్ నిర్మాణం చేసిందని ఆమె గుర్తుచేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు సామ భూపాల్ రెడ్డి, కాట్రగడ్డ ప్రసూన, ప్రధాన కార్యదర్శులు జక్కిలి ఐలయ్య యాదవ్, అజ్మీరా రాజు నాయక్, జివిజి నాయుడు, ఆరిఫ్, వెంకటేశ్వర్లు, అధికార ప్రతినిధులు సూర్యదేవర లత, ఏ.ఎస్ రావు.. రాష్ట్ర కార్యనిర్వక కార్యదర్శులు మందూరి సాంబశివరావు, సాయి తులసీ, బిక్షపతి, ఎడ్ల మల్లేష్, గడ్డి పద్మావతి, యలమంచిలి గాంధీ, మహిళ విభాగం అధ్యక్షురాలు భవనం షకీలా రెడ్డి, రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు పోలకంపల్లి అశోక్ కుమార్, బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీపతి సతీష్, లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు రాఘవేంద్ర ప్రతాప్, మైనారిటీ సెల్ అధ్యక్షులు హాబిబ్, టిడిపి రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షులు కృష్ణ, తెలుగుదేశం పార్టీ సాంస్కృతిక సారథి చంద్రహాస్, ఐటీడీపి రాష్ట్ర అధ్యక్షులు హరికృష్ణ, హైదరాబాద్ పార్లమెంట్ అధ్యక్షుడు అలీ మస్కాతి, మల్కాజిగిరి పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు శంకర్ గుప్తా, ఉప్పు రామ్, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు సుంకు వెంకటేష్, ఎల్.బి నగర్ టిడిపి ఇంచార్జీ ఎస్వీ కృష్ణ ప్రసాద్, నిజాంపేట్ కార్పొరేషన్ అధ్యక్షులు అనిల్, చింతమనేని కవిత పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన సభ్యులతో పాటు, పలువురు రాష్ట్ర పార్టీ నాయకులు.. అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ను, టీడీపీ జాతీయ కార్యదర్శి కాసాని వీరేష్ ముదిరాజ్ లను సన్మానించారు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు